Kavya Maran: ఎగిరి గంతేస్తుంటే స్మాల్ కిడ్ అనుకున్నారా.. కావ్య పాప ఎంత రిచ్చో తెలుసా?

కావ్య మారన్ తమిళనాడుకు చెందిన సుప్రసిద్ధ వ్యాపారవేత్త, సన్ గ్రూప్ వ్యవస్థాపకుడు కళానిధి మారన్ ఏకైక కుమార్తె. 1992 ఏప్రిల్ 6 న చెన్నైలో కావ్య జన్మించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 2, 2024 12:12 pm

Kavya Maran

Follow us on

Kavya Maran: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ మ్యాచ్ ఆడుతుంటే కెమెరామెన్ కచ్చితంగా.. కెమెరా యాంగిల్ మార్చుతాడు. హైదరాబాద్ జట్టు ఆటగాళ్ళు ఫోర్ లేదా సిక్స్ కొడితే కెమెరాను ఆమె వైపు మళ్ళిస్తాడు. ఆమె ఎగిరి గంతేసే దృశ్యాలను పదేపదే చూపిస్తాడు. మ్యాచ్ ఓడిపోతే డీలా పడిపోతుంది. నిరాశతో కళ్ళు మూసుకుంటుంది. ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది మేము ఎవరి గురించి చెప్తున్నామో.

32 సంవత్సరాల వయసులోనే కావ్య మారన్ హైదరాబాద్ జట్టుకు సీఈవో అయ్యారు. ఇక్కడి ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు పెద్దగా సత్తా చాటలేదు. అయినప్పటికీ ఆ జట్టు వార్తల్లో ఉందంటే దానికి కారణం కావ్య మారన్. ఆమె తన చలాకితనంతో జట్టులో ఉత్సాహం నింపుతుంది. ఆటగాళ్లలో స్ఫూర్తిని కలిగిస్తుంది. సహాయక సిబ్బందితో కలిసి వ్యూహాలు రచిస్తుంది. ప్రతి మ్యాచ్ ను దగ్గరుండి చూస్తుంది. ప్రతి అంశాన్ని నోట్ చేసుకుంటుంది. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లకు సలహాలు ఇస్తుంది.

కావ్య మారన్ తమిళనాడుకు చెందిన సుప్రసిద్ధ వ్యాపారవేత్త, సన్ గ్రూప్ వ్యవస్థాపకుడు కళానిధి మారన్ ఏకైక కుమార్తె. 1992 ఏప్రిల్ 6 న చెన్నైలో కావ్య జన్మించారు. ఆమె తల్లి కావేరి మారన్ సోలార్ టీవీ కమ్యూనిటీ రిస్ట్రిక్టేడ్ సంస్థకు సీఈఓ గా ఉన్నారు. ఇండియాలోనే అత్యధిక జీతం అందుకునే మహిళ సీఈవో ల్లో కావేరి మారన్ ఒకరు. కళానిధి మారన్ తండ్రి మురసోలిమారన్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి కళానిధి మారన్ దగ్గరి బంధువు. కావ్య మారన్ చెన్నైలోనే చెల్లా మెరీ కాలేజీలో డిగ్రీలో కామర్స్ చదివారు. లండన్ లోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కళానిధికి కావ్య ఒక్కతే కూతురు.. 33 వేల కోట్ల సన్ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యానికి ఆమె వారసురాలు. ప్రస్తుతం కావ్య మారన్ వ్యక్తిగత ఆస్తుల విలువ 417 కోట్లు. 2019 లో ఓ సంస్థ చేసిన సర్వే ప్రకారం కళానిధి మారన్ ఆస్తుల విలువ దాదాపు 19 వేల కోట్లు.

సన్ రైజర్స్ జట్టు మాత్రమే కాదు సన్ టీవీ నెట్వర్క్ కు సంబంధించిన వ్యవహారాలలో కావ్య కీలకంగా వ్యవహరిస్తారు. కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా సామాజిక కార్యక్రమాలలోనూ చురుకుగా పాల్గొంటారు. క్యాన్సర్ రోగులకు సాయం చేస్తుంటారు. ప్రకృతి విపత్తుల సమయంలో బాధిత ప్రజలకు అండగా ఉంటారు. 2018లో కావ్య హైదరాబాద్ జట్టు సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో హైదరాబాద్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబరచకపోవడంతో కావ్య పై విమర్శలు వెల్లువెత్తేవి. క్రమక్రమంగా ఆటపై పట్టు సాధించిన ఆమె ఈ సీజన్లో సమర్థవంతమైన ఆటగాళ్లను కొనుగోలు చేశారు. అంతేకాదు సౌత్ ఆఫ్రికా టీ 20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్ట్రన్ కేఫ్ జట్టుకు ఆమె యజమానిగా వ్యవహరిస్తున్నారు. గత రెండు సీజన్లలోనూ ఆ జట్టు విజేతగా నిలిచింది.