Ollie Pope Comments On Virat Kohli: ఇక మైదానంలో అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ తో ప్రత్యర్థి జట్టుకు భారత ప్లేయర్లు హెచ్చరికలు పంపారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఉపసారథి ప్లేయర్ పోప్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అతడు భారత సారథి గిల్ ను ప్రశంసిస్తూనే.. కోహ్లీ గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. అంతేకాదు ఇప్పుడు గిల్ మీద విపరీతమైన ఒత్తిడి ఉందని.. అతడు కోహ్లీ మాదిరిగా స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు.. ఆ ఊహ చతురత చూపిస్తాడా? గిల్లికజ్జాలు పెట్టుకుంటాడా? సరదా సంభాషణలతో ఆకట్టుకుంటాడా? రెచ్చగొట్టి విరోధాన్ని పెంచుతాడా? అనే ప్రశ్నలను గిల్ మీద పోప్ సంధించాడు.. ” ఈసారి గిల్ ఆధ్వర్యంలో భారత జట్టు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ లేకుండా వస్తోంది.. ఒక రకంగా ఆ జట్టు మీద ఇది ఒత్తిడి కలగజేస్తుంది. భారత బృందం లో విరాట్ కోహ్లీ గనుక ఉంటే కచ్చితంగా ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాలని భావించేవాడు. ఆ ఒత్తిడిలో అతడు ఆనందం అనుభవించేవాడు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి కవ్వించేవాడు. ఇప్పుడు ఆ పాత్రను ఎవరు పోషిస్తారు అనేది ఆసక్తికరంగా ఉందని” పోప్ వ్యాఖ్యానించాడు.
మరోవైపు భారత జట్టు సారథి గిల్ కు ఆంగ్ల గడ్డమీద ఆశించినంత గొప్ప రికార్డు లేదు. ఈ గడ్డమీద అతడు రెండు టెస్టులలో ఆడాడు. ఒకసారి కివీస్, మరొకసారి ఆంగ్ల జట్టు పై ఆడాడు. నాలుగు ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసినప్పటికీ ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. అతని నాలుగు ఇన్నింగ్స్ లలో చేసిన పరుగులు 50 దాటలేదు. దీంతో అతనిపై విపరీతమైన ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడిని గనక అతడు జయిస్తే భారత బృందానికి తిరుగు ఉండదు. ఇక ఇదే సమయంలో స్లిప్ లో గిల్ ఫీల్డింగ్ చేస్తుంటాడు కాబట్టి.. విరాట్ కోహ్లీ మాదిరిగా కవ్వించగలడా? ఆంగ్ల జట్టు ఆటగాళ్లను ఇబ్బంది పెట్టగలడా? వారిని కవ్వించి రెచ్చగొట్టగలడా? రెచ్చగొట్టి బుట్టలో పడేయగలడా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. సాధారణగా ఫీల్డ్ లో ఉంటే గిల్ సమయనంతో ఉంటాడు. పెద్దగా మాట్లాడేందుకు ఇష్టపడడు. నిశ్శబ్దంగా ఉంటూ.. తన పని తాను చేసుకుంటూ పోతాడు. అంతేతప్ప ఇష్టానుసారంగా వ్యవహరించి విమర్శలకు గురికాడు. అయితే అతనిపై పెద్ద బాధ్యత ఉన్న నేపథ్యంలో.. మునిపటి లాగానే అద్భుతమైన క్రికెట్ ఆడతాడని.. అభిమానులకు ఆనందాన్ని పంచుతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆంగ్ల గడ్డపై ఈసారి మెరుగైన ఇన్నింగ్స్ ఆడాలని గిల్ భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే మైదానంలో విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. బ్యాటింగ్ మీద మరింత దృష్టి కేంద్రీకరిస్తున్నాడు. తనలోపాలను సవరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆంగ్ల గడ్డపై పిచ్ లు విభిన్నంగా ఉంటాయి కాబట్టి.. వాటికి అలవాటు పోవడానికి విపరీతంగా శ్రమిస్తున్నాడు గిల్. ఉదయం నుంచి సాయంత్రం దాకా అతడు మైదానంలోనే గడుపుతున్నాడు.. తోటి ప్లేయర్లు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ.. అతడు దాన్ని కూడా ఇష్టపడటం లేదు.