IND vs PAK T20 World Cup 2021: నేడు భారత్, పాకిస్తాన్ మ్యాచ్: కోహ్లికి సవాల్..

IND vs PAK T20 World Cup 2021: 20 ఓవర్లు.. బంతి బంతికి టెన్షన్ వాతావరణం.. దూకుడు పర్యాయపదంగా ఉండే ఈ ధనాధన్ ప్రపంచక్ టీ 20 టోర్నీ ఇప్పటికే ప్రారంభమైంది. ఎంఎస్ ధోనీ సారధ్యంలో ఒకసారి కప్పు కొట్టిన టీం ఇండియా మరోసారి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఒకసారి అప్పట్లో ఫైనల్ వరకు వెళ్లినా రెండో కప్ మాత్రం తేలేకపోయింది. 2011లో ప్రపంచ కప్ తెచ్చిన ధోని.. 2016 వరకూ టీంఇండియాకు కెప్టెన్ గా […]

Written By: NARESH, Updated On : October 24, 2021 8:41 am
Follow us on

IND vs PAK T20 World Cup 2021: 20 ఓవర్లు.. బంతి బంతికి టెన్షన్ వాతావరణం.. దూకుడు పర్యాయపదంగా ఉండే ఈ ధనాధన్ ప్రపంచక్ టీ 20 టోర్నీ ఇప్పటికే ప్రారంభమైంది. ఎంఎస్ ధోనీ సారధ్యంలో ఒకసారి కప్పు కొట్టిన టీం ఇండియా మరోసారి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఒకసారి అప్పట్లో ఫైనల్ వరకు వెళ్లినా రెండో కప్ మాత్రం తేలేకపోయింది. 2011లో ప్రపంచ కప్ తెచ్చిన ధోని.. 2016 వరకూ టీంఇండియాకు కెప్టెన్ గా ఉన్నాడు. ఆ తరువాత తాను ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈసారి విరాట్ కోహ్లి ఆధ్వర్యంలో భారత జట్టు బరిలోకి దిగబోతుంది. విరాట్ కోహ్లికి టీ20 ప్రపంచకప్ లలో ఈ కెప్టెన్సీ మొదటిది, చివరిది కావడం విశేషం. ఎందుకంటే ఈ టోర్నీ తరువాత తాను టీ 20 నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లీ ముందే ప్రకటించారు. ఈ టోర్నీ ప్రారంభంలోనే భారత్ కు అసలు సిసలు సవాల్ ఎదురుకాబోతోంది. నేడు పాకిస్తాన్ తో టీంమిండియా తలపడనుంది. ప్రపంచ క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ పోరు విరాట్ కోహ్లి సారథ్యానికి పెను సవాల్ గా మారనుంది.

India-vs-Pakistan-Match-Who-will-Win-Playing-11-Winning-Prediction

ఓమన్, యూఏఈ వేదికగా సాగుతున్న టీ 20 టోర్నీలో ఆదివారం జరిగే భారత్-పాక్ మ్యాచ్ అత్యంత కీలకమైంది. దాయాదుల మధ్య సాగే ఈ పోరు ఇరు దేశాలే కాకుండా ప్రపంచంలోని దేశాలన్నీ ఆసక్తిగా చూస్తాయి. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకుల్లో భారత్ కు రెండో స్థానం ఉంది. ఇంగ్లాండ్ మొదటి స్థానంలో ఉంది. మూడోస్థానంలో పాకిస్తాన్ ఉంది. ఈ మ్యాచ్ తరువాత భారత్, పాక్ స్థానాలు మారే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇక్కడ ర్యాంకుల గురించి పట్టించుకోకుండా కేవలం ఈ రెండు శత్రుదేశాల గెలుపునే ప్రధానంగా చూస్తారు. ఎన్నో ఏళ్లుగా ప్రపంచ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ ఒక్కటైనా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఆ రోజు నేడు రానే వచ్చింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను ఆ ఉత్కంఠ ఊపేయడం ఖాయం.

భారత్ కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లికి టీ20 టోర్నీతో పాటు నేడు జరిగే మ్యాచ్ కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది గెలుపు మ్యాచ్ మాత్రమే కాకుండా పరువు ఆటగా కూడా ఇరు దేశాలు భావిస్తాయి. భారత్ పై గెలిస్తే బ్లాంక్ చెక్కులు ఆటగాళ్లకు ఇస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ప్రకటించారంటే దీన్ని ఆ దేశం ఎంత పరువుగా భావిస్తుందో అర్థం చేసుకోవచ్చు. భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, మొహమ్మద్ షమీ, జస్ ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరు గత టీ 20 లోనూ ఆడారు. అయితే వీరు వ్యక్తిగతంగా కాకుండా టీంను గెలిపించాల్సిన బాధ్యత ఉంది. ఇక గత టోర్నీకి కెప్టెన్సీగా ఉన్న ధోని ఇప్పుడు జట్టుకు మోంటార్ గా వ్యవహరిస్తున్నారు. ఈసారి ఆయన సలహాలతో కప్ సాధించి తీసుకొస్తామని నమ్మబలుకుతున్నారు.

ఇప్పుడున్న జట్టులో విరాట్ కోహ్లితో పాటు మిగతా వారు ప్రతిభ కలిగిన వారేనని తెలుస్తోంది. రోహిత్ శర్మ ఐపీఎల్ ట్రోపీని 5 సార్లు గెలిచారు. ఇక కెప్టెన్లుగా ఉన్న కెఎల్ రాహుల్, ఆశ్విన్, రిషబ్ పంత్, విరాట్ కోహ్లి లంతా ఐపీఎల్ లో కెప్టెన్లుగా ఉన్నవారే. వీరు వ్యక్తిగతంగా కాకుండా జట్టును విజయం సాధించడంలో మెళకువలు తెలిసే ఉంటాయి. అందువల్ల ఈసారి జట్టు స్ట్రాంగ్ గా ఉందని అంటున్నారు. బంతి బంతికి కెప్టెన్ వ్యూహ రచన చేయడంతో పాటు మిగతా ఆటగాళ్లకు అందనంత సర్వోత్తముడిగా వ్యవహరించడమే కెప్టెన్సీ పనితీరుకు గీటురాయిగా ఉంటుంది. అలాంటి మ్యాజిక్ విరాట్ కోహ్లి ఈ సారి చేయగలగా? పాకిస్తాన్ పై భారత్ ను గెలిపించగలడా..? మన రికార్డును పదిలం చేయగలడా? టీమిండియా కెప్టెన్ గా నిరూపించగలడా..? లేదా..? అనేది చూడాలి.

ప్రపంచకప్ టోర్నీలో భారత్ ఇప్పటివరకు పాకిస్తాన్ చేతిలో ఒక్కసారి ఓడిపోని ఘనమైన రికార్డు ఉంది. 12-0తో లీడ్ లో ఉంది. ఈరోజు రాత్రి ఏం జరుగుతుందనేది వేచిచూడాలి. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో మాత్రం భారత్ పై పాకిస్తాన్ ఒకసారి గెలిచింది. స్టార్ స్పోర్ట్స్ చానెల్ లో ఈ రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. డిస్పీ +హాట్ స్టార్ లోనూ లైవ్ మ్యాచ్ చూడొచ్చు.

టీ20 ప్రపంచకప్ ముగిసిన తరువాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లి ప్రకటించారు. దీంతో కెప్టెన్సీలో కోహ్లీ మొదటి, చివరి మ్యాచ్ ఇదే కానుంది. మరోవైపు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో విరాట్ పై తీవ్ర ఒత్తిడి పడనుంది. ఈ నేపథ్యంలో కోహ్లి ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడోనని క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారు.

భారత జట్టు ఇదే..
———–
కోహ్లీ (కెప్టెన్) , కేఎల్ రాహుల్, రోహిత్, సూర్యకుమార్, రిషబ్ పంత్(కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్/వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్/శార్దుల్ ఠాకూర్, షమీ, బుమ్రా,