Manchu Lakshmi: మంచు లక్ష్మికి అల్లు శిరీష్ ఘాటు ముద్దు… ప్రైవేట్ పార్టీలో రచ్చ రచ్చ! వైరల్ ఫొటోలు

మంచు లక్ష్మికి కూడా ఆహ్వానం ఉంది. సిల్వర్ కలర్ స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కా ఈ పార్టీలో మంచు లక్ష్మిని అల్లు శిరీష్ ముద్దాడాడు.

Written By: NARESH, Updated On : November 14, 2023 11:07 am

Manchu Lakshmi

Follow us on

Manchu Lakshmi: మంచు లక్ష్మిని అల్లు శిరీష్ ముద్దాడిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రైవేట్ పార్టీలో వీరు ఇలా రొమాంటిక్ గా కనిపించారు. టాలీవుడ్ కి మెల్లగా బాలీవుడ్ కల్చర్ పాకుతుంది. స్టార్ నైట్స్, సెలబ్రిటీ పార్టీలు చోటు చేసుకుంటున్నాయి. చిరంజీవి, రామ్ చరణ్ అద్వైర్యంలో భారీ దివాళీ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి టాప్ స్టార్స్ కుటుంబాలతో పాటు హాజరయ్యారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, వెంకటేష్ తో పాటు పలువురు దీపావళి పార్టీలో సందడి చేశారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ పార్టీకి మంచు లక్ష్మికి కూడా ఆహ్వానం ఉంది. సిల్వర్ కలర్ స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కా ఈ పార్టీలో మంచు లక్ష్మిని అల్లు శిరీష్ ముద్దాడాడు. ఆమె బుగ్గపై ఘాటు ముద్దు పెట్టాడు. ఈ ఫోటో ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. అయితే అది పార్టీ కల్చర్ లో భాగమైనప్పటికీ పెళ్ళైన మంచు లక్ష్మికి బ్యాచ్ లర్ ఆ రేంజ్ లో ముద్దాడటం చర్చకు దారి తీసింది.

కాగా అల్లు శిరీష్ సక్సెస్ కోసం పోరాడుతున్నాడు. భారీ బ్యాగ్రౌండ్ ఉండి కూడా బ్రేక్ రావడం లేదు. అల్లు శిరీష్ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. కనీసం ఓ ఇమేజ్ తెచ్చుకోలేకపోయాడు. ఇది అల్లు శిరీష్ ని వేధిస్తున్న పరిణామం. ఆయన గత చిత్రం ఊర్వశివో రాక్షసివో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా ఆడలేదు. ఈ చిత్ర హీరోయిన్ అను ఇమ్మానియేల్ తో అల్లు శిరీష్ ఎఫైర్ లో ఉన్నాడనే వాదన ఉంది.

ఇక మంచు లక్ష్మి పరిస్థితి కూడా సేమ్. అమెరికా నుండి దిగిన మంచు లక్ష్మి హీరోయిన్ కావాలనుకుంది. ఈ మేరకు కొన్ని ప్రయత్నాలు చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. మంచు లక్ష్మికి కూడా జనాల్లో ఓ ఇమేజ్ రాలేదు. మోహన్ బాబు కుమార్తె అనే బ్రాండ్ నేమ్ తప్పితే మంచి నటి అనిపించుకోలేకపోయింది. ప్రస్తుతం అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ చేస్తుంది. ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. అగ్ని నక్షత్రం మంచు లక్ష్మి ప్రధానంగా తెరకెక్కింది.