Dhoni And Kohli: ఐపీఎల్–2024 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ధనాధన్ టోర్నీ మొదలై అప్పుడే వారం దాటింది. ఇక రోజు రోజుకూ టోర్నీలో ఉత్కంఠ పెరిగే మ్యాచ్‌లు జరుగుతున్నాయి. క్రికెట్ అభిమానులకు వినోదం పంచుతున్నాయి. ఇక టోర్నీ మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళలూరు మధ్య మార్చి 22న జరిగింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది.
వ్యూస్‌లో రికార్డు..
ఇక తొలి మ్యాచ్‌తోనే ఐపీఎల్ 18 సీజన్ వ్యూస్‌లో రికార్డు సృష్టించింది. ఐపీఎల్ అధికారిక స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హార్ట్‌స్టార్ తెలిపిన వివరాల ప్రకారం తొలి మ్యాచ్‌ను 16.8 కోట్ల మంది వీక్షించారు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రికార్డు. మొదటి రోజు స్ట్రీమింగ్ టైం 1276 కోట్ల నిమిషాలు. ఐపీఎల్ – 17 సీజన్ తొలి మ్యాచ్‌ను కూడా డిస్నీ ప్లస్ హార్ట్‌స్టార్ ప్రసారం చేసింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను 6.1 కోట్ల మంది వీక్షించారు. ఇది కూడా రికార్డే. గతేడాది ప్రారంభ మ్యాచ్‌ను 870 కోట్ల నిమిషాలు వీక్షించారు. గతేడాదితో పోలిస్తే టీవీ వ్యూస్‌లో 16 శాతం పెరిగింది.
51 శాతం పెరిగిన వీక్షకులు..
ఇక లైవ్ స్ట్రీమింగ్ హక్కు పొందిన జియో సినిమా యాప్‌లో తొలిరోజు 11.3 కోట్ల మంది వీక్షించారు. ఇది కూడా ఓ రికార్డు. త ఎడిషన్‌తో పోలిస్తే ఈ మ్యాచ్‌కి తొలి రోజు వీక్షకులు 51 శాతం పెరిగారు. జియో సినిమా కూడా మొదటి రోజు 660 కోట్ల నిమిషాల స్ట్రీమింగ్ అయింది. ఇక టోర్నీ 8వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, స¯Œ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో రికార్డు స్కోర్ నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌ను కూడా రికార్డుస్థాయిలో వీక్షించారు. దీంతో ఐపీఎల్‌కు మంచి ఆదరణ కూడా వచ్చింది.