Chiranjeevi-Nagababu: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న చిరంజీవి వరుస సినిమాలను చేస్తూ తనను తాను మెగాస్టార్ గా మార్చుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది నటులు ఒక్క సినిమాతో సక్సెస్ సాధించడానికి నానా తంటాలు పడుతుంటే చిరంజీవి మాత్రం ఒకప్పుడు వరుస గా ఆరేడు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించి ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా ఎదిగాడు.
ఇక ఇది ఇక ఉంటే చిరంజీవికి నాగబాబు, పవన్ కళ్యాణ్ అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా గుర్తింపు పొందగా, నాగబాబు మాత్రం హీరోగా ప్రయత్నం చేసినప్పటికీ ఆయన సక్సెస్ అవలేక పోయాడట. ఇక దాంతో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే పలు రకాల షో లకి జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నాడు… ఇక మొత్తానికైతే నాగబాబు కూడా ఇండస్ట్రీలోనే ఉండడం విశేషం… ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక అందులో నాగబాబుని మీరు ఎప్పుడైనా కొట్టారా అని అడగగా దానికి చిరంజీవి సమాధానం చెబుతూ “నేను ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడు నాగబాబు అరో , ఏడో తరగతి చదువుతున్నాడు.
ఇక ఆ క్రమంలోనే నేను ఇంట్లో అమ్మకి హెల్ప్ చేస్తూ ఉండేవాడిని. ఇక అందులో భాగంగానే ఒకే సమయంలో నేను రెండు పనులు చేయాల్సి వచ్చింది. లాండ్రీ షాప్ కెళ్ళి ఐరన్ చేసిన బట్టలు తీసుకురావడం, మరొకటి నా పర్సనల్ వర్క్ ఉండడంవల్ల నేను పర్సనల్ వర్క్ చూసుకోవడానికి వెళుతున్నాను. నువ్వు వెళ్ళి లాండ్రీ షాప్ లో ఉన్న బట్టలు తీసుకురమ్మని నాగబాబు కి చెప్పారట”. ఇక దాంతో చిరంజీవి బయటికి వెళ్లి వచ్చేసరికి నాగబాబు పడుకుని ఉన్నాడట..షాప్ నుంచి బట్టలు తీసుకొచ్చావా అంటే లేదు నేను పడుకున్నాను అని నాగబాబు చెప్పాడట. ఇక దాంతో చిరంజీవికి కోపం వచ్చి నాగబాబుని కొట్టాడట.
అంతలోకే వాళ్ళ అమ్మ వచ్చి చిన్నపిల్లడ్ని అంతలా కొడుతున్నావు అని అందట. దాంతో నాగబాబు ఏడుస్తూ ఉన్నాడట. ఇక వాళ్ళ అమ్మ వచ్చి అలా అనడంతో చిరంజీవి కి కూడా అనవసరంగా తమ్ముడిని కొట్టానని అనిపించిందట. ఇక దాంతో వాళ్ల నాన్న రాగానే చిరంజీవి ఏడుస్తూ ఆయనకి జరిగిందంతా చెప్పేసారంట. దాంతో వాళ్ళ నాన్న కూడా పర్లేదులే అని చిరంజీవిని ఓదార్చరట…ఇక మొత్తానికైతే ఒకసారి నాగబాబుని చిరంజీవి కొట్టాడట…ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకైనా నాగబాబు కి చిరంజీవి అంటే చాలా ఇష్టం…