Homeఎంటర్టైన్మెంట్MS Dhoni Movies: సినిమాల్లోకి ఎంఎస్ ధోని ఎంట్రీ.. ఫస్ట్ సినిమా ఏ చిత్ర పరిశ్రమలో...

MS Dhoni Movies: సినిమాల్లోకి ఎంఎస్ ధోని ఎంట్రీ.. ఫస్ట్ సినిమా ఏ చిత్ర పరిశ్రమలో అంటే?

MS Dhoni enters Tamil film industry : భారత జట్టుకు ప్రపంచ కప్ అందించిన సారధుల్లో కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని ఇద్దరే మనకు కనిపిస్తారు. ఇక ఏ కెప్టెన్ కూడా వరల్డ్ కప్ సాధించలేదు. దీంతో వారికి ఉన్న క్రేజ్ ఎలా ఉంటుందో అందరికి తెలుసు. మిస్టర్ కూల్ గా పేరు పొందిని ధోని ఆటతీరు గురించి మనకు సుపరిచితమే. సారధిగా జట్టుకు ఎంతో సేవ చేశాడు. ఆయనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాడు. మేటి కెప్టెన్ గా నీరాజనాలు అందుకున్నాడు.

దాదాపు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అయిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోని కొత్త మార్గంలోకి వెళ్లనున్నాడు. క్రికెట్ కు విరామం ప్రకటించడంతో వ్యక్తిగత వ్యాపారాలు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే జార్ఖండ్ లో కూరగాయలు, పాలు తదితర వ్యాపారాలు చేపట్టాడు. ఇంకా కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇతర మెరుగైన వ్యాపారాల వైపు చూస్తున్నాడు.

మహేంద్ర సింగ్ ధోని కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నాడు. ఇక మీదట సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా సినిమాలు నిర్మించడానికి నిర్ణయించుకున్నాడు. త్వరలోనే ధోని ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలు సిద్ధం చేశాడట.. సినిమా రంగంలో కూడా తనదైన ముద్ర వేయాలని ధోని ఆలోచిస్తున్నాడు.

తనను ఐపీఎల్ లో ఆదరించి అక్కున చేర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ సొంత రాష్ట్రం తమిళనాడునే ధోని తన సినిమా అడుగులకు వేదికగా చేసుకోవడం విశేషం. మహేంద్ర సింగ్ ధోని -అతని భార్య సాక్షి ప్రొడక్షన్ హౌస్ తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది. “తమిళనాడు ప్రజలతో ధోని పంచుకున్న అసాధారణ బంధం.. ఈ బంధాన్ని మరింత పటిష్టం చేస్తూ, ధోని ఎంటర్‌టైన్‌మెంట్ తమిళంలో తన మొదటి చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తుంది” అని వారు ఒక ప్రకటనలో తెలిపారు.. . ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ సాక్షి దీనిని రూపొందించనున్నారు. ఐపీఎల్ లో లైఫ్ ఇచ్చిన తమిళులతోనే తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ధోని రెడీ కావడం విశేషం.
Director Meher Ramesh About Movie With Powerstar Pawan kalyan | Chiranjeevi | Oktelugu Entertainment
పవన్ కల్యాణ్ ఇద్దరు వారసులు ఒక్క చోటికి. | Pawan Diwali Kalyan Celebration With His Second Sons
జపాన్ లోని తన అతి పెద్ద అభిమానిని కలిసిన రాంచరణ్! |See How Japan Fans Staring At Ram Charan In Japan

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version