Homeటాప్ స్టోరీస్Karregutta hills Telangana : కర్రెగుట్టలపై తెలంగాణ సర్కార్ పెద్ద స్కెచ్.. డిజిపి శివధర్ రెడ్డి...

Karregutta hills Telangana : కర్రెగుట్టలపై తెలంగాణ సర్కార్ పెద్ద స్కెచ్.. డిజిపి శివధర్ రెడ్డి వెళ్తోంది అందుకే

Karregutta hills Telangana : తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్నది కర్రె గుట్టలు. విస్తారమైన అడవులతో.. పోలీసులు కూడా అడుగుపెట్టలేని దుర్భేద్యమైన ప్రాంతాలుగా అవి ఉన్నాయి.. ఆపరేషన్ కగార్ లో భాగంగా కేంద్ర బలగాలు ఈ గుట్టలపై గత ఏడాది ఇదే సమయానికి మకాం వేశాయి. మావోయిస్టులను ఏరి పారేశాయి. అత్యంత శక్తివంతమైన ఆయుధాలతో మావోయిస్టులను తుద ముట్టించాయి.

ఆపరేషన్ కగార్ ద్వారా కర్రె గుట్టలపై ఉన్న మావోయిస్టులు కొందరు చనిపోతే.. మిగతా వారు లొంగి పోయారు. అయితే ఈ ప్రాంతంలో విస్తారమైన అడవులు.. ప్రకృతి సిద్ధమైన వనరులు ఉన్నాయి. భవిష్యత్తు కాలంలో ఈ ప్రాంతం వామపక్ష తీవ్రవాదానికి ఆలవాలం కాకూడదని భావించిన తెలంగాణ ప్రభుత్వం.. సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో పోలీస్ అవుట్ బేస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహద్దుల్లో ఉన్న కర్రె గుట్టలు, పామూనురు ప్రాంతాలలో పోలీస్ అవుట్ పోస్ట్ నిర్మించనున్నారు. ములుగు ఎస్పి రామ్నాథ్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని ఇప్పటికే పోలీసులు ఆ దినంలోకి తీసుకున్నారు. ఈ గుట్టల ప్రాంతంలోని జెల్లా, డోలి, తడపల ప్రాంతాలకు రహదారులను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలను కొద్ది రోజుల క్రితం ప్రారంభించారు. గతంలో ఈ ప్రాంతాలకు రోడ్లు ఉండేవి కావు. మావోయిస్టులు ఉండడంతో పోలీసులు కూడా రావడానికి భయపడేవారు. గతంలో ఈ ప్రాంతంలో అనేక ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. నాటి ఘటనలలో పోలీసులు చాలామంది కన్నుమూశారు.

ఆపరేషన్ కగార్ తర్వాత ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయింది. దీనికి తోడు గిరిజన గ్రామాలలో ఉన్న ప్రజలను పోలీసులు జాగృతం చేశారు. వామపక్ష ఉద్యమాలకు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు వారికి ఉపాధి కల్పించారు. యువకులు, యువతులకు చదువు మీద అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ సోలార్ దీపాలు.. ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. దీంతో ఇక్కడి యువత చదువు బాట పట్టింది. ప్రస్తుతం మా ప్రాంతంలో ఉన్న గిరిజనులు స్వయం ఉపాధి మార్గాలను వెతుక్కుంటున్నారు. కొందరు సోలార్ మోటార్ల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఇక్కడ రోడ్డు పనులు పూర్తయితే.. ములుగు, భూపాలపల్లి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు రాకపోకలకు మార్గం సుగమవుతుంది.

ఇక్కడ పోలీస్ బేస్ క్యాంపు నిర్మిస్తే వామపక్ష ఉద్యమాల ప్రభావాన్ని అణిచి వేయవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. అందువల్లే కేంద్రం సహకారంతో ఇక్కడ బేస్ క్యాంపు నిర్మిస్తోంది. డిజిపి శివధర్ రెడ్డి కొద్దిరోజులుగా ఇక్కడి అధికారులతో మాట్లాడుతున్నారు. పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు. మంగళవారం భూమి పూజ కార్యక్రమం తర్వాత డిజిపి రోడ్డు పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న గిరిజనులతో మమేకం అవుతారు. అనంతరం ఇక్కడ శాంతి భద్రతలు.. ఇతర వ్యవహారాల గురించి స్థానిక పోలీసులను అడిగి తెలుసుకుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version