DC Vs SRH 2024: ఢిల్లీ తో సమరం.. హైదరాబాద్ జట్టులో కీలక మార్పులు

చెన్నై, పంజాబ్, బెంగళూరు జట్లపై హ్యాట్రిక్ విజయాలు సాధించి సరికొత్త ఉత్సాహంతో హైదరాబాద్ జట్టు కనిపిస్తోంది. ఢిల్లీతో పోల్చి చూస్తే హైదరాబాద్ బలంగా కనిపిస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 20, 2024 11:26 am

DC Vs SRH 2024

Follow us on

DC Vs SRH 2024: ఈ ఐపీఎల్ సీజన్ లో పడి లేచిన కెరటం లాగా హైదరాబాద్ జట్టు జోరు కొనసాగిస్తోంది. బలమైన ముంబై, చెన్నై, పంజాబ్, బెంగళూరు జట్లను ఓడించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడిన హైదరాబాద్ జట్టు నాలుగు విజయాలతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ జట్టుతో జరిగే మ్యాచ్ లో గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడవ స్థానాన్ని ఆక్రమించుకోవాలని భావిస్తోంది. అంచనాలకు తగ్గట్టుగానే ఆటగాళ్లు ఆడుతుండడంతో హైదరాబాద్ యాజమాన్యం హ్యాపీగా ఉంది. ఇటీవల బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ లోనే రికార్డు స్థాయిలో 287 పరుగులు చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న హైదరాబాద్ జట్టు.. శనివారం ఢిల్లీ జట్టుతో మరో ఆసక్తికర పోటీకి సిద్ధమవుతోంది.

ఇప్పటికే చెన్నై, పంజాబ్, బెంగళూరు జట్లపై హ్యాట్రిక్ విజయాలు సాధించి సరికొత్త ఉత్సాహంతో హైదరాబాద్ జట్టు కనిపిస్తోంది. ఢిల్లీతో పోల్చి చూస్తే హైదరాబాద్ బలంగా కనిపిస్తోంది. అయితే ఢిల్లీ జట్టు ఈ సీజన్లో మూడు విజయాలు సాధించి ఆరో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఆ జట్టు తప్పక గెలవాల్సిందే. మరోవైపు శనివారం ఢిల్లీ సొంత మైదానంలో మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు కూర్పు విషయంలో మరింత ఫోకస్ చేసింది. ఈ సీజన్లో ఆశించినంత స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్న షాబాద్ అహ్మద్ ను పక్కన పెట్టాలని నిర్ణయించుకుంది. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. షాబాజ్ అహ్మద్ కంటే సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేయగలరని జట్టు అద్భుతంగా బౌలింగ్ చేయగలరని జట్టు అంచనా వేస్తోంది..

ఢిల్లీ, హైదరాబాద్ ఇప్పటివరకు 23 సార్లు పోటీ పడగా హైదరాబాద్ 12సార్లు, ఢిల్లీ 11 సార్లు విజయం సాధించాయి. గత మూడు మ్యాచ్లలో ఢిల్లీ పై హైదరాబాద్ పై చేయి సాధించింది. 2022లో జరిగిన ఒక్క మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించింది. గత సీజన్ లలో రెండు మ్యాచ్లు జరగగా.. చెరొకటి గెలిచాయి.

జట్టు (అంచనా) ఇదే..

నటరాజన్, జయదేవ్, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్/ షాబాద్ అహ్మద్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి,మార్క్ రమ్, క్లాసెన్, హెడ్, కమిన్స్ (కెప్టెన్)
ఇంపాక్ట్ ప్లేయర్: మయాంక్ మార్కండే.