Anshu Mann Gaikwad : అన్షు మన్ గైక్వాడ్ .. టీమిండియా క్రికెట్ దిగ్గజాల లో ఒకరు.. భారత జట్టు తరఫున 1974 -87 మధ్య ఆడారు. 40 టెస్టులలో, 15 వన్డేలలో ప్రాతినిధ్యం వహించారు. మొత్తంగా 2, 254 రన్స్ చేశారు. ఇందులో ఏకంగా రెండు సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా 1983లో పంజాబ్ రాష్ట్రం జలంధర్లో జరిగిన ఒక మ్యాచ్ లో పాకిస్తాన్ చెట్టుపై 201 చేశారు.. టీమిండియా కు హెడ్ కోచ్ గా రెండుసార్లు పనిచేశారు. 1997 -99 మధ్యకాలంలో కోచ్ గా వ్యవహరించారు. టీమిండియా 2000 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్ గా నిలిచింది. ఆ సమయంలో అన్షు మన్ గైక్వాడ్ కోచ్ గా ఉన్నారు. అంతేకాదు 1990 లో కాలంలో జాతీయ సెలక్టర్ గా, ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా పని చేశారు. ఇంతటి ఘనతలు ఉన్న అన్షు మన్ గైక్వాడ్(71) బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ కన్నుమూశారు. దీంతో యావత్ క్రికెట్ ప్రపంచం శోకసముద్రంలో మునిగిపోయింది. అన్షు మన్ గైక్వాడ్ మరణం వెనుక గుండెను మెలిపెట్టే విషాదం చోటుచేసుకుంది..
బ్లడ్ క్యాన్సర్ తో..
అన్షు మన్ గైక్వాడ్ కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. చికిత్స కోసం కుటుంబ సభ్యులు చాలా ఆసుపత్రులు తిరిగారు. వైద్యం కోసం భారీగానే ఖర్చుపెట్టారు. అయినప్పటికీ ఉపయోగాలు లేకుండా పోయింది. ఒకానొక దశలో ఆయన వైద్యం కోసం ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు కావడంతో.. మందులు కూడా కొనే పరిస్థితి లేదు. దీంతో ఈ విషయం కపిల్ దేవ్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన అన్షు మన్ గైక్వాడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.. ఇంట్లో బెడ్ పై ఉన్న అన్షు మన్ గైక్వాడ్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన అప్పటికే చికిత్స పొంది.. అచేతనంగా ఉన్నారు. దీంతో కపిల్ దేవ్ అన్షు మన్ గైక్వాడ్ పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐకి కపిల్ విన్నవించారు. ” భారత క్రికెట్ కు ఎనలేని సేవలు చేసిన అన్షు మన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఆయన ఇంట్లో బెడ్ పై అచేతనంగా పడి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను ఆదుకోవాల్సిన బాధ్యత బిసిసిఐపై ఉంది.. ఆయన చికిత్స కోసం ఆర్థికంగా ఉదాహరణ చూపించాలని” కోరారు.
ప్రముఖుల సంతాపం
కపిల్ దేవ్ తో పాటు మరికొందరు మాజీ క్రికెటర్లు కూడా అన్షు మన్ గైక్వాడ్ ను పరామర్శించారు. వారు కూడా చికిత్సకు సహకరించాలని బిసిసిఐ ని కోరారు. స్పందించిన బీసీసీఐ బాధ్యులు అన్షు మన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు కోటి రూపాయలు విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇంతలోనే అన్షు మన్ గైక్వాడ్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. అన్షు మన్ గైక్వాడ్ మృతి భారత క్రికెట్ కు తీరని లోటని పేర్కొన్నారు. క్రికెట్ కోసం ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యమని కొనియాడారు. 71 ఏళ్ల వయసులో బ్లడ్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతూ అన్షు మన్ గైక్వాడ్ కన్నుమూయడం బాధాకరమన్నారు. మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, బిసిసిఐ సెక్రెటరీ జైషా వంటి వారు అన్షు మన్ గైక్వాడ్ గతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.. వారి కుటుంబానికి బిసిసిఐ అండగా ఉంటుందని సెక్రెటరీ జై షా హామీ ఇచ్చారు.. గురువారం స్వగ్రామంలో అన్షు మన్ గైక్వాడ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్లు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Despite kapil devs initiative the death of former indian cricketer anshu mann gaikwad was not saved
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com