Divya Deshmukh Final Chess: కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తరం తర్వాత ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరికింది.. నేనున్నానంటూ ఓ యువ సంచలనం తెర ముందుకు వచ్చింది. 64 గడుల ఆటలో అద్భుతం సృష్టించింది. ఎత్తులు.. పైఎత్తులు అద్భుతాన్ని ఆవిష్కరించింది.. తద్వారా భవిష్యత్తు కాలంలో భారత జట్టుకు అద్భుతమైన పేరు తెచ్చే అవకాశాన్ని భుజాల మీదికి ఎత్తుకుంది. 64 గడులు ఆటలో ఇప్పటివరకు అద్భుతాలు సృష్టించిన ఆమె.. ఫిడే వరల్డ్ కప్ తుది పోరుకు భారత సాధించింది. ఈ ఘనత అందుకున్న భారత తొలి మహిళ ప్లేయర్ గా దివ్య దేశ్ ముఖ్ రికార్డ్ సృష్టించింది.
దివ్య మహారాష్ట్రలోని నాగ్ పూర్ ప్రాంతాన్ని చెందిన జితేంద్ర, నమ్రత దంపతుల కుమార్తె. జితేంద్ర, నమ్రత ఇద్దరు కూడా వైద్యులు. అయితే తమలాగే కూతురిను కూడా వైద్యురాలి ని చేయాలని వారు భావించలేదు. ఆమె ఇష్టానికి వదిలేశారు. ఆమె అభిరుచికి తగ్గట్టుగానే నడుచుకోవాలని సూచించారు. తద్వారా ఆమె తనకు చదరంగం అంటే ఇష్టం అని చెప్పడంతో.. అందులో తర్ఫీదు ఇప్పించారు. తద్వారా 64 గడుల ఆటలో ఆమె ఆరి తేరింది. ఏడు సంవత్సరాల వయసులో 2012లో అండర్ -7 నేషనల్ ఛాంపియన్ షిప్ సొంతం చేసుకుంది. అదే ఉత్సాహంతో అండర్ 10, 12 టైటిల్స్ కూడా తన ఖాతాలో వేసుకుంది. 2021లో ఉమెన్ గ్రాండ్ మాస్టర్ గా అవతరించింది. 2023 లో ఇంటర్నేషనల్ మాస్టర్ గా ఎదిగింది.. 2024లో అండర్ -20 వరల్డ్ జూనియర్ గర్ల్స్ ఛాంపియన్ గా అవతరించింది.. ప్రస్తుతం ఫిడే వరల్డ్ కప్ ఫైనల్ చేరిన తొలి భారతీయ ప్లేయర్ గా రికార్డు సృష్టించింది. మనదేశంలో గ్రాండ్ మాస్టర్లుగా.. అంతర్జాతీయ ప్లేయర్లుగా వెలుగొందిన కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక వల్ల కాని రికార్డును దివ్య సృష్టించింది.
Also Read: గిల్ సేన 2021 చరిత్రను పునరావృతం చేస్తుందా?
ఫిడే వరల్డ్ కప్ టోర్నీ సెమీఫైనల్ లో చైనా ప్లేయర్ టాన్ ఝెంగీ ని 1-0 పాయింట్ల తేడాతో దివ్య ఓడించింది. టాన్ ఝెంగీ పదేపదే తప్పులు చేయడంతో.. దివ్యకు కలిసి వచ్చింది. మరోవైపు హంపి, లీ టింగ్జీ మధ్య జరిగిన రెండు గేమ్స్ డ్రా అయ్యాయి.. మరోవైపు నేడు జరిగే మ్యాచ్ ద్వారా రెండవ ఫైనలిస్ట్ ఎవరో తేలుతుంది.. ఫైనల్ మ్యాచ్లో దివ్య గనుక ఇదే కొనసాగిస్తే ఛాంపియన్ గా అవతరిస్తుంది. ఈ రికార్డు సాధించిన తొలి భారత మహిళా ప్లేయర్ గా ఘనత అందుకుంటుంది. అంతేకాదు తన ర్యాంకింగ్ పాయింట్స్ కూడా మెరుగుపరుచుకుంటుంది. ప్రస్తుతం దివ్య వయసు 20 సంవత్సరాలు మాత్రమే కావడం.. ఆమె ఇటువంటి ఘనతలను మరిన్ని సాధించే అవకాశం ఉంటుంది.