బీహార్ ఎన్నికలు: అభ్యర్థుల బయోడేటా తెలిస్తే షాకే

బీహార్‌‌లో క్రైం, రాజకీయాలు ఒక్కటయ్యాయేమో. ఎలక్ట్రోరల్‌ సిస్టమ్‌ను క్లీన్‌గా ఉంచాలని.. వారు ఎన్నికల్లో పోటీచేయొద్దని సుప్రీం కోర్టు తీర్పునిస్తే.. దానిని చాలా మంది బిహార్‌‌ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తమ భార్యిపిల్లలు, లేదా కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకొని రాజకీయ చేస్తున్నారు. క్రిమినల్స్‌, రౌడీ షీటర్లు, గ్యాంగ్‌ స్టర్లు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఒక్క పార్టీ అని కాదు.. ఏ పార్టీలో చూసినా ఇదే పరిస్థితి ఉంది. Also Read: మోడీపై కాంగ్రెస్‌.. […]

Written By: NARESH, Updated On : October 10, 2020 4:36 pm
Follow us on

బీహార్‌‌లో క్రైం, రాజకీయాలు ఒక్కటయ్యాయేమో. ఎలక్ట్రోరల్‌ సిస్టమ్‌ను క్లీన్‌గా ఉంచాలని.. వారు ఎన్నికల్లో పోటీచేయొద్దని సుప్రీం కోర్టు తీర్పునిస్తే.. దానిని చాలా మంది బిహార్‌‌ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తమ భార్యిపిల్లలు, లేదా కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకొని రాజకీయ చేస్తున్నారు. క్రిమినల్స్‌, రౌడీ షీటర్లు, గ్యాంగ్‌ స్టర్లు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఒక్క పార్టీ అని కాదు.. ఏ పార్టీలో చూసినా ఇదే పరిస్థితి ఉంది.

Also Read: మోడీపై కాంగ్రెస్‌.. పెద్ద ప్లాన్లు రెడీ

బీహార్‌‌ ఎన్నికల్లో క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న లోకల్‌ లీడర్లదే రాజ్యం. పార్టీ కేడర్‌‌, బాహుబలులుగా పిలుచుకునే వీరంతా ఈసారి ఎన్నికల్లో తమ ప్రభావం చూపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తాము నేరుగా బరిలోకి దిగకుండా తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపుతున్నారు. పార్టీల టికెట్ల లిస్టును చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతోంది.

రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) ఫస్ట్‌ లిస్టులో 20 మంది అభ్యర్థులు ఇలాంటి వారికే టికెట్లు ఇచ్చింది. ఇక జనతా దళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) కూడా 40 మందికి టికెట్లు ఇచ్చింది. క్రిమినల్‌ రికార్డు ఉండి రాజకీయ నాయకులుగా చక్రం తిప్పేందుకు రెడీ అయిపోయారు. వీరు నేరుగా పోటీ చేయకపోయినా.. అభ్యర్థుల భవిష్యత్‌ను మార్చేది వీరే.

ఎలక్షన్లు సజావుగా జరిపేందుకు ఎన్నికల కమిషన్‌ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక రూపంలో మనీ, మ్యాన్‌పవర్‌‌ ప్రభావం చూపిస్తూనే ఉంది. ఎన్నికల్లో గెలుపే ప్రధానం కావడంతో దానికి చాలా మంది నాయకులు ఏమైనా వెనకాడడం లేదు. ఇక రాజకీయ పార్టీలు కూడా డబ్బు, కండ బలం ఉన్న వారికే టికెట్లు కేటాయిస్తున్నాయి. క్రిమినల్‌ రికార్డు ఉన్న వారికి సీట్లు ఇచ్చే విషయంలో ఆర్జేడీ ముందు వరుసలో ఉంది. జేడీయూ ఈ విషయంలో కాస్త మెరుగ్గానే కనిపిస్తోంది. కానీ.. ఈ రెండు పార్టీలలోనూ టికెట్లు ఇచ్చిన వారిలో మర్డర్‌‌, కిడ్నాప్‌, దోపిడీలకు పాల్పడిన వారూ ఉన్నారు. అలాగే.. పార్టీ వెటరన్‌ నాయకుల పిల్లలకు కూడా సీట్లు కేటాయించింది.

రెండేళ్ల కిందట ఓ మైనర్‌‌పై అత్యాచారానికి పాల్పడినట్లు రాజ్‌ వల్లభ్‌ యాదవ్‌ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అతని విభా దేవికి నవాడా అసెంబ్లీ టికెట్‌ కేటాయించింది ఆర్జేడీ. 2019 ఎన్నికల్లోనూ పోటీ చేసిన ఆమె ఓడిపోయింది. రేప్‌, మర్డర్‌‌ కేసులో దోషిగా తేలడంతో రాజ్‌ వల్లభ్‌ యాదవ్‌ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయింది. మైనర్‌‌ బాలిక కిడ్నాప్‌, రేప్‌ కేసులో పరారీలో ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే అరుణ్‌కుమార్‌‌ యాదవ్‌ భార్య కిరణ్‌ దేవికి భోజ్‌పూర్‌‌ జిల్లాలోని సందేశ్‌ అసెంబ్లీ సీటు ఆర్జేడీ కేటాయించింది. ఓ యువకుడిని చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బింది యాదవ్‌ భార్య మనోరమా దేవికి గయ జిల్లాలోని అత్రి సీటును ఇచ్చింది. అలాగే.. మాజీ ఎంపీ రామాసింగ్ భార్యకు వైశాలి జిల్లా మహనార్‌‌ అసెంబ్లీ సీటును అలాట్‌ చేసింది. రామాసింగ్‌పై కిడ్నాప్‌, హత్య కేసులు ఉన్నాయి. దన్‌పూర్‌‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌‌ రితిలాల్‌ యాదవ్‌ కౌన్సిల్‌కు ఇండిపెండెంట్‌కు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. అలాగే.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మగధ డివిజన్‌లో మగధ సామ్రాట్‌గా పేరున్న సురేందర్‌‌ యాదవ్‌ జహనాబాద్‌ నుంచి బరిలో నిలబడ్డారు. 1994 నాటి గోపాల్‌గంజ్‌ డీఎం మర్డర్‌‌ కేసులో జైలులో ఉన్న మాజీ ఎంపీ ఆనంద్‌ మోహన్‌ వైఫ్‌ లవ్లీ ఆనంద్‌కు ఆర్జేడీ షియోహర్‌‌ టికెట్‌ ఇచ్చింది.

Also Read: చక్రవడ్డీ మినహాయింపు తప్ప మేమేమీ చేయలేమంటున్న కేంద్రం

మరోవైపు జేడీఏ కూడా పార్టీ సీనియర్‌‌ లీడర్లకు టికెట్లు కేటాయించింది. మాజీ మంత్రి, ఆర్జేడీ స్టేట్‌ చీఫ్‌ జగదానంద్ సింగ్‌ కుమారుడు సుధాకర్‌‌సింగ్‌.. తన తండ్రి సీటైన రామ్‌గడ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ వెటరన్‌ లీడర్‌‌ వివానంద్‌ తివారీ కొడుకు సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాహుల్‌ సింగ్‌ షాపూర్‌‌ నుంచి బరిలో నిలుస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి కాంతిసింగ్‌ కొడుకు రిషి సింగ్‌ ఓబ్రా సీటు నుంచి, మరో మాజీ మంత్రి జయప్రకాశ్‌ నారాయణ్ యాదవ్‌ కుమార్తె దివ్యకీర్త తారాపూర్‌‌ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. బీహార్‌‌లో రూలింగ్‌ పార్టీ అయిన జేడీయూ కూడా వారసులకు పెద్ద సంఖ్యలోనే టికెట్లు ఇచ్చింది. మొత్తంగా చూస్తే.. ఈసారి బిహార్‌‌ ఎన్నికలను అటు క్రిమినల్‌ రికార్డు ఉన్న వారు.. ఇటు మాజీ నేతల వారసులే ఏలనున్నట్లు అర్థమవుతోంది. చివరకు ప్రజలు ఎవరికి పట్టం కడుతారో ఆసక్తిగానూ ఉంది.