ఒలింపిక్స్ లో క్రికెట్ ఎందుకు లేదో మీకు తెలుసా.. కారణాలు ఇవే?

మన దేశంలోని ప్రజలు ఎంతో ఇష్టపడే ఆటలలో క్రికెట్ ఒకటనే సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ సమయంలో, భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే సమయంలో టీవీలలో క్రికెట్ ను కళ్లార్పకుండా చూసేవాళ్ల సంఖ్య లక్షల సంఖ్యలో ఉంది. అయితే ప్రజల్లో ఎంతో క్రేజ్ ఉన్న క్రికెట్ కు ఒలింపిక్స్ లో మాత్రం స్థానం లేదు. ఒలింపిక్స్ లో ఎప్పటికప్పుడు కొన్ని ఆటలను చేర్చడం, కొన్ని ఆటలను తొలగించడం జరుగుతుంది. ఈ ఏడాది జరిగిన ఒలింపిక్స్ లో […]

Written By: Navya, Updated On : October 24, 2021 8:53 am
Follow us on

మన దేశంలోని ప్రజలు ఎంతో ఇష్టపడే ఆటలలో క్రికెట్ ఒకటనే సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ సమయంలో, భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే సమయంలో టీవీలలో క్రికెట్ ను కళ్లార్పకుండా చూసేవాళ్ల సంఖ్య లక్షల సంఖ్యలో ఉంది. అయితే ప్రజల్లో ఎంతో క్రేజ్ ఉన్న క్రికెట్ కు ఒలింపిక్స్ లో మాత్రం స్థానం లేదు. ఒలింపిక్స్ లో ఎప్పటికప్పుడు కొన్ని ఆటలను చేర్చడం, కొన్ని ఆటలను తొలగించడం జరుగుతుంది.

ఈ ఏడాది జరిగిన ఒలింపిక్స్ లో సర్ఫింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్, కరాటే లాంటి ఆటలను చేర్చడం జరిగింది. 2024 సంవత్సరంలో జరగబోయే ఒలింపిక్స్ లో బ్రేక్ డ్యాన్స్ ను చేర్చనున్నామని కీలక ప్రకటన వెలువడింది. ఒలింపిక్స్ క్రీడల్లో చీర్ లీడింగ్ ను కూడా చేర్చాలని కొంతమంది భావిస్తుండగా ఆ ఆటను చేరుస్తారో లేదో చూడాల్సి ఉంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే 1896లో ఒలింపిక్స్ మొదలైన సమయంలో అందులో క్రికెట్ కూడా ఉంది.

అయితే ఆ సమయంలో క్రికెట్ ఆడే జట్లు లేకపోవడంతో క్రికెట్ ను తప్పించాల్సి వచ్చింది. ఆ తర్వాత 1900 సంవత్సరంలో క్రికెట్ పోటీలు జరగగా ఆ సమయంలో ఫ్రాన్స్ లో ఒలింపిక్స్ జరగడం ఫ్రాన్స్ క్రికెట్ కు సంబంధం లేని ప్రాంతం కావడంతో క్రికెట్ లో పాల్గొనడానికి ఏ దేశం రాలేదు. ఆ తర్వాత 1904 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ లో క్రికెట్ ఆడటానికి ఏ దేశం ముందుకు రాకపోవడంతో క్రికెట్ ను తప్పించారు.

క్రికెట్ స్టేడియాలు నిర్మించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు కావడం, ఒక్కో మ్యాచ్ కు కనీసం 8 గంటల సమయం పట్టే అవకాశం ఉండటం, 12 దేశాలకు మాత్రమే అంతర్జాతీయ మ్యాచ్ లను ఆడే అర్హత ఉండటం, ఒలింపిక్స్ లో ఎక్కువ పతకాలు గెలుచుకునే దేశాలలో క్రికెట్ ఆడకపోవడం ఇతర కారణాల వల్ల ఒలింపిక్స్ లో క్రికెట్ లేదు. అయితే 2028 సంవత్సరంలో జరిగే ఒలింపిక్స్ లో మాత్రం క్రికెట్ ఉండే ఛాన్స్ అయితే ఉంది.