David Warner Sun Risers: డేవిడ్ వార్నర్.. పడిలేచిన కెరటం లాంటి ఈ క్రికెటర్ ను సరిగ్గా వాడుకుంటే కప్ లను అందిస్తాడు. ఈ విషయంలో సన్ రైజర్స్ విఫలమైంది.. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విజయవంతమైంది. ఐపీఎల్ లో వరుసగా డక్ ఔట్ అయిన డేవిడ్ వార్నర్ ను సన్ రైజర్స్ యాజమాన్యం వదిలించుకుంది. కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాదు.. కనీసం మాట మాత్రం అయినా చెప్పకుండా జట్టులోంచే తొలగించింది. యూఏఈలో జరిగిన రెండో అంచె పోటీల్లో ఈ దారుణం జరిగింది.
Also Read: టీమిండియా కొత్త కెప్టెన్ పై కోటి ఆశలు.. నెరవేరుస్తాడా?
ఇదే డేవిడ్ వార్నర్ 2016లో కెప్టెన్ గా సన్ రైజర్స్ కు కప్ అందించాడు. ఆ తర్వాత సెమీఫైనల్స్ వరకూ చేర్చాడు. ఒంటిచేత్తో సన్ రైజర్స్ ను నిలబెట్టాడు. కానీ సన్ రైజర్స్ కోసం ఎంతో చేసిన వార్నర్ పోయిన సీజన్ లో ఆ యాజమాన్యం అవమానించింది. అంత పెద్ద ఆటగాడిని తొలగించేసింది.
కానీ ఇదే వార్నర్ ప్రపంచకప్ టీ20లోనూ వార్మప్ మ్యాచ్ లో విఫలమయ్యాడు. ఒకటి రెండూ పరుగులకే ఔట్ అయ్యాడు. కానీ ఈ దిగ్గజ ఆటగాడిని ఆస్ట్రేలియా టీం వదిలిపెట్టలేదు. అవకాశాలిచ్చింది. అతడే ఇప్పుడు ఆస్ట్రేలియాకు కప్ అందించాడు. మొదటి మ్యాచ్ నుంచి గేర్ మార్చిన డేవిడ్ వార్నర్ వరుసగా ఆఫ్ సెంచరీలు కొట్టి టీంను ఫైనల్ చేర్చాడు. పాకిస్తాన్ తో సెమీస్ లోనూ దంచికొట్టాడు. టీ20 ప్రపంచకప్ లో ఏకంగా 289 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఫైనల్లో న్యూజిలాండ్ పై కీలక ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియాను టీ20 కప్ విజేతగా నిలిపాడు.
ఇలా సన్ రైజర్స్ తొలగించి అవమానించిన వార్నర్ ను.. అతడి ప్రతిభను గుర్తించి ఆస్ట్రేలియా టీం అక్కున చేర్చుకుంది. అవకాశాలిచ్చింది. అతడే ఒంటిచేత్తో ఆస్ట్రేలియాకు కప్ నందించాడు. విశ్వవిజేతగా నిలిపాడు. ఆస్ట్రేలియాను గెలిపించిన అనంతరం వార్నర్ ఎమోషనల్ అయ్యాడు. సన్ రైజర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏ కారణం లేకుండా జట్టు నుంచి తప్పించడం.. కెప్టెన్సీ నుంచి తొలగించడం లాంటివి బాధిస్తాయని ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ వాపోయాడు. కొన్నేళ్ల పాటు అమితంగా ఇష్టపడిన సన్ రైజర్స్ జట్టు ఉన్నట్టుండి ఏ తప్పు లేకుండా ఏ కారణం లేకుండా నన్ను తొలగించడం.. కెప్టెన్సీ నుంచి తప్పించడం చూస్తే చాలా బాధగా ఉంది. ఈ విషయంపై నేనెలాంటి ఫిర్యాదులు చేయాలనుకోవడం లేదు. నన్ను తొలగించడానికి కారణం ఏదైనా నేను 100శాతం ఫ్రాంచైజీ కోసం కష్టపడ్డా..ప్రాక్టీస్ చేశా.. కానీ సమయానికి పరుగులు చేయలేకపోయా.. అలాంటప్పుడు నన్ను తీసేయడం బాధ కలిగించింది. నాకింకా ఐపీఎల్ ఆడేందుకు మరో అవకాశం ఉందని నమ్ముతున్నా అని వార్నర్ ఎమోషనల్ అయ్యాడు. ఇప్పటికైనా వార్నర్ విషయంలో చేసిన తప్పును సన్ రైజర్స్ హైదరాబాద్ దిద్దుకుంటే మంచిదని పలువురు క్రీడాభిమానులు హితవు పలుకుతున్నారు.
Also Read: మెగాస్టార్ “ఆచార్య” సినిమా నుంచి మరో అప్డేట్… ఫుల్ ఖుషీలో అభిమానులు
Also Read: భారత్ -పాక్ యుద్ధం..: 1971 డిసెంబర్ నెలలో ఏం జరిగింది..?