IPL 2024: ఐపీఎల్ గత 16 సీజన్ లతో పోల్చుకుంటే ఈ సీజన్ భారీ క్రేజీ ను సంపాదించుకుంటుంది. ఐపీఎల్ కి ఊపు తెప్పించడానికి ఆయా టీమ్ లు ఫారన్ ప్లేయర్లను కోట్లు పెట్టి కొన్నారు. వారిలో కొద్దిమంది మాత్రమే అనుకున్న స్థాయిలో రాణిస్తున్నారు. ఇక ఈ సీజన్ లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ల్లో ఐపీఎల్ లో బాగా రాణిస్తున్న ఫారన్ స్టార్ట్ ప్లేయర్స్ లో క్లాసన్, శ్యామ్ కరణ్, మర్కరం, రసెల్ లాంటి ప్లేయర్స్ మాత్రమే బ్యాటింగ్ లో అదరగొడుతున్నారు. ఇక బౌలింగ్ లో చూసినట్లయితే ముస్తఫిజుర్ రెహ్మాన్, రబాడ మంచి బౌలింగ్ ప్రదర్శన ను కనబరుస్తున్నారు. ఇక ఈ సీజన్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి ఇక ముందు జరగబోయే మ్యాచ్ ల్లో ఇంకా వేరే ఫారన్ ప్లేయర్స్ తమ ఫామ్ ను అందుకొని రాణిస్తారేమో చూడాలి.
ఇక ఇది ఇలా ఉంటే ఇండియన్ స్టార్ ప్లేయర్స్ కి ఐపీఎల్ లో చాలా డిమాండ్ ఉంది. అయితే ఈ ఐపీఎల్లో ఇండియన్ యంగ్ ప్లేయర్స్ చాలా అద్భుతమైన ప్రదర్శనతో తమ తమ టీం లను విజయతీరాలకు చేరుస్తున్నారు. అందులో అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్ , రియాన్ పరాగ్, రుతురాజు గైక్వాడ్, యశస్వి జైస్వాల్ వంటి యంగ్ ప్లేయర్స్ అద్భుతంగా రాణిస్తున్నారు .వీళ్లలో గైక్వాడ్, యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ల్లో మంచి పర్ఫామెన్స్ ఇవ్వనప్పటికీ తర్వాత జరిగే మ్యాచ్ ల్లో వీళ్ళు అద్భుతంగా రాణిస్తారనే విషయం అయితే తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు .
వీరితోపాటు ఇండియన్ సీనియర్ ప్లేయర్స్ అయినటువంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా మంచి ప్రదర్శనను కనబరుస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సీజన్ లో ఇప్పటివరకు జరిగిన తొమ్మిది మ్యాచ్ ల్లో వరుసగా మొదటి మూడు మ్యాచ్ ల్లో ఫారన్ ప్లేయర్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచారు. వాళ్ళు ఎవరంటే ముస్తఫిజర్ రెహ్మాన్, ఆండ్రూ రసల్, శ్యామ్ కరణ్..ఇక ఆ తర్వాత జరిగిన మ్యాచ్ ల్లో ఇండియన్ ప్లేయర్స్ అయిన సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ , విరాట్ కోహ్లీ , శివమ్ దుబే మరియు నిన్న జరిగిన మ్యాచ్ లో రియాన్ పరాగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అయితే ఇదివరకు టాప్ ఆర్డర్ లో ఆడిన ఇండియన్ ప్లేయర్స్ మాత్రమే షైన్ అయ్యేవారు.
కానీ ఈ ఐపీఎల్లో మిడిల్ ఆర్డర్ లో ఆడుతున్న ఇండియన్ ప్లేయర్స్ చాలా అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తున్నారు. ఇది ఇండియన్ టీం కి శుభ పరిణామం అనే చెప్పాలి. ఇక ముఖ్యంగా డెత్ ఓవర్లలో హర్షిత్ రానా, జయదేవ్ ఉన్నద్కట్, ఆవేశ్ ఖాన్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. ఇక ముందు జరగబోయే మ్యాచ్ ల్లో కూడా ఫారన్ ప్లేయర్స్ ను డామినేట్ చేస్తూ ఇంకా ఎంతమంది ఇండియన్ యంగ్ ప్లేయర్స్ వాళ్ల సత్తా చూపిస్తారో చూడాలి…