https://oktelugu.com/

Acharya Movie: మెగాస్టార్ “ఆచార్య” సినిమా నుంచి మరో అప్డేట్… ఫుల్ ఖుషీలో అభిమానులు

Acharya Movie: మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం “ఆచార్య”. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తుండ‌టంతో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. అలానే ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్… చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‏టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మణిశర్మ మరోసారి తన  మ్యూజిక్ తో అందరినీ మ్యాజిక్ చేయనున్నారు. ఇక […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 23, 2021 / 07:56 PM IST
    Follow us on

    Acharya Movie: మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం “ఆచార్య”. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తుండ‌టంతో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. అలానే ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్… చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‏టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మణిశర్మ మరోసారి తన  మ్యూజిక్ తో అందరినీ మ్యాజిక్ చేయనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా త్వరలోనే విడుదలకు సిద్దం అయ్యింది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ నుంచి అభిమానులకు మరో అప్డేట్ ను ప్రకటించింది.

    ఆచార్య సినిమాకు సంబంధించి రేపు ఉదయం 10:08 గంటలకు అదిరిపోయే అప్డేట్ విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో సిద్ద పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ కు సంబంధించి అప్డేట్ ఇవ్వనున్నట్లు క్లూ కూడా ఇచ్చింది. దీంతో రామ్ చరణ్ టీజర్ ను విడుదల చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్,  పోస్టర్ల కు ప్రేక్షకుల నుంచి  భారీ స్పందన లభించింది. ఈ అనౌన్స్ మెంట్ తో మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొంది. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 న ఆచార్య చిత్రం విడుదల కానుంది. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే  మలయాళం మూవీ ” లూసిఫర్ ” రీమేక్ గా తెరకెక్కుతున్న ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్ జరుపుకుంటుంది. వీటితో పాటు మెహర్‌ రమేశ్ డైరెక్షన్ లో ” భోళా శంకర్ ”, బాబీతో మరో సినిమా చేయనున్నారు.

    https://twitter.com/KonidelaPro/status/1463138882405289990?s=20