Homeక్రీడలుDinesh Karthik: మీ ఆత్రంల మన్నువడ .. కనీసం కాఫీ కూడా తాగనివ్వరరా బాబూ..RCB ఆటగాళ్లపై...

Dinesh Karthik: మీ ఆత్రంల మన్నువడ .. కనీసం కాఫీ కూడా తాగనివ్వరరా బాబూ..RCB ఆటగాళ్లపై దినేష్ కార్తీక్ ఫైర్

Dinesh Karthik: ఐపీఎల్ సీజన్లో మొన్నటిదాకా దారుణమైన ఆటతీరుతో పరువు పోగొట్టుకున్న బెంగళూరు.. క్రమంగా గాడిలో పడుతోంది. ప్లే ఆఫ్ ముందు హ్యాట్రిక్ విజయాలు అందుకొని.. పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలిచింది. శనివారం రాత్రి సొంతమైదానంలో గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో, నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. గుజరాత్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 19.3 ఓవర్లలోనే, 147 రన్స్ కు చాప చుట్టేసింది. ఈ లక్ష్యాన్ని 13.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి బెంగళూరు చేదించింది.

లక్ష్యం పెద్దది కాకపోయినప్పటికీ బెంగళూరు కెప్టెన్ డూ ప్లేసిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 23 బాల్స్ లో 64 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ 42 పరుగులు సాధించాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 92 పరుగులు జోడించారు. భారీ స్కోర్ చేసిన నేపథ్యంలో బెంగళూరు సులభంగానే గెలుస్తుందని అందరూ భావించారు. ఈ దశలో తనకు బ్యాటింగ్ చేసే అవకాశం తనకు కలగదని భావించి.. బెంగళూరు పంచ్ ఫినిషర్ దినేష్ కార్తీక్ నిశ్చింతగా ఉన్నాడు. వేడివేడి కాఫీ తాగుతూ చిల్ అవుతున్నాడు.

ఈ దశలోనే లిటిల్ బౌలింగ్ ధాటికి బెంగళూరు తడబడింది. 24 పరుగుల వ్యవధిలోనే కీలకమైన ఆరు వికెట్లు కోల్పోయింది. విల్ జాక్స్(1), రజత్ పాటిదార్(4), మ్యాక్స్ వెల్(4), గ్రీన్(1) వెంట వెంటనే అవుట్ కావడంతో కష్టాల్లో పడింది. దీంతో దినేష్ కార్తీక్ కు బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. అయితే ఆ సమయంలో తాను బ్యాటింగ్ చేసేందుకు మెంటల్ గా ఫిట్ గా లేనని డీకే చెప్పేశాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో బ్యాటింగ్ చేసేందుకు వచ్చాడు. దీంతో 12 బంతుల్లో మూడు ఫోర్లు కొట్టి 21 రన్స్ చేశాడు. అజయంగా నిలిచి బెంగళూరు జట్టును గెలిపించాడు.

మ్యాచ్ అనంతరం దినేష్ కార్తీక్ తన అనుభవాన్ని మాటల్లో వ్యక్తం చేశాడు..” బెంగళూరు బ్యాటింగ్ చూస్తున్నాను. విరాట్ కోహ్లీ, డూ ప్లేసెస్ అదిరిపోయేలాగా ఆడుతున్నారు. పవర్ ప్లే లో వీర కొట్టుడు కొట్టారు. నాకు ఎలాగూ బ్యాటింగ్ చేసే అవకాశం రాదని క్యాపచీనో తెచ్చుకొని తాగుతూ, చిల్ అవుతున్నాను. కనీసం ప్యాడ్లు కూడా కట్టుకోలేదు. బ్యాటింగ్ చేసేందుకు మానసికంగా సిద్ధంగా లేను. క్రికెట్లో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. వికెట్లు వెంట వెంటనే పోవడంతో నేను మెంటల్ గా ఫిట్ గా లేనప్పటికీ.. బ్యాటింగ్ చేశాను. మా వాళ్ళు నాకు కనీసం కాఫీ తాగే అవకాశం కూడా ఇవ్వలేదు. వెంట వెంటనే అవుట్ అయి ఆత్రాన్ని ప్రదర్శించారని” దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version