Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu OTT: కెప్టెన్సీ పోటీ దారుల‌కు ఏలియన్స్ టాస్క్‌.. ఆ ఇద్ద‌రిలో ఒక‌రు...

Bigg Boss Telugu OTT: కెప్టెన్సీ పోటీ దారుల‌కు ఏలియన్స్ టాస్క్‌.. ఆ ఇద్ద‌రిలో ఒక‌రు కెప్టెన్ అయ్యే ఛాన్స్‌..?

Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్ ఓటీటీ వెర్షన్ ప్రేక్షకులకు మంచి మజాను అందిస్తోంది. ఈ సీజన్‌లో అఖిల్ బ్యాచ్, బిందు బ్యాచ్ మధ్య ఫైట్ ఆసక్తికరంగా నడుస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్ పోటీదారుల కోసం హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్ టాస్క్ నడుస్తోంది. హ్యూమన్స్ గ్రూప్‌లో అఖిల్, అనిల్, యాంకర్ శివ, మిత్రా శర్మ, అషూరెడ్డి ఉన్నారు. ఏలియన్స్ గ్రూప్‌లో అరియానా, బిందు మాధవి, నటరాజ్ మాస్టర్, అజయ్, హమీదా ఉన్నారు. బాబా భాస్కర్ సంచాలకుడిగా వ్యవహరించారు.

Bigg Boss Telugu OTT
Bigg Boss Telugu OTT

ఈ టాస్క్‌లో భాగంగా ఏలియన్స్ వాళ్ల దగ్గర ఉన్న వస్తువులను కాపాడుకుంటూ ఉంటారు. అయితే హ్యూమన్స్ టీమ్ వచ్చి ఏలియన్స్ టీమ్‌ దగ్గర వస్తువులను పగులకొట్టి ఆ టీమ్‌లో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తుంటారు. ఈ టాస్క్ సందర్భంగా ఇరు టీమ్‌ కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. మిత్రా శర్మ, హమీదా అయితే కొట్టుకున్నంత పని చేశారు. మిత్ర కొడుతుందని.. తాను కూడా కొడతానంటూ ఆమె వెనకాల హమీదా పరిగెత్తింది.

Also Read: Badri:పవన్ కళ్యాణ్ ‘బద్రి’ సినిమాను రిజెక్ట్ చేసిన ఈ స్టార్ హీరో!

Bigg Boss Telugu OTT
Bigg Boss Telugu OTT

ఈ టాస్క్‌లో బిందు మాధవి, అరియానా, హమీదా మిత్రాశర్మాను టార్గెట్ చేశారు. దీంతో మిత్రా శర్మ కూడా వాళ్లపై ఫైర్ అయ్యింది. సిగ్గు లేదా అని మాట్లాడటంతో ఆమెకు హమీదా, బిందు క్లాస్ పీకారు. చివరకు హ్యూమన్స్ అందరూ స్మిమ్మింగ్ పూల్‌లో దిగితే బిగ్ బాస్ వారిని హెచ్చరించాడు. గేమ్‌ను స్విమ్మింగ్ ఫూల్‌లో దిగి ఆడకూడదని వార్నింగ్ ఇచ్చాడు. మొత్తానికి తీవ్ర ఉత్కంఠ నడుమ ఈ టాస్కులో హ్యూమన్స్ టీమ్ సభ్యులు గెలిచారు.

Bigg Boss Telugu OTT
Bigg Boss Telugu OTT

హ్యూమన్స్ టీమ్ గెలవడంతో కెప్టెన్సీ పోటీదారులుగా అఖిల్, అనిల్, మిత్రా శర్మ, యాంకర్ శివ, బాబా భాస్కర్ ఎంపికయ్యారు. మరి వీళ్లలో కెప్టెన్ ఎవరు అవుతారో చూడాలి. గతంలో అనిల్, అఖిల్, యాంకర్ శివ కెప్టెన్‌లుగా వ్యవహరించారు. మిత్రా శర్మ, బాబాభాస్కర్‌కు అవకాశం ఇస్తే హౌస్‌లో కొత్త వ్యక్తి కెప్టెన్ అవుతారు. మరి ఇంటి సభ్యుల సహకారంతో ఏదైనా టాస్క్ పెడితే మాత్రం శివ, అఖిల్ ఇద్దరిలో ఒకరు కెప్టెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Also Read:Samantha: సెకండ్ మ్యారేజ్‌పై స‌మంత షాకింగ్ కామెంట్స్‌..!

Recommended Videos:

Actress Kajal Aggarwal Son Name || Gautam Kitchlu Announced Baby Boy Name || Oktelugu Entertainment

Balayya Heroine Sonal Chauhan seen at Mumbai Airport Arrivals || Oktelugu Entertainment

Ram Charan Shares A Funny Fight Between His Mother and Grand Mother || Oktelugu Entertainment

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version