WPL 2025: ముంబై జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మూడోసారి ఫైనల్ వెళ్లినప్పటికీ ఢిల్లీ జట్టుకు విజయం సాధ్యం కాలేదు. వరుసగా మూడోసారి ఫైనల్ వెళ్లినప్పటికీ.. ఓటమి పాలు కావడంతో ఢిల్లీ జట్టు ప్లేయర్ కాప్ వెక్కి వెక్కి ఏడ్చింది. స్టేడియంలోనే ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సమయంలో తోటి ప్లేయర్లు ఆమెను ఓదాచారు..కాప్ మాత్రమే కాకుండా కెప్టెన్ మెక్ లానింగ్ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఎందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ దర్శనమిస్తున్నాయి. ఈ వీడియోలను చూసిన అభిమానులు ఢిల్లీ జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఓటమి అనేది తాత్కాలికమని.. విజయం అనేది శాశ్వతమని ఓదార్పు మాటలు చెబుతున్నారు. మీరు ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ.. మా మనసులను గెలిచారని.. వాటిల్లో మీకు శాశ్వతమైన స్థానం ఉంటుందని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది.. ముంబై రెండోసారి విజేతగా నిలిచింది.. ప్చ్ ఢిల్లీకి మళ్ళీ నిరాశ..
ఉత్కంఠ గా సాగిన ఫైనల్ మ్యాచ్లో ముందుగా ముంబై జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు లాస్ అయ్యి 149 రన్స్ చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును హర్మన్ ప్రీత్ కౌర్(66) సొంతం చేసుకుంది. ఈ పరుగులతో హర్మన్ ప్రీత్ కౌర్ టాప్ స్కోరర్ గా నిలిచింది. నాట్ సీవర్ బ్రంట్(30) సత్తా చాటింది. ఆ తర్వాత టార్గెట్ చేజ్ చేయడంలో ఢిల్లీ జట్టు 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడినప్పటికీ.. లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 141 పరుగులకే ఢిల్లీ జట్టు పరిమితం కావలసి వచ్చింది.. ఓపెనర్ ప్లేయర్లు లానింగ్(13), షెఫాలి వర్మ (4) త్వరగానే అవుట్ అయ్యారు. దీంతో ఢిల్లీ జట్టుకు మెరుగైన ఆరంభం లభించలేదు. ఈ దశలో రోడ్రిగ్స్ (30) మెరుగ్గా ఆడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఢిల్లీ జట్టు ఒక దశలో 67 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఢిల్లీ జట్టును ఆల్రౌండర్ మరిజాన్ కాప్ ఆదుకుంది. ముంబై బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడింది. ఒక దశలో ఢిల్లీ జట్టును విజయం వైపుగా తీసుకెళ్లింది. అయితే 18 ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయింది. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా ముంబై వైపు టర్న్ తీసుకుంది. మొత్తంగా కాప్ 26 బంతుల్లో 40 పరుగులు చేసింది. కాప్ ఇన్నింగ్స్ లో ఐదు ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక కాప్ బౌలింగ్ లోను అదరగొట్టింది. రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటింది. కాగా, లీగ్ మ్యాచ్లో ఢిల్లీ జట్టు అదరగొట్టింది. వరుస విజయాలు సాధించి ఏకంగా ఫైనల్ దాకా వచ్చింది. కానీ ఫైనల్ మ్యాచ్లో సత్తా చాటలేక పోయింది. వరుసగా మూడుసార్లు ఫైనల్ వెళ్లినప్పటికీ.. ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించలేకపోయింది.
DC lost 3rd Consecutive Final of wpl
Feeling sad for #DC #WPL2025Final #WPLFinal pic.twitter.com/Kyk6ehqScu— Rajkumar Saini (@Dr_Raj23) March 16, 2025