Dulip trophy 2024 : దిగ్గజ ఆటగాళ్లు పోటీపడుతున్న దులీప్ ట్రోఫీని ఉచితంగా ఎలా చూడాలంటే..

1961లో దులీప్ ట్రోఫీ మొదలైంది. ఆరు జట్లతో జోనల్ ఫార్మాట్లో ఇప్పటివరకు టోర్నీ నిర్వహించారు.. అయితే ఈసారి మాత్రం నాలుగు జట్లతో టోర్నీ నిర్వహించనున్నారు. నాకౌట్ మ్యాచ్ లు కాకుండా రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో పోటీలో నిర్వహిస్తారు

Written By: Anabothula Bhaskar, Updated On : August 16, 2024 6:39 pm

Dulip trophy 2024

Follow us on

Dulip trophy 2024 : వచ్చే కొద్ది నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ గెలవాలని భావిస్తోంది. ఎందుకంటే గత ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో టీమిండియా ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ను టీమిండియా గెలవాలంటే వచ్చే పది టెస్ట్ మ్యాచ్ లలో అద్భుతమైన ప్రతిభ చూపించాల్సి ఉంది. ఆటోర్నీలకు టీమిండియా ఆటగాళ్లను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలనే లక్ష్యంతో బీసీసీఐ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దేశవాలి క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది.

సెప్టెంబర్ ఐదు నుంచి

సెప్టెంబర్ ఐదు నుంచి బెంగళూరు, అనంతపురం మైదానాలు వేదికగా దులీప్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ ట్రోఫీ ద్వారా దేశవాళి క్రికెట్ సీజన్ మొదలవుతుంది. ఈ టోర్నీలో ఈసారి భిన్నమైన ఫార్మాట్ లో జరుగుతుంది. ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్, నార్త్, నార్త్ ఈస్ట్ జట్ల పేర్లతో ఆటగాళ్లు తలపడతారు. కానీ ఈసారి A,B,C,D పేర్లతో సెలక్టర్లు జట్లను రూపొందించారు.. అయితే ఈసారి దులీప్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్లు మొత్తం ఆడుతున్నారు. రోహిత్, విరాట్ కోహ్లీ, జస్ ప్రీత్ బుమ్రా మొదట్లో ఈ ట్రోఫీలో ఆడతారని భావించినప్పటికీ.. ఆ తర్వాత వారు ఆడబోరని బిసిసిఐ పెద్దలు ప్రకటించారు. కీలకమైన ఆటగాళ్లు కావడంతో.. వారికి విశ్రాంతి ఇచ్చామని సెలక్టర్లు చెబుతున్నారు..గిల్, అయ్యర్, రుతు రాజ్ గైక్వాడ్ , అభిమన్యు ఆధ్వర్యంలో సెలక్టర్లు జట్లను రూపొందించారు.

1961 నుంచి..

1961లో దులీప్ ట్రోఫీ మొదలైంది. ఆరు జట్లతో జోనల్ ఫార్మాట్లో ఇప్పటివరకు టోర్నీ నిర్వహించారు.. అయితే ఈసారి మాత్రం నాలుగు జట్లతో టోర్నీ నిర్వహించనున్నారు. నాకౌట్ మ్యాచ్ లు కాకుండా రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో పోటీలో నిర్వహిస్తారు. ప్రతి జట్టు తమ ప్రత్యర్థి జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. మ్యాచ్ లు మొత్తం ముగిసిన తర్వాత.. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన జట్టు విజేతగా ఆవిర్భవిస్తుంది. ఒక్కో మ్యాచ్ నాలుగు రోజులపాటు నిర్వహిస్తారు. ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగానే ఆటగాళ్లను బంగ్లాదేశ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేస్తామని బీసీసీఐ ప్రకటించింది. ఈ మ్యాచ్ లు స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. వీటిని ఉచితంగా చూడొచ్చు. జియో సినిమా, స్పోర్ట్స్ 18 చానల్స్ టీమిండియా హోమ్ సీజన్ మ్యాచ్ ల బ్రాడ్కాస్టింగ్ హక్కులు సొంతం చేసుకున్నాయి.

షెడ్యూల్ ఇలా..

సెప్టెంబర్ 5: వేదిక బెంగళూరు చిన్న స్వామి స్టేడియం. తలపడే జట్లు: team versus team B

సెప్టెంబర్ 5: వేదిక: రూరల్ డెవలప్మెంట్ స్టేడియం అనంతపురం. తలపడే జట్లు: టీమ్ సీ vs టీమ్ డీ

సెప్టెంబర్ 12: వేదిక: రూరల్ డెవలప్మెంట్ స్టేడియం అనంతపురం. తలపడే జట్లు: team A versus team D.

సెప్టెంబర్ 12: వేదిక: రూరల్ డెవలప్మెంట్ స్టేడియం – a, అనంతపురం. తలపడే జట్లు: team B team C.

సెప్టెంబర్ 19: వేదిక: రూరల్ డెవలప్మెంట్ స్టేడియం – బీ, అనంతపురం. తలపడే జట్లు: team B versus team D.

సెప్టెంబర్ 19: వేదిక: రూరల్ డెవలప్మెంట్ స్టేడియం – ఏ. తలపడే జట్లు: team A versus team C.

ట్రోఫీలో తలపడే జట్ల వివరాలివే

టీమ్ – A: గిల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివం దుబే, తనుష్కోటియన్, కులదీప్ యాదవ్, ఆకాశదీప్, ప్రసిద్ధి కృష్ణ, అహ్మద్, ఆవేశ్ ఖాన్, కావేరప్ప, కుమార కుషాగ్ర, రావత్

టీమ్ – బీ: అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్పరాజ్ అహ్మద్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, సతీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, యష్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, సాయి కిషోర్, మోహిత్, జగదీషన్.

టీమ్ సీ: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదర్, అభిషేక్ పోరెల్, సూర్య కుమార్ యాదవ్, ఇంద్రజిత్, హృతిక్, మనవ్, ఉమ్రాన్ మాలిక్, వైశాఖ విజయ్ కుమార్, అన్షుల్ కంబోజి, హిమాన్స చౌహన్, మయాంక్ మార్కండే, ఆర్యన్, సందీప్ వారియర్.

టీమ్ – డీ: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్) అధర్వ, యశ్ దూబే, దేవదత్, ఇషాన్ కిషన్, రికి భూయ్, సరాన్స్, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, ఆదిత్య, హర్షిత్ రాణా, తుషార్ దేశ్ పాండే, ఆకాష్, భరత్, సౌరభ్ కుమార్.