IND Vs PAK (16)
IND Vs PAK: భారత్ సాధించిన విజయంలో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) కీలకపాత్ర పోషించాడు. సుదీర్ఘకాలం తర్వాత ఆకట్టుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ సెంచరీ చేసేందుకు 15 పరుగుల దూరంలో ఉన్నాడు. అప్పుడు మరో ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు. దీంతో మైదానంలోకి హార్దిక్ పాండ్యా వచ్చాడు. హార్దిక్ పాండ్యా వచ్చి రాగానే ఫోర్ కొట్టాడు. దీంతో కోహ్లీ సెంచరీ చేయడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం అయింది. అతని అభిమానుల్లో సంశయం నెలకొంది. అయితే కొంతసేపటికే పాండ్యా అవుట్ అయ్యాడు. దీంతో విరాట్ కోహ్లీ సెంచరీ చేయగలిగాడు. కాకపోతే ఆ పది నిమిషాలు మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించింది.
అన్ని రంగాలలో అధిపత్యం
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. వన్ సైడ్ జరిగిన ఈ మ్యాచ్లో భారత్ అనే రంగాలలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాస్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓడిపోగానే అభిమానులు కాస్త కంగారు కలిగింది. కానీ ఆ తదుపరి నుంచే అసలు కథ మొదలైంది. పాకిస్తాన్ జట్టును భారత్ అన్ని రంగాలలో డామినేట్ చేసింది. ముందుగా బౌలింగ్ చేసిన భారత్ పాకిస్తాన్ జట్టును కట్టడి చేసింది. 241 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. పాకిస్తాన్ విధించిన 242 టార్గెట్ ను భారత్ ఆడుతూ పాడుతూ చేదించింది. విరాట్ కోహ్లీ సూపర్నెంట్ ఆకట్టుకున్నాడు. కొద్దికాలంగా విరాట్ కోహ్లీ సరైన ఫామ్ లో లేడు. ఈ క్రమంలో అతడి అభిమానులు ఒకటే ఆందోళనతో ఉన్నారు. అయితే పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ మళ్ళీ టచ్ లోకి వచ్చాడు. తనని చేజ్ మాస్టర్ అని ఎందుకు పిలుస్తారో విరాట్ కోహ్లీ నిరూపించుకున్నాడు..
సెంచరీ చేసి..
వాస్తవానికి ఈ మ్యాచ్లో విరాట్ సెంచరీ చేస్తాడా? లేదా? అనే అనుమానాలు అభిమానుల్లో కలిగాయి. ఎందుకంటే ఈ మ్యాచ్లో భారత్ గెలుపు కోసం సాధించాల్సిన పరుగులు తగ్గిపోవడంతో.. విరాట్ సెంచరీ చేస్తాడా అనే అనుమానం అభిమానుల్లో కలిగింది. అయితే అదే సమయంలో శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా (Hardik Pandya) క్రీజ్ లోకి వచ్చాడు. ఇంత విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కోహ్లీ సెంచరీ చేయడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఎవరైనా హాఫ్ సెంచరీ లేదా సెంచరీకి దగ్గరగా ఉంటే.. వాటిని పూర్తి చేయకుండా.. చేయాల్సిన పరుగులను ఫోర్లు, సిక్స్ లతో పూర్తి చేస్తాడు. గతంలో తిలక్ వర్మ, కొంతమంది ప్లేయర్ల విషయంలో అతడు అలానే చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్ 39 ఓవర్ ఐదవ బంతికి అయ్యర్ అవుట్ అయ్యాడు.. ఆ తర్వాత పాండ్యా క్రీజ్ లోకి వచ్చాడు. ఆ ఓవర్ చివరి బంతికి సింగిల్ రన్ తీశాడు. అప్పటికి భారత్ విజయానికి 26 పరుగులు అవసరం. కోహ్లీ సెంచరీకి 15 పరుగులు కావాలి. సింగిల్ రన్ తీస్తే కోహ్లీకి స్ట్రైక్ ఇస్తే సెంచరీ చేస్తాడని అందరి గురించి. కానీ పాండ్యా.. తనపై కోహ్లీ అభిమానులకు ఉన్న భయాన్ని నిజం చేశాడు. ఆఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 40 ఓవర్ లో తొలి బంతికే ముందుకు వచ్చాడు. ఎక్స్ ట్రా కవర్ మీదుగా ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత బంతికి రెండు పరుగులు తీశాడు. దీంతో భారత్ విజయం సాధించాలంటే 20 పరుగులు అవసరం. కానీ, కోహ్లీ కి 15 పరుగులు అవసరం. దీంతో కోహ్లీ అభిమానులకు పాండ్యాపై విపరీతమైన కోపం వచ్చింది. ఆ తర్వాత బంతికి పాండే అవుట్ అయ్యాడు.. మొట్టమొదటిసారి టీమిండియా ఆటగాడు అవుట్ కావాలని భారత అభిమానులు కోరుకున్నారు. అతడు అవుతున్న తర్వాత హర్షం వ్యక్తం చేశారు. అనంతరం అక్షర్ పటేల్ క్రీజ్ లోకి వచ్చాడు. అక్షర్ పటేల్ సపోర్ట్ ఇవ్వడంతో విరాట్ సెంచరీ చేసుకోగలిగాడు.
Hardik Pandya when Virat Kohli scores a century pic.twitter.com/L4b5Q9tZwH
— Sagar (@sagarcasm) February 23, 2025