Viva Harasha Love Marriege: బొద్దుగా.. ముద్దుగా.. నిగనిగలాడుతూ కనిపించే హర్షను చూస్తే ఒక మంచి కమెడియన్ అతడిలో ఉన్నాడనిపిస్తుంది. అయితే తన ఆకారాన్నే ఆయుధంగా మలిచి హర్ష కామెడీ పండించిన తీరు సక్సెస్ అయ్యింది. అదే అతడిని పాపులర్ ను చేసింది. ఇండస్ట్రీలో నిలబెట్టింది. అయితే వైవాహర్షకు ఒక లవ్ స్టోరీ ఉంది. సాధారణంగా అబ్బాయి ప్రపోజ్ చేస్తాడు. కానీ హర్షనే చేసుకుంటానని ముందుకొచ్చింది అతడి స్నేహితురాలు.. కానీ వాళ్ల నాన్న ఒప్పుకోలేదు. దీంతో వీరి పెళ్లికి అడ్డంకులు ఏర్పడ్డాయి.. viva harsha wife మరి వైవా హర్ష లవ్ స్టోరీ ఏంటి? అసలు కథ ఎలా సుఖాంతమైంది. ? వీరు ఎలా పెళ్లి చేసుకున్నారో తెలుసుకుందాం..
దాదాపు 8 ఏళ్ల క్రితం యూట్యూబ్ లో ‘వైవా’ అనే పేరుతో షార్ట్ వీడియోలు చేసిన చెముడు హర్ష తక్కువ సమయంలోనే మంచి కామెడీ పండించి క్రేజ్ సంపాదించాడు. ఆ వీడియోలతో ‘వైవా హర్ష’గా మారిపోయారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఒక మంచి కమెడియన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే తన స్నేహితురాలైన అక్షరను ప్రేమించి పెద్దలను ఎదురించి చేసుకోవడం విశేషం.
Viva Harsha Marriage images
ఈ గురువారం వైవా హర్ష పెళ్లి హైదరాబాద్ లో అతడి సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. ఈ వివాహానికి దర్శకుడు మారుతి, నటుడు ప్రవీణ్, నిర్మాత ఎస్.కే.ఎన్ సహా సినీ ఇండస్ట్రీ ప్రముఖులు హాజరై పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ వైవా హర్ష దంపతుల ఫొటోలు షేర్ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.
వైవా హర్ష ప్రేమ పెళ్లి చేసుకోవడం విశేషం. ఆ అమ్మాయి పేరు అక్షర రీసు. ఎం.కాం పూర్తి చేసిన ఈ వైజాగ్ అమ్మాయితో గత నాలుగేళ్లుగా హర్షకు పరిచయం ఉంది. ఇద్దరూ స్నేహితులుగా హైదరాబాద్ లో ఉండేవారు. అప్పుడప్పుడూ కలుస్తుండేవారు.
సడెన్ గా ఈ మధ్య హర్ష తాను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యానని అక్షర, ఇతర స్నేహితుల మధ్య చెప్పాడట.. ఈ క్రమంలోనే అక్షర.. ‘తనను చేసుకుంటావా?’ అని డైరెక్టుగా హర్ష ముందే అడిగిందట.. దీంతో ఈ అనూహ్య ఆఫర్ కు హర్ష షాక్ అయ్యి ఆ తర్వాత ఉబ్బితబ్బిబ్బై ఎర్రగా దొండపండులా ఉన్న అక్షర తనను చేసుకుంటాననడంతో సరేనని వెంటనే ఒప్పేసుకున్నాడు.
అయితే హర్షను పెళ్లి చేసుకోవడానికి అక్షర తండ్రి మాత్రం ఒప్పుకోలేదు. చాలా సమయం వీరిద్దరి ఓపిక ఎదురించి ఒప్పించడానికి ప్రయత్నించారు. ఇక ఇటీవల తాజాగా అక్షరను నిరాడంబరంగా సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య హర్ష పెళ్లి చేసుకున్నాడు.
‘కలర్ ఫొటో, గల్లీ రౌడీ లాంటి సినిమాలతో హర్ష ఇటీవల రెండు వరుస విజయాలు దక్కించుకున్నాడు. ఇక ‘ఆహా’ ఓటీటీ కోసం కొన్ని షోలు కూడా చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అటు యూట్యూబ్ వీడియోలతో.. ఇటు సినిమాలతో హర్ష బిజీగా ఉన్నాడు.