heroines : అభిమానులకు, నెటిజన్లకు దగ్గర ఉండటానికి ఏదో రకంగా స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వడం వేరు. బిగ్ స్క్రీన్ మీద విజిల్స్ వేయించుకోవడం వేరు. అయితే కొందరు హీరోయిన్ లు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు విజిల్స్ పడుతుంటాయి. వారి సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ తెగ ఎదురుచూస్తుంటారు నెటిజన్లు. కానీ వారి సినిమాలు వాయిదా పడినా, క్యాన్సల్ అయిందని తెలిసినా సరే తెగ ఫీల్ అవుతారు. మరి ఈ సారి అభిమానులను నిరాశ పరిచిన ఆ హీరోయిన్ లు ఎవరు అనే వివరాలు చూసేద్దాం.
నయనతార: గతంలో ఎప్పుడూ లేనంత అగ్రెసివ్‌గా మారింది మేడం నయనతార. ఇద్దరు పిల్లల తల్లిగా బిజీగా ఉన్న ఈ బ్యూటీ నార్త్ లో ఎంట్రీ మూవీతోనూ వెయ్యి కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్ గా పేరు సంపాదించింది. ప్రతి లైన్ లో కూడా సక్సెస్‌ఫుల్‌గా తన జర్నీని రన్ చేస్తుంది. జవాన్ సినిమాతో తన సత్తా చాటి టాప్ హీరోయిన్ గా మారింది నయనతార. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ పెళ్లి వీడియో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ధనుష్, నయనకు మధ్య గొడవ కూడా జరిగింది. కానీ ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా కూల్ గా తన జర్నీని సాగిస్తుంది. అయితే ఈ బ్యూటీ ఈ ఏడాది బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు.
త్రిష: కాంటెంపరరీ బ్యూటీ త్రిష గురించి పరిచయం అవసరం లేదు. గోట్‌లో ఓ సాంగ్‌కి స్టెప్పులు వేసింది ఈ బ్యూటీ. అంతేగానీ, పూర్తి స్థాయి సినిమాలో మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం తెలుగులో చిరంజీవికి జోడిగా విశ్వంభర సినిమాలో కనిపించడానికి సిద్ధం అయింది. కానీ ఈ సారి మాత్రం థియేటర్ లలో సందడి చేయడానికి సిద్దంగా లేదు.
అనుష్క: మన లేడీ లక్ అనుష్క గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ సినిమా వస్తే థియేటర్లలో విజిల్స్ వేయడానికి అభిమానులు కాచుకొని కూర్చున్నారు. అయితే ఈ బ్యూటీ ఈ ఏడాది స్క్రీన్ మీద మెప్పించలేదు. స్వీటీ నటించిన ఘాటీ, కథనార్ టీజర్లని బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు కానీ సినిమాలు మాత్రం రాలేదు. 2025లో ఒకటికి రెండు సినిమాలతో మెప్పిస్తానని సిద్దం అవుతుంది స్వీటీ.
సమంత: సమంత థియేటర్ల్ లో కనిపిస్తే చాలు తెగ అల్లరి చేస్తారు అభిమానులు. అయితే ఈ బ్యూటీ ఈ ఏడాది డిజిటల్ పరంగా సిటాడెల్ హనీ బన్నీలో మాత్రమే కనిపించింది. కానీ, సినిమాలు మాత్రం లేవు. వచ్చే సంవత్సరం కూడా సినిమాలు ఉంటాయో లేవో చెప్పడం కష్టమే. సామ్ యాక్టివిటీకి సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తే గానీ ఈ విషయం పట్ల ఓ క్లారిటీ రాదు. మరి చూడాలి సమంత మనసులో ఏముందో?
పూజా హెగ్డే: ముకుంద సినిమాతో ఎందరినో అలరించిన ఈ బ్యూటీ తెలుగుకు దూర దూరంగా జరుగుతున్నట్టే ఉంది. ఇక 2025లో దేవా అనే బాలీవుడ్ మూవీతో, తమిళ్‌లో సూర్య 44తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది. 2024లో మిస్ అయిన 2025లో పూజ అభిమానులు పండగ చేసుకోవచ్చన్నమాట.