IPL 2024: ఐపిఎల్ అంటే ప్రపంచం లో ఉన్న ప్రతి క్రికెట్ అభిమానికి పండగ అనే చెప్పాలి. ఐపీఎల్ 17వ సీజన్ కోసం ప్రస్తుతం ప్రతి ఒక్కరు వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటివరకు 16 సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఐపీఎల్ లీగ్… ప్రస్తుతం 17 సీజన్ ని తొందరలోనే ప్రారంభించబోతుంది. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ లను రెండు షెడ్యూల్స్ గా నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు మొదటి షెడ్యూల్ ని నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక మొదటి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ అయినా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగబోతుంది. అలాగే ఫస్టాఫ్ లో హైదరాబాద్ టీం మొత్తం ఎన్ని మ్యాచ్ లు ఆడుతుంది అనే ఆసక్తి కూడా అభిమానుల్లో నెలకొంది. ఇక అందులో భాగంగానే మార్చి 23వ తేదీన ఈడెన్ గార్డెన్స్ వేదికగా కలకత్తా తో హైదరాబాద్ టీం తన మొదటి మ్యాచ్ ని ఆడబోతుంది. ఇక దాని తర్వాత మార్చి 27వ తేదీన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం( ఉప్పల్) వేదికగా ముంబై తో హైదరాబాద్ మరొక మ్యాచ్ ఆడబోతుంది. ఇక మార్చి 31వ తేదీన నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ఒక మ్యాచ్ ఆడబోతోంది.
అలాగే ఏప్రిల్ 7 వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ తో హైదరాబాద్ లోనే మరొక మ్యాచ్ కూడా ఆడబోతుంది. ఇక మొత్తం ఫస్టాఫ్ షెడ్యూల్లో 21 మ్యాచులు ఆడుతుండగా, అందులో హైదరాబాద్ టీం 4 మ్యాచులు ఆడుతుంది. అందులో రెండు మ్యాచ్ లు హైదరాబాద్ వేదికగా జరుగుతుండగా, మరొక రెండు మ్యాచ్ లు మాత్రం ఇతర గ్రౌండ్స్ లో ఆడబోతుంది.
ఇక ఐపీఎల్ మ్యాచ్ లను స్టార్ స్పోర్ట్స్ లో గాని, జియో టీవీలో గాని వీక్షించవచ్చు… ఇక ఎన్నికల తర్వాత సెకండ్ షెడ్యూల్ ని రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…మరి ఈసారి అన్ని టీమ్ లు భారీ కసరత్తులతో బరిలోకి దిగుతున్నాయి. చూడాలి మరి ఈసారి ఏ టీమ్ టైటిల్ గెలుచుకుంటుందో…
హైదరాబాద్ ఆడే నాలుగు మ్యాచ్ ల వివరాలు ఇవే…
సన్ రైజర్స్ హైదరాబాద్ vs కొలకత్తా నైట్ రైడర్స్ (మార్చి 23 వ తేదీన ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది)…
సన్ రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ (మార్చి 27 వ తేదీన ఉప్పల్ స్టేడియం లో జరగనుంది)
సన్ రైజర్స్ హైదరాబాద్ vs గుజరాత్ టైటాన్స్ (మార్చి 31 వ తేదీన నరేంద్రమోడీ స్టేడియం వేదికగా జరగనుంది)
సన్ రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ ( ఏప్రిల్ 5 వ తేదీన ఉప్పల్ స్టేడియం లో జరగనుంది)