MS Dhoni: ఫ్యాన్స్ కి రోమాలు నిక్కపొడుక్కుకునే విధమైన అనుభూతి కలిగించడం అనేది ధోని కి చాలా సర్వసాధారణమైన విషయం. తన అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ తో రీసెంట్ గానే IPL లో చెన్నై సూపర్ కింగ్స్ టీం కి 5 వ సారి ట్రోఫీ గెలిపించాడు. ముంబై ఇండియన్స్ టీం తో పాటుగా IPL లో 5 సార్లు కప్ గెలుచుకున్న ఏకైక కెప్టెన్ గా ధోని చరిత్ర సృష్టించాడు.
ఈ సీజన్ ఆయనకీ చివరి సీజన్ అనుకున్నారు కానీ, మరొక్క సీజన్ కూడా ధోని ఆడే ఛాన్స్ ఉందని, స్వయంగా ఆయనే తెలిపాడు. కాళ్లకు సంబంధించిన ముఖ్యమైన సర్జరీ చేయించుకున్న ధోని,కొన్ని రోజుల తర్వాత పరిస్థితి చూసి వచ్చే IPL సీజన్ ఆడాలా? వద్దా అనేది నిర్ణయించుకుంటాడట. ఇది ఇలా ఉండగా ధోని ఇప్పటికే సినీ రంగం లోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.
ధోని ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ద్వారా ఆయన సినిమాలను నిర్మించబోతున్నాడు. ఇది ఇలా ఉండగా ధోని గతం లో ఒక బాలీవుడ్ సినిమాలో నటించాడట. కానీ ఇప్పటి వరకు ఆ సినిమా విడుదలకు నోచుకోలేదనే విషయం చాలా మంది అభిమానులకు తెలియదు. వివరాల్లోకి వెళ్తే 2010 వ సంవత్సరం లో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ‘డేవిడ్ ధావన్’ హుక్ యా క్రూక్ అనే సినిమాని తెరకెక్కించాడు. ఇందులో జాన్ అబ్రహం హీరో గా నటించగా, కాయ్ కాయ్ మీనన్ మరియు జెనీలియా హీరోయిన్స్ గా నటించారు.
క్రికెట్ అంటే అమితమైన ఇష్టం ఉన్న ఒక యువకుడు ఎన్నో అవరోధాలను దాటుకొని ఇండియన్ క్రికెట్ టీం కి సెలెక్ట్ అవుతాడు, కానీ అతని కోపం వల్ల కొన్ని పరిస్థితులను ఎదురుకొనలేక క్రికెట్ టీం నుండి వైదొలుగుతాడు. ఈ చిత్రం లో ధోని కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు, కానీ ఇప్పటి వరకు ఆ సినిమా విడుదలకు ఎందుకు నోచుకోలేదు అనే విషయం ఎవరికీ తెలియదు.