Homeక్రీడలుIPL 2024: చారాణ ఐపీఎల్ కు.. బారాణ ఖర్చు.. ఐపీఎల్ ఓనర్లకు డబ్బు ఎలా వస్తుందో...

IPL 2024: చారాణ ఐపీఎల్ కు.. బారాణ ఖర్చు.. ఐపీఎల్ ఓనర్లకు డబ్బు ఎలా వస్తుందో తెలుసా?

IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ జోరుగా సాగుతోంది. జట్ల మధ్య పోరాటం నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. వాస్తవానికి ఐపీఎల్ అనేది మనదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే అత్యంత రిచెస్ట్ క్రికెట్ లీగ్. ఈ లీగ్ ఒకానొక దశలో ఫిఫా కప్ ను కూడా మించిపోయిందని వార్తలు వచ్చాయి.. అందులో వాస్తవం ఎంతో తెలియదు గాని.. ఈ ఐపీఎల్ ద్వారా ఎంత మంది క్రీడాకారులు శ్రీమంతులయ్యారు. ఎన్నో అవకాశాలు పొందారు. క్రికెట్ రంగంలో స్థిరపడ్డారు. 2008లో ప్రారంభమైన ఐపిఎల్ ప్రస్తుతం 17వ సీజన్ కు చేరుకుంది. పది జట్లు ట్రోఫీ కోసం పోరాటం చేస్తున్నాయి. ఐపీఎల్ విజేతకు ట్రోఫీతో పాటు 20 కోట్ల ప్రైజ్ మనీ అందిస్తారు. ఈ టోర్నీ నిర్వహణకు 200 కోట్లు ఖర్చు చేస్తారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక జట్టును నిర్వహించడం.. ఒక జట్టుకు ఓనర్ కావడం అంత సులభమైన విషయం కాదు. ఒక్కో సీజన్ కు దాదాపు 200 కోట్లు ఖర్చు అవుతుంది. విజేతగా నిలిచిన జట్టుకు 20 కోట్లు లభిస్తాయి. రన్నరప్ గా నిలిచిన జట్టుకు 13 కోట్లు అందుతాయి. క్వాలిఫైయర్-2 లో గెలిచిన జట్టుకు ఏడు కోట్లు ఇస్తారు. ఎలిమినేటర్ విభాగంలో ఓడిన జట్టుకు 6.5 కోట్లు అందజేస్తారు.

ఐపీఎల్ వేలంలో మిచెల్ స్టార్క్ 24.75 కోట్లకు అమ్ముడు పోయాడు.. అతడి ఫీజు లో ఇంకా 4.75 కోట్లు తక్కువే.. అయినప్పటికీ ఆ డబ్బు కోసం 200 కోట్లు ఖర్చుపెట్టి ఎందుకు ఐపీఎల్ ఆడిస్తున్నారు? అంత తక్కువ డబ్బు కోసం ఇంత ప్రయాస ఎందుకు? అనే అనుమానం మీలో ఉంది కదా.. అయితే ఇక్కడ ఐపీఎల్ ప్రైజ్ మనీ అనేది ఐస్ క్రీమ్ లాంటిది. అది గెలిచిన జట్టుకు లభిస్తుంది. మిగతా జట్ల యాజమాన్యాలకు ఐపిఎల్ నిర్వాహక కమిటీ వివిధ రూపాల్లో దండిగానే ఆదాయం ఇస్తుంది.

టాటా నుంచి 330 కోట్లు

ఈసారి ఐపీఎల్ ట్రోఫీని టాటా కంపెనీ స్పాన్సర్ చేస్తోంది. మీరు ఐపీఎల్ ట్రోఫీ దగ్గర టాటా లోగోను గమనించే ఉంటారు. ఈ ఏడాదికి టైటిల్ స్పాన్సర్షిప్ కోసం టాటా కంపెనీ 330 కోట్ల వరకు బీసీసీఐకి ఇచ్చింది. ఈ 330 కోట్లలో 50% బీసీసీఐ ఉంచుకుంటుంది. మిగతా 50 శాతాన్ని 10 జట్లకు పంచుతుంది. ఇక మ్యాచ్ స్పాన్సర్షిప్ ద్వారా కూడా ఆదాయం వస్తుంది. థ్రెడ్ పవర్ ప్లే, స్ట్రాటజీక్ టైం అవుట్, ఇంకా రకరకాల రూపాల ద్వారా స్పాన్సర్స్ డబ్బులు చెల్లిస్తారు. ఒక్కో స్పాన్సర్ హీనపక్షం 25 కోట్ల వరకు చెల్లిస్తారు. అలా స్పాన్సర్లు చెల్లించిన ఆదాయాన్ని బీసీసీఐ 50% ఉంచుకొని.. మిగతా జావా శాతం జట్ల యాజమాన్యాలకు ఇస్తుంది. ఇక ఐపీఎల్ మ్యాచ్ ల ప్రసార హక్కుల ద్వారా దండిగా ఆదాయం వస్తుంది. 2008 నుంచి 17 వరకు సోనీ టీవీ 820 కోట్లు చెల్లించి ప్రసార హక్కులు దక్కించుకుంది. 2018 నుంచి 2022 వరకు స్టార్ స్పోర్ట్స్ ఏకంగా 16,400 కోట్లకు లైవ్ టెలికాస్ట్ హక్కులు కొనుగోలు చేసింది. 2024 సంవత్సరానికి జియో సినిమా+ డిస్నీ హాట్ స్టార్ ఏకంగా 24 వేల కోట్లు చెల్లించి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ సొంతం చేసుకున్నాయి. ఈ ఆదాయాన్ని బీసీసీఐ, జట్ల యజమానులు 50: 50 శాతం చొప్పున పంచుకుంటారు.

ఇన్ని కోట్లు ఖర్చు చేసి చానల్స్ యాజమాన్యాలు హక్కులు దక్కించుకుంటే వాటికి ఏంటి లాభం అని మీరు అనుకోవచ్చు? అయితే ఆ చానల్స్ కూడా యాడ్స్ రూపంలో భారీగా ఆర్జిస్తాయి. ఉదాహరణకు 10 సెకండ్ల టైమ్ స్లాట్ ధర దాదాపు 15 లక్షల వరకు ఉంటుంది. అలా పెద్దపెద్ద కార్పొరేట్ల నుంచి చానల్స్ యాజమాన్యాలు ఎండార్స్మెంట్ల రూపంలో భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తాయి. ఇవి మాత్రమే కాకుండా టీం యాజమాన్యాలకు జెర్సీ స్పాన్సర్స్ కూడా ఉంటారు. టీం జెర్సీ ముందు లోగో వేయడానికి దాదాపు 30 కోట్ల వరకు ఒక్కో జట్టు యాజమాన్యం వసూలు చేస్తుంది. జెర్సీ వెనుక వైపు అయితే 15 కోట్ల వరకు చార్జ్ చేస్తుంది. అయితే ఈ ధర ఆ జట్టుకున్న క్రేజ్, అభిమానుల ఆదరణ మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఐపీఎల్ మ్యాచ్లలో టీంలు సొంత మైదానంలో ఆడితే.. టికెట్ల విక్కిరాల రూపంలో వచ్చే ఆదాయంలో 8 శాతం యాజమాన్యాలకు వెళుతుంది. మిగిలిన 20 శాతం ఆ రాష్ట్ర క్రికెట్ బోర్డు స్వీకరిస్తుంది. ఈ-టికెట్ల రూపంలో ప్రతి సీజన్ కు దాదాపు 28 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. వాటిలో 80 శాతం టీం యాజమాన్యాలు తీసుకుంటాయి. మిగతా ఆదాయం టీం ఓనర్స్ కు వెళ్తుంది. ఇవే కాకుండా మర్చండైజ్ రూపంలో టీం ఓనర్లకు విపరీతమైన ఆదాయం వస్తుంది.. ఇక ప్రైజ్ మనీ రూపంలోనూ టీం యాజమాన్యాలకు రెవెన్యూ సమకూర్తుంది. ఉదాహరణకి ఒక టీం ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంటే.. 20 కోట్లు లభిస్తాయి. ఈ ప్రైజ్ మనీ లో సగం టీం యాజమాన్యాలకి వెళుతుంది. మిగిలిన మొత్తాన్ని బృందంలో ఉండే సభ్యులు, ఆటగాళ్లకు సమానంగా పంచుతారు. వేలంలో దక్కే డబ్బులకు ఇవి అదనం.. మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే పురస్కారాల రూపంలో నగదు వస్తుంది. దీనికి తోడు ప్లేయర్లకు మ్యాచ్ ఫీజు కూడా ఉంటుంది. ఇలా అన్ని మార్గాల్లో ఆదాయం ఉంది కాబట్టే ఐపీఎల్ రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా పేరుపొందింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular