Homeక్రీడలుక్రికెట్‌Eden Gardens Ground Staff Efforts IPL Rain Match: అంతటి ఈడెన్ గార్డెన్స్ ను...

Eden Gardens Ground Staff Efforts IPL Rain Match: అంతటి ఈడెన్ గార్డెన్స్ ను క్షణంలోనే కప్పేశారు.. గ్రౌండ్ మెన్ కృషికి హాట్సాఫ్

Eden Gardens Ground Staff Efforts IPL Rain Match: ఐపీఎల్ ప్రారంభానికి ముందు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒక కీలక సమావేశం నిర్వహించాడు. ఆ కార్యక్రమానికి ముంబై యాజమాన్యం హాజరు కాలేదు. ముంబై ప్లేయర్లు కూడా హాజరు కాలేదు. వచ్చింది మొత్తం గ్రౌండ్ మెన్. వారంతా కూడా ముంబై మైదానంలో పనిచేస్తుంటారు. వారికి చెల్లించే వేతనాలు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయి. వారి కృషిని చూసిన హార్దిక్ పాండ్యా.. ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడాడు. వారికి మంచి విందు ఇచ్చాడు. ఆ తర్వాత ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున చెక్కులు అందజేశాడు. హార్థిక్ పాండ్యా చేసిన ఈ పని చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకొంతమందికి ఆనందాన్ని కలిగించింది.

హార్దిక్ పాండ్యా గ్రౌండ్ మెన్ కు ఆ స్థాయిలో ప్రోత్సాహం ఇవ్వడం పట్ల రకరకాల విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. సాధారణంగా మైదానంలో ఆటగాళ్లు ఆడేందుకు వస్తున్నప్పుడు సకల సౌకర్యాలు ఉంటాయి.. అవన్నీ సిద్ధం చేయాలంటే మామూలు విషయం కాదు. గ్రాస్ పరచడం నుంచి మొదలు పెడితే నీటిని చల్లడం వరకు ప్రతి విషయంలో గ్రౌండ్ మెన్ కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఒకటికి 1000 సార్లు పరిశీలిస్తుంటారు. వర్షం కురిసినప్పుడు గ్రౌండ్ మెన్ పడే ఇబ్బంది మామూలుగా ఉండదు. కాలంతో వేగంగా వారు పనిచేస్తుంటారు. కొన్ని సందర్భాలలో గాయాల బారిన కూడా పడుతుంటారు. వర్షం కురిసినప్పుడు.. డ్రైనేజీ నీళ్లను బయటికి పంపించడానికి గ్రౌండ్ మెన్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు.

ఐపీఎల్ లో భాగంగా సోమవారం పంజాబ్, కోల్ కతా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. వర్షం విపరీతంగా కురవడంతో మ్యాచ్ నిర్వహించడానికి అవకాశం కలగలేదు. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారకుండా ఉండడానికి పరదాలు కప్పారు. అంతటితో ఆగలేదు.. గ్రౌండ్ మొత్తాన్ని పరదాలతో నింపేశారు. కాకపోతే వర్షం తీవ్రత అధికంగా ఉండడం.. ఆకాశంలో మేఘాలు విస్తారంగా ఉండడంతో గ్రౌండ్ మెన్ పడిన ప్రయాసకు ఉపయోగం లేకుండా పోయింది.

గ్రౌండ్ మెన్ పడిన కష్టాన్ని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు కొనియాడుతున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వారు మైదానాన్ని కాపాడేందుకు ప్రయత్నించారని.. కాకపోతే వర్షం తీవ్రత అధికంగా ఉండడంవల్ల వారు పడిన శ్రమ వృధా అయిందని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. గ్రౌండ్ మెన్ చేసిన కృషికి సెల్యూట్ చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version