MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని దర్శక ధీరుడు రాజమౌళి ‘కర్మయోగి’ అని కీర్తించాడు. అంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నిబ్బరంగా ఉండగల గొప్ప మనిషి అని కొనియాడారు. వరల్డ్ కప్ లో లాస్ట్ సిక్స్ కొట్టి కప్ కొట్టాక కూడా ధోనిలో ఏ ఏమోషన్ లేకుండా ఉండడాన్ని రాజమౌళి ఉదహరించారు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా వాటిని తట్టుకొని నిలబడడం ధోనిలో ఉన్న గొప్ప క్వాలిటీ.
వయసు పైబడినా.. ఒత్తిడి చిత్తు చేస్తున్నా ధోని ఉంటే చాలు ఆ మ్యాచ్ గెలిచినట్టేనని ఎన్నో సార్లు నిరూపితమైంది. తాజాగా ముంబైతో మ్యాచ్ లోనూ ఓటమి అంచులో ఉన్న చెన్నైని గెలిపించి మరోసారి బెస్ట్ ఫినిషర్ అని ధోని నిరూపించుకున్నాడు.
ముంబైతో మ్యాచ్ లో చివరి ఓవర్ లో 17 పరుగులు అవసరమైన వేళ మరోసారి తనలోని అత్యుత్తమ ఫినిషర్ ను బయటకు తీశాడు. చివరి బంతికి బౌండరీ బాది చెన్నైని గెలిపించాడు. ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ప్రపంచ క్రికెట్ లో ధోని అత్యుత్తమ ఫినిషర్ గా ఉన్నాడు.
ఈ మ్యాచ్ కు ముందు ప్రపంచ క్రికెట్ లో ధోని ఆఖరి ఓవర్లలో 28 సార్లు బ్యాటింగ్ చేసి మొత్తం 250 పరుగులు చేశాడు. అందులో 35.71 సగటు, 287.35 స్టైక్ రేట్ తో ఏకంగా 23 సిక్సర్లు బాదడం విశేషం.
ఇక ఐపీఎల్ లో చూస్తే 20వ ఓవర్ లో 643 పరుగులు చేశాడు. ఇది అందరు ఆటగాళ్ల కంటే ఎక్కువ. ఇందులో 51 సిక్స్ లు, 48 ఫోర్లు ఉన్నాయి. ఏకంగా 261 బంతుల్లో 246.36 స్ట్రైక్ రేట్ తో దంచికొట్టాడు. ఈ గణాంకాలే ధోనిని ప్రపంచంలోనే నంబర్ 1 ఫినిషర్ గా చేశాయి.
Also Read: TRS Politics : బీజేపీతో ఫైట్.. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్ కు పనిచేస్తుందా?
ముంబైపై మ్యాచ్ గెలిపించాక ధోనిపై పలువురు క్రికెట్ ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడు ఆల్ టైం గ్రేటెస్ట్ బ్యాట్స్ మెన్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ధోని పేరు మారుమోగుతూ ట్రెండింగ్ లో ఉంది.
https://twitter.com/IPL/status/1517221530358665216?s=20&t=m0b8QbtusD4n3ZIpeOENUA
Recommended Videos: