Brian Lara: ఇండియన్ టీం ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ముగించుకొని సౌతాఫ్రికా తో మూడు ఫార్మాట్లలో మూడు సీరీస్ లు ఆడటానికి బయలుదేరింది.ఇక అందులో భాగంగానే మొదట ఈనెల 10 వ తేదీన జరిగే టి20 మ్యాచ్ తో అక్కడ మ్యాచ్ లు అనేవి ఆరంభం అవుతున్నాయి. ఇక ఈ సీరీస్ లలో టీమిండియా ఏ మేరకు రాణిస్తుంది అనే విషయాల మీద స్పష్టత అయితే లేదు. కానీ ప్రస్తుతం ఇండియన్ టీం ప్లేయర్లు మంచి ఫామ్ లో ఉండటంతో సౌతాఫ్రికా మీద మంచి పర్ఫామెన్స్ ఇస్తు రాణించి ఆ సిరీస్ లను కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే వెస్టిండీస్ టీం ప్లేయర్ మాత్రమే అలాగే ఆ టీమ్ యొక్క మాజీ కెప్టెన్ అయిన బ్రియాన్ లారా కొన్ని సంచలన వ్యాఖ్యలను చేశాడు. అయితే లారా తను ఒక టెస్టు మ్యాచ్ లోనే ఒక అత్యధికంగా 400 పరుగులు చేశాడు. నిజానికి ఒక వ్యక్తి ఒక మ్యాచ్ లో అన్ని పరుగులు చేయడం విశేషం…ఇక ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా లారా చరిత్రలో నిలిచాడు.ఇక ఇప్పటి వరకు ఎవ్వరూ ఆ రికార్డ్ ని బ్రేక్ చేయలేదు…
అయితే ఈ విషయం మీద లారా స్పందిస్తూ నేను టెస్ట్ లో చేసిన 400 పరుగుల స్కోర్ ని ప్రపంచ దేశాల్లో క్రికెట్ ఆడుతున్న ప్లేయర్లందరిలో ఆ రికార్డు బ్రేక్ చేసే సత్తా ఉన్న ప్లేయర్ ఒక్కరు మాత్రమే ఉన్నాడు. ఆయన ఎవరు అంటే ఇండియన్ టీమ్ కి చెందిన శుభ్ మన్ గిల్ అని చెప్పారు నిజంగా ఆయన గిల్ పేరు చెప్పడం గిల్ అదృష్టం…ఇక అలాగే లారా మాట్లాడుతూ నేను చాలా రోజుల నుంచి ఆయన ఆట తీరని చూస్తున్నాను చాలా కన్సిస్టెన్సీగా ఆడుతూనే టీమ్ కి అవసరం అయిన సమయం లో హిట్టింగ్ చేసే కెపాసిటీ ఉన్న ప్లేయర్ తను…ఇక ఇండియన్ టీం కి గిల్ రూపం లో ఒక మంచి ఓపెనర్ దొరికాడని చెప్పాడు.
తను ఈ సంవత్సరంలోనే టెస్ట్, వన్డే , టి20, ఐపిఎల్ లాంటి అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన ప్లేయర్ గా మంచి రికార్డును క్రియేట్ చేశాడు. దాంతో ఆయన చేసిన 400 పరుగుల హ్యాయెస్ట్ స్కోర్ ని కూడా దాటే కెపాసిటీ ఉన్న ప్లేయర్ గిల్ ఒక్కడే అంటూ లారా గిల్ ని ఆకాశానికి ఎత్తేశాడు… నిజానికి గిల్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు అద్భుతమైన రీతిలో తను ప్రదర్శనను కనబరుస్తున్నాడు. ఇక వరల్డ్ కప్ లో కూడా తనదైన రీతిలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చి ఇండియన్ టీం గెలుపు కి కీలక పాత్ర వహిస్తూ వచ్చాడు. ఇక వెస్టిండీస్ టీమ్ దిగ్గజ కెప్టెన్ అయిన బ్రియాన్ లారా ఇండియన్ ప్లేయర్ల మీద ప్రశంసల వర్షం కురిపించడం చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు…