IND vs PAK : విరాట్ గెలిపించిన ఆ మ్యాచ్ లో ఆ ఆరింటిని పసిగట్టారా?

IND vs PAK  ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 మెన్స్ వరల్డ్ కప్ లో భారత జట్టు పాకిస్తాన్ పై చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. ఈ విజయానికి కారకుడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్ జరిగి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పట్లో ఈ విజయాన్ని అభిమానులు అంత ఈజీగా మర్చిపోరు. ఈ విజయం వల్ల భారత దేశంలో ఒకరోజు ముందుగానే దీపావళి వచ్చినట్టయింది. అయితే క్రీడాకారులనే కాదు, క్రీడాభిమానులను సైతం మునివేళ్ళ […]

Written By: Bhaskar, Updated On : October 25, 2022 10:49 pm
Follow us on

IND vs PAK  ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 మెన్స్ వరల్డ్ కప్ లో భారత జట్టు పాకిస్తాన్ పై చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. ఈ విజయానికి కారకుడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్ జరిగి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పట్లో ఈ విజయాన్ని అభిమానులు అంత ఈజీగా మర్చిపోరు. ఈ విజయం వల్ల భారత దేశంలో ఒకరోజు ముందుగానే దీపావళి వచ్చినట్టయింది. అయితే క్రీడాకారులనే కాదు, క్రీడాభిమానులను సైతం మునివేళ్ళ మీద నిలబెట్టిన ఈ మ్యాచ్లో 6 కీలకమైన టర్నింగ్ పాయింట్లు ఉన్నాయి. అవి ఏంటో ఒక లుక్ వేయండి.

అర్ష దీప్ చెలరేగిపోయాడు

టి20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ ఆడిన ఆర్ష దీప్ అద్భుతః అనిపించాడు. కొత్త బంతితో మెరుపులు మెరిపించాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ను గోల్డెన్ డక్ గా పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత టి20 వరల్డ్ నెంబర్వన్ బ్యాట్స్మెన్ మహమ్మద్ రిజ్వాన్ ను అద్భుతమైన బంతికి బోల్తా కొట్టించాడు. ఇక్కడి నుంచే టీం ఇండియాకు అద్భుతమైన ఆరంభం లభించింది. ఇక ఆర్ష దీప్ చివరి ఓవర్లో మరో వికెట్ పడగొట్టాడు. దీంతో నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి 32 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

బాల్ స్పైడర్ క్యామ్ కు తగిలింది

14 ఓవర్లు పూర్తి అయ్యేసరికి పాకిస్తాన్ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 98 పరుగులుగా ఉంది. ఆ దశలో మరో వికెట్ పడితే స్కోరు మరింత నెమ్మదించేది. ఈ దశలో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ షాన్ మసూద్ అదృష్టం కొద్ది బతికిపోయాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 15వ ఓవర్లో మసూద్ కొట్టిన ఓ బంతి గాలిలోకి లేచింది. క్యాచ్ దొరికేలా అనిపించింది. కానీ ఈ బంతి నేరుగా వెళ్లి స్పైడర్ క్యామ్ కు తగిలింది. దీంతో ఆ క్యాచ్ పట్టే అవకాశం చేజారి పోయింది. దీంతో దానిని డెడ్ బాల్ గా పరిగణించాల్సి వచ్చింది. 31 పరుగుల వద్ద బతికిపోయిన మసూద్ ఆ తర్వాత అర్థ సెంచరీ పూర్తి చేసి పాకిస్తాన్ 1509 పరుగులు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

పాత కోహ్లీ గుర్తొచ్చాడు

భారత్ విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు కావాలి. 19 ఓవర్ వేసేందుకు బంతి అందుకున్న పాకిస్తాన్ బౌలర్ హారీష్ రౌఫ్ భారత శిబిరంలో ఆందోళన రేకెత్తించాడు. మొదటి నాలుగు బంతుల్లో కేవలం మూడు సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. ఆ సమయంలో సమీకరణం 8 బంతుల్లో 28 పరుగులకు చేరుకుంది. ఇక మ్యాచ్ చేజారిపోయినట్టే అనిపించింది. కానీ క్రీజులో ఉన్న కోహ్లీ అదే ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మార్చడంతో ఆ ఓవర్ లో మొత్తం 15 పరుగులు వచ్చాయి. దీంతో మ్యాచ్ స్వరూపం ఒకసారి గా మారిపోయింది. లక్ష్య చేదనలో క్రీజు లో ఉన్నంత సేపు ధీమాగా ఉండొచ్చనేలా పాత కోహ్లీ గుర్తుకు వచ్చాడు.

హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు

టీం ఇండియా కూర్పులో పాండ్యా ఎంత కీలకమైన ఆటగాడో మరోసారి నిరూపితమైంది. బౌలింగ్లో రాణించి ఆకట్టుకున్న పాండ్యా.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ తోనూ అద్భుతం చేశాడు.. విరాట్ కోహ్లీతో కలిసి 100కు పైగా పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫలితంగా టీం ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి 31 పరుగుల దశ నుంచి అత్యద్భుతంగా పుంజుకుంది.

కోహ్లీ బౌల్డ్ అయ్యాడు.. కానీ

విజయానికి మూడు బంతుల్లో 13 పరుగులు అవసరమైన సమయంలో విరాట్ కోహ్లీ క్రీజు లో ఉన్నాడు. అప్పుడు మహమ్మద్ నవాజ్ వేసిన నో బాల్ ను కోహ్లీ సిక్సర్ గా మార్చడం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఈ సిక్సర్ పాకిస్తాన్ టీం ను నైరాశ్యంలో ముంచింది. టీం ఇండియా శిబిరంలో జోష్ నింపింది. అంతేకాకుండా ఫ్రీ హిట్ కూడా లభించింది. ఆ తర్వాత బంతికి పెద్ద షాట్ ఆడే ప్రయత్నం చేసిన విరాట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అని అది ఫ్రీ హిట్ కావడంతో బతికిపోయాడు. అంతేకాకుండా బంతి వికెట్లకు తగిలి థర్డ్ మేన్ దిశగా వెళ్లడంతో అదే బంతికి మూడు బై రన్స్ కూడా వచ్చాయి. ఈ పరిణామం మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా శాసించింది.

ఆ సింగిల్ లెవెల్ వేరు

రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరమైన దశలో దినేష్ కార్తీక్ స్టంప్ అవుట్ గా వెనుతిరిగాడు. దీంతో చివరి బంతికి రెండు అవసరమైనప్పుడు రవిచంద్రన్ క్రీజు లోకి అడుగుపెట్టాడు. ఎంతో ఒత్తిడిలోనూ లెగ్ సైడ్ వచ్చిన బాల్ ను తెలివిగా అశ్విన్ టచ్ చేయకుండా వదిలేశాడు. దీంతో ఆ బాల్ వైడ్ అయింది. అంపైర్ వైడ్ గా ప్రకటించడంతో ఇరుజట్ల స్కోర్లు సమం అయ్యాయి. చివరి బాల్ ను స్కూప్ చేసిన అశ్విన్ సింగిల్ తీసి ఇండియా కు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉన్నాయి. దీపావళి పండుగను ఈ మ్యాచ్ చూస్తూ ఆస్వాదించానని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించాడు అంటే ఎంతటి ఇంపాక్ట్ చూపిందో అర్థం చేసుకోవచ్చు.