Hardik Pandya: ఇండియన్ క్రికెట్ టీం లో హార్థిక్ పాండ్య కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక ఈయన వన్డే వరల్డ్ కప్ లో మొదటి మూడు మ్యాచ్ లు ఆడినప్పటికి ఆ తర్వాత చీలిమండ గాయంతో వరల్డ్ కప్ నుంచి తను రూల్డ్ ఔట్ అయ్యాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. మధ్యలో కొంచం క్యూర్ అయి తను ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసినప్పటికీ ఆయన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మళ్లీ దానికి సంబంధించిన గాయం తిరగబెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో ఆయన ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
అయితే గత వారం రోజుల నుంచి ఒక న్యూస్ అనేది విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే ముంబై ఇండియన్స్ టీమ్ లోకి హార్దిక్ పాండ్య ని తీసుకున్నందుకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం అతనికి ఎంత పే చేస్తుంది అనేది ఇక్కడ చాలా చర్చనీయంశం గా మారింది. ఎందుకంటే 2022 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ టీమ్ హార్దిక్ పాండ్య కి ఆత్రం యాజమాన్యం 15 కోట్లు చెల్లించి అతన్ని తన టీమ్ లోకి తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ అతన్ని తీసుకున్నందుకుగాను ఆయన 2022 వ సంవత్సరంలో ఆ టీమ్ కి కప్పును అందించాడు.
ఇక ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సంవత్సరంలో కప్పు గెలుచుకున్న టీం గా గుజరాత్ టీమ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది… ఇక ఇదిలా ఉంటే 2023 సీజన్ లో కూడా గుజరాత్ టైటాన్స్ టీం ని ఫైనల్ కి చేర్చి ఒక్క అడుగు దూరం లో రన్నరప్ గా మిగిలిపోయారు.ఇక ఇదిలా ఉంటే హార్థిక్ పాండ్య కి సంబంధించిన ఒక న్యూస్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఏంటి అంటే 2015 వ సంవత్సరంలో ముంబై ఇండియన్స్ టీం కి ఆడిన హార్దిక్ పాండ్య ఆ సంవత్సరం కేవలం బేస్ ప్రైస్ 10 లక్షలు మాత్రమే ముంబై ఇండియన్స్ కి ఆడాడు. ఇక 2016,2017 వ సంవత్సరాలలో కూడా అదే అమౌంట్ కి ముంబై ఇండియన్స్ టీం తరఫున ఆడాడు. 2018 వ సంవత్సరంలో అనూహ్యంగా అతనికి 11 కోట్లు ఇచ్చి ముంబై ఇండియన్స్ టీం రిటైన్ చేసుకుంది. ఇక దాంతో ఆయన 2021 వ సంవత్సరం వరకి అతను 11 కోట్లకే ముంబై ఇండియన్స్ టీం తరఫున ఆడాడు. అయితే 2022వ సంవత్సరంలో అతన్ని ముంబై టీమ్ రిటేన్షన్ చేసుకోలేదు. దాంతో ఆయన్ని గుజరాత్ టైటాన్స్ టీం లో తీసుకుంది.ఆయన కోసం ఆ టీమ్ ఏకంగా 15 కోట్లు చెల్లించింది…
ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ అతనికి 25 కోట్ల చెల్లినచనున్నట్టు గా తెలుస్తుంది. అయితే అఫీషియల్ గా 15 కోట్లు పెట్టి హార్థిక్ పాండ్య ని తీసుకున్నప్పటికీ ఇంకో పది కోట్లు అంబాని సమకూరుస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి…అయితే ఏరీకోరీ హార్థిక్ పాండ్యని తీసుకున్నందుకు అతనికి ఎంత అమౌంట్ ఇచ్చిన అది తక్కువే అని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తుంది…