ENG vs AUS Ashes 2nd Test: ఉత్కంఠ రేపుతోన్న యాషెస్ రెండో టెస్ట్.. ఎవరిది గెలుపు?

ఇంగ్లాండ్ జట్టు గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ అనూహ్య విజయాలను నమోదు చేస్తున్న.. బజ్ బాల్ వ్యూహాన్ని రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా ఇంగ్లాండ్ జట్టు కొనసాగిస్తోంది. తొలి టెస్ట్ లో అనూహ్యంగా ఓటమి పాలై విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ.

Written By: BS, Updated On : June 30, 2023 1:58 pm

ENG vs AUS Ashes 2nd Test

Follow us on

ENG vs AUS Ashes 2nd Test: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ ఈ నెల 28న ప్రారంభమైంది. రెండో టెస్ట్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. ఇరు జట్ల ఆటగాళ్లు అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొడుతుండడంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఇరుజట్లు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్ లో విజయం ఏ జట్టును వరిస్తుందో అన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో పెరుగుతోంది.

యాషెస్ సిరీస్ ను ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్టు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అడుతుంటాయి. క్రికెట్ లో ఐసీసీ నిర్వహించే టోర్నీలకు ఉన్నంత క్రేజ్ ఈ రెండు జట్ల మధ్య నిర్వహించే ఈ సిరీస్ కు ఉంటుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లతోపాటు రెండు దేశాలకు చెందిన కోట్లాది మంది అభిమానులు కూడా ఆశగా ఎదురు చూస్తుంటారు. కొద్దిరోజుల కిందట ముగిసిన మొదటి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు అనూహ్యంగా విజయాన్ని నమోదు చేసి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు లార్డ్స్ లో జరుగుతున్న రెండో టెస్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా సమం చేయాలని, తద్వారా మిగిలిన టెస్టులకు ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తోంది. అయితే, ఆస్ట్రేలియా జట్టు కూడా గట్టిగానే పట్టు బిగిస్తూ ఉండడంతో ఫలితం ఏమవుతుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

నాలుగు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసిన ఇంగ్లాండ్..

రెండో టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 416 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండు జట్టు మొదటి టెస్టులో మాదిరిగానే వేగంగా బ్యాటింగ్ చేసింది. తమ బజ్ బాల్ వ్యూహాన్ని రెండో టెస్టులోనూ అమలు చేసింది ఇంగ్లాండు జట్టు. అందులో భాగంగానే రెండో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు 278 పరుగులు చేసింది ఇంగ్లాండ్. 61 ఓవర్లలో 278 పరుగులను ఇంగ్లాండ్ జట్టు చేసింది. ఓవర్ కు 4.56 పరుగులు చప్పున చేసింది ఇంగ్లాండ్ జట్టు.
ఇంగ్లాండ్ ఆటగాళ్లలో డకెట్ 134 బంతుల్లో 9 ఫోర్లు సహాయంతో 98 పరుగులు చేశాడు. అలాగే, క్రాలీ (48), ఓలి పోప్ (42) రాణించారు. ప్రస్తుతం బ్రూక్ (45), స్టోక్స్ (17) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఆరు వికెట్లు ఉండగా ఇంకా 138 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు ఆట ప్రారంభమైన తర్వాత తొలి సెషన్ కీలకంగా మారే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ జట్టు దూకుడైన ఆట తీరును ప్రదర్శించి భారీగా పరుగులు చేయగలిగితే మాత్రం ఆస్ట్రేలియా జట్టు కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లు రాణించి తక్కువ స్కోరుకే ఇంగ్లాండ్ జట్టును పరిమితం చేయగలిగితే మాత్రం ఆస్ట్రేలియా జట్టు ఈ టెస్ట్ పై పట్టు బిగించేందుకు అవకాశం ఉంది.

అదే వేగాన్ని ప్రదర్శిస్తున్న ఇంగ్లాండ్ జట్టు..

ఇంగ్లాండ్ జట్టు గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ అనూహ్య విజయాలను నమోదు చేస్తున్న.. బజ్ బాల్ వ్యూహాన్ని రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా ఇంగ్లాండ్ జట్టు కొనసాగిస్తోంది. తొలి టెస్ట్ లో అనూహ్యంగా ఓటమి పాలై విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ.. బజ్ బాల్ వ్యూహాన్ని ఇంగ్లాండ్ జట్టు విడిచిపెట్టలేదు. రెండో రోజు బరిలోకి దిగిన మొదటి నుంచి ఓపెనర్లు దూకుడుగానే బ్యాటింగ్ చేశారు. ఓపెనర్ డకెట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మెరుగైన స్కోర్ అందించడంలో దోహదపడ్డాడు. ఓపెనర్లిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు దాటిస్తూ తేలిగ్గా పరుగులు రాబడుతూ ఆసీస్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. అయితే, అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న క్రాలీని లైయాన్ బోల్తా కొట్టించడంతో 91 పరుగుల తొలి వికెట్ భాగ్వామ్యానికి తెరపడింది. ఆ తరువాత ఓలీ పోప్ డకెట్ తోడవడంతో ఇంగ్లాండు జట్టు ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది. ఓ దశలో 188/1 తో ఆ జట్టు పటిష్టంగా కనిపించింది. అయితే, ఒక్కసారిగా పుంజుకున్న ఆస్ట్రేలియా బౌలర్లు చకచకా మూడు వికెట్లు పడగొట్టి మళ్లీ పోటీలోకి వచ్చారు. పోప్ ను అవుట్ చేయడం ద్వారా ప్రమాదకరంగా మారుతున్న రెండో భాగస్వామ్యాన్ని గ్రీన్ విడదీశాడు. కాసేపటికి డకెట్ ను హేజిల్ వుడ్ పెవిలియన్ చేర్చాడు. ఇంగ్లాండ్ జట్టు స్కోరు 222 పరుగులు వద్ద స్టార్క్ కు బౌలింగ్ లో స్మిత్ అందుకున్న డ్రైవింగ్ క్యాచ్ కు రూట్ నిష్క్రమించాడు. బంతి పూర్తిగా అతను చేతిలో లేకపోయినా మూడో ఎంపైర్ రూట్ ఔట్ అని ప్రకటించడంపై విమర్శలు కూడా వచ్చాయి. ఆ తరువాత పట్టుదలగా నిలిచిన బ్రూక్, స్టోక్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయిదో వికెట్ కు 56 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

వేగంగా 5 వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్..

మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లు నష్టానికి 339 పరుగులు చేసిన ఆస్ట్రేలియా జట్టును ఇంగ్లాండు బౌలర్లు ఎక్కువ పరుగులు చేయనివ్వకుండా కట్టడి చేయగలరు. మిగిలిన 5 వికెట్లను వేగంగా తీయడంతో.. ఆస్ట్రేలియా జట్టు 416 పరుగులకు పరిమితమైంది. తొలిరోజు 85 పరుగులతో ఆట ముగించిన స్టీవెన్ స్మిత్.. రెండో రోజు 110 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇంగ్లాండు బౌలర్లలో రాబిన్షన్, టంగ్ మూడు వికెట్లు చప్పున పడగొట్టారు. 22 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా జట్టులో స్మిత్ (110), హెడ్ (77), వార్నర్ (66), లబుషేన్ (47) చేశారు.