MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని ఎన్ని బిజినెస్ లు చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ టీం కి ఐదుసార్లు ట్రోఫీని అందించి చెన్నై టీమ్ ను ఐపీఎల్ లో టాప్ పొజిషన్లో ఉంచాడు... ఇక ఇదిలా ఉంటే ధోని గత దశాబ్ద కాలం నుంచి ఐపిఎల్ ద్వారా గాని ఇతరత్రా వ్యవహారాల ద్వారా...

Written By: Neelambaram, Updated On : May 16, 2024 3:46 pm

Do you know how many businesses Mahendra Singh Dhoni is doing

Follow us on

MS Dhoni: ఇండియన్ టీమ్ కు తనదైన సేవలను అందించిన మహేంద్రసింగ్ ధోని గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. దాదాపు 15 సంవత్సరాల పాటు ఇండియన్ టీమ్ కి తన వంతు సహాయం అందించడమే కాకుండా ఇండియన్ క్రికెట్ టీమ్ యొక్క దశదిశా మార్చిన కెప్టెన్ గా కూడా మనం ధోనీని అభివర్ణించవచ్చు. ఇక ఐసీసీ నిర్వహించిన అన్ని ట్రోఫీలను అందుకున్న ఏకైక కెప్టెన్ గా కూడా ధోని చరిత్రను సృష్టించాడు. ప్రస్తుతం ధోని ఐపిఎల్ సీజన్ 17 లో సూపర్ కింగ్స్ టీమ్ లో ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. ఇక ఈ సీజన్ తో ఐపిఎల్ కి తను గుడ్ బై చెప్పబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ టీం కి ఐదుసార్లు ట్రోఫీని అందించి చెన్నై టీమ్ ను ఐపీఎల్ లో టాప్ పొజిషన్లో ఉంచాడు… ఇక ఇదిలా ఉంటే ధోని గత దశాబ్ద కాలం నుంచి ఐపిఎల్ ద్వారా గాని ఇతరత్రా వ్యవహారాల ద్వారా గాని ఆయన సంపాదించిన మనీ 1000 కోట్లకు పైనే ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ధోని క్రికెట్ ఆడుతున్నప్పుడు గ్రౌండ్లో ఎంత పకడ్బందీ ప్లాన్ వేస్తూ ప్రత్యర్థి పై విజయాన్ని సాధిస్తూ ఉంటాడో, తన పర్సనల్ లైఫ్ లో కూడా బిజినెస్ లలో డబ్బులను పెట్టుబడి గా పెట్టి భారీగా రాబడులను కూడా సంపాదిస్తూ వస్తున్నాడు.

ఇక ధోనీకి ఉన్న బిజినెస్ ల గురించి చాలా మందికి తెలియదు. ఆయన ఎన్ని బిజినెస్ లను చేస్తున్నాడనే వ్యవహారాలు ఎవరికి తెలియవు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ధోనీ చేస్తున్న బిజినెస్ లను చూస్తే మతి పోతుందనే చెప్పాలి… ఇక ఈ సీజన్ ఐపిఎల్ కి ఆడుతున్నందుకు గాను ప్లేయర్ గా అతనికి 12 కోట్ల రూపాయలను చెన్నై సూపర్ కింగ్స్ టీం చెల్లిస్తుంది. అలాగే బ్రాండ్స్ ఎండార్స్ మెంట్ రూపంలో 8 కోట్ల వరకు డబ్బులు అతనికి అందుతాయి. ఇక మొత్తానికైతే ఒక సీజన్ కి తను 20 కోట్ల వరకు ఐపీఎల్లో సంపాదిస్తున్నాడు…

ఇక ఇవే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే దేశవ్యాప్తంగా తను సొంతంగా 7 అనే బ్రాండ్ తో బట్టల వ్యాపారాలను కూడా మొదలుపెట్టారు. ఇక రాంచీలో మహి రెస్టారెంట్స్, రెసిడెన్సిస్ పేరుతో కొన్ని హోటల్స్ ని కూడా ప్రారంభించాడు.ఎయిర్ బి ఎన్ బి, ఓయో, మెక్ మై ట్రిప్ లా బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు.ఇక దేశవ్యాప్తంగా 200 లకు పైన సెంటర్ల లో ధోని స్పోర్ట్ ఫిట్ అనే పేరుతో జిమ్ లను నిర్వహిస్తున్నాడు. అలాగే చెన్నై కి చెందిన ఇండియన్ సిమెంట్స్ కు వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన సేవలను అందిస్తున్నారు. ఒకటి రెండు అనే కాదు ఆయన పదుల సంఖ్యలో ధోని బిజినెస్ లను చేస్తున్నాడు. ఇక కార్ 24 బ్రాండ్ లతో కలిసి కార్ల రీసెల్ ను సైతం సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నాడు…

ఇక ధోని కి మొదటి నుంచి కూడా బైకులంటే చాలా ఇష్టం. అందుకే ఆయన ఇండియన్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్నప్పుడు సైతం చాలా బైక్ లను కొనుగోలు చేసి పెట్టాడు. ఇక రాంచీ లో ఉన్న ధోని గరాజ్ లో అతి పురాతనమైన బైక్ లు కూడా ఉంటాయి… నోర్టాన్ జూబ్లీ 250, కవాసకి నిన్జా, కన్ఫెడరేట్ ఎక్స్ 132, హెలిక్యాట్ సైతం ఉన్నాయి. ఇక ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. అందులో చాలా పురాతనమైనవి ఉన్నాయి. ఈ జనరేషన్ కి తగ్గవి కూడా ఉన్నాయి..నిస్సాన్ ఎస్ యూవీ, వ్యాగన్ సిరీస్, లాండ్ రోవర్ 3 లాంటి మరికొన్ని ఖరీదైన కార్లు ఉన్నాయి…ఇక ధోని వీటితో పాటుగా మరికొన్ని కొత్త బిజినెస్ లను కూడా చేపట్టే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది…