India Vs New Zealand Semi Final: వరల్డ్ కప్ సెమీస్ లో మనోడే టీమిండియాకు శత్రువు…

న్యూజిలాండ్ టీం ను చిత్తు చేయడానికి ఇండియన్ టీం రెడీ అవుతుంది. గెలుపుకి, ఓటమికి మధ్య ఉన్న ఒక్క ఇంచు తేడా ని ఈ సెమీఫైనల్ లో చేరిపేసి ఒక భారీ విక్టరీ సాధించి ఫైనల్ కి వెళ్లి కప్పు కొట్టడమే లక్ష్యంగా ఇండియన్ టీమ్ ముందుకెళ్తుంది.

Written By: Gopi, Updated On : November 14, 2023 11:11 am

India Vs New Zealand Semi Final

Follow us on

India Vs New Zealand Semi Final: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ టీం న్యూజిలాండ్ తో సెమీఫైనల్ కి సర్వం సిద్ధం చేసుకుంటుంది. ఇక ఈ క్రమంలోనే ఇండియన్ టీం తన పోరాట పటిమను చూపించే సమయం ఆసన్నమైనది. ఎందుకంటే 2019 నాటి ఓటమిని గుర్తు చేసుకుంటూ ఈ సెమిస్ లో న్యూజిలాండ్ ని చిత్తు చేస్తే తప్ప ఆ ఓటమి తాలూకు గెలుపు అనేది మనం పూర్తి గా పొందలేం…

ఇక దానికోసమే న్యూజిలాండ్ టీం ను చిత్తు చేయడానికి ఇండియన్ టీం రెడీ అవుతుంది. గెలుపుకి, ఓటమికి మధ్య ఉన్న ఒక్క ఇంచు తేడా ని ఈ సెమీఫైనల్ లో చేరిపేసి ఒక భారీ విక్టరీ సాధించి ఫైనల్ కి వెళ్లి కప్పు కొట్టడమే లక్ష్యంగా ఇండియన్ టీమ్ ముందుకెళ్తుంది… ఇక ప్రత్యర్థి ఎవరైనా సరే ఒక్కసారి మైండ్ లో గెలుపు అనేది ఫిక్స్ చేసుకొని బ్లైండ్ గా దూసుకెళ్లిపోవడానికి రెడీ అవుతుంది.

అయితే ఈ క్రమంలోనే న్యూజిలాండ్ లో ఒక ప్లేయర్ మనకి సవాల్ విసురుతున్నాడు.ఆయన ఎవరు అంటే భారతీయ సంతతికి చెందిన రచిన్ రవీంద్ర… స్వతహాగా ఆయన బ్లెడ్ లోనే ఇండియన్ తాలూకు పోరాట పటిమ దాగి ఉంది అయిన కూడా ప్రస్తుతం ఆయన న్యూజిలాండ్ టీమ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు ఆ టీం గెలుపు మాత్రమే ముఖ్యం… ఇక బుడిబుడి అడుగులు వేసింది ఇండియాలోనే, బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేసింది ఇండియాలోనే కానీ ఇప్పుడు ఇండియన్ టీమ్ కి భారీ సవాలు విసురుతున్నాడు…

ఈ టోర్నీ లో ఇప్పటికే న్యూజిలాండ్ టీం తరఫున ఆయన 9 మ్యాచ్ ల్లో 565 పరుగులు చేశాడు అందులో మూడు సెంచరీలు ఉంటే, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఇలాంటి బీకర ఫామ్ లో ఉన్న రచిన్ రవీంద్ర ని మన ఇండియన్ బౌలర్లు ఎలా నిలువరిస్తారు అనేది కూడా ఇక్కడ చాలా పెద్ద ప్రశ్నగా మారింది. అతన్ని కనక తొందరగా అవుట్ చేయకపోతే మన టీమ్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు…

ప్రస్తుతం న్యూజిలాండ్ టీమ్ లో వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్ గా కొనసాగుతున్న రచిన్ రవీంద్ర మన దేశ ప్లేయర్ అయినప్పటికీ న్యూజిలాండ్ లో కీలక ప్లేయర్ గా మారి మన దేశం మీదనే పోరాటానికి దిగుతున్నాడు అంటే ఒక వంతుకు మనం గర్వపడాల్సిన విషయం ఎందుకంటే మనవాళ్ళు ఎక్కడున్నా టాప్ లో ఉంటారు అని ఆయన్ని చూస్తే అర్థం అవుతుంది…
ఇక మన ప్లేయర్ తో మనమే పోటీ పడుతున్నాం అంటే ఇండియన్ టీమ్ కి పోటీ ఇచ్చే దమ్ము ఇంకో ఇండియన్ ప్లేయర్ కే ఉంటుంది అనేదానికి రచిన్ రవీంద్ర ను చూస్తే అర్థం అవుతుంది…ఇక ఈ సెమీస్ లో ఎవరు గెలుస్తారు అనేది కీలకం గా మారనుంది…