Sourav Ganguly- Dhoni: బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి గంగూలీని తప్పించారు. దీంతో గంగూలీ నిష్క్రమణ వెనుక పెద్ద బాగోతమే నడిచినట్లు వార్తలు వస్తున్నాయి. భారత జట్టు మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని హస్తం ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంగూలీ బీసీసీఐ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడంలో ధోని ప్రముఖ పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. గంగూలీ తీరు వల్లే కూడా ఆయనపై విమర్శలు వచ్చినట్లు జట్టు సభ్యులే ప్రకటించారు. దీంతో బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీని తొలగించి ఆయన స్థానంలో రోజర్ బిన్నీని నియమించింది. గంగూలీ ఒంటెత్తు పోకడలతోనే ఆయనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ ప్రోద్బలంతోనే ధోని గంగూలీకి చెక్ పెట్టారనే వాదనలు వస్తున్నాయి. బీసీసీఐ సమావేశంలో శ్రీనివాసన్ గట్టిగా వాదించినట్లు చెబుతున్నారు. దీంతో గంగూలీ ఆశలపై నీళ్లు చల్లారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ వ్యవహరించిన తీరుపై పలుమార్లు విమర్శలు రావడంతో ఆయనను కొనసాగించేందుకు బీసీసీఐ ఇష్టపడలేదు. ధోనీ సూచనలతోనే సీఎస్ కే బాస్ గంగూలీని తప్పించేందుకు తన వంతు కృషి చేశారు.

గంగూలీ విషయంలో మహేంద్ర సింగ్ ధోనికి ఎందుకంత ఆగ్రహం ఉందో తెలియడం లేదు. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక గంగూలీ ధోనిని సారథ్య బాధ్యతల నుంచి తొలగించారు. దీంతో అప్పటి నుంచే ధోనికి గంగూలీపై ఆగ్రహం పెరిగింది. ఈ క్రమంలో గంగూలీకి సరైన సమయంలో టాటా చెప్పించాలని సమయం కోసం వేచి చూశాడు. శ్రీనివాసన్ రూపంలో ధోనికి దొరికిన ఆయుధంతో గంగూలీ ప్రస్థానాన్ని అడ్డుకున్నాడని పలువురు చెబుతున్నారు. మూడు టైటిళ్లు తీసుకొచ్చిన ధోనికి కనీసం వీడ్కోలు మ్యాచ్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో ధోనికి గంగూలీపై కోపం పెరిగినట్లు సమాచారం.