DC Vs RCB IPL 2025: ఐపీఎల్ లో బెంగళూరు ప్రయాణం లేస్తూ, పడుతూ సాగుతుంది.. కానీ ఈసారి చాలా విభిన్నంగా ఆ జట్టు ప్రయాణం సాగుతోంది. తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ కోల్ కతా పై ఆడిన బెంగళూరు.. ఆ మ్యాచ్లో అద్వితీయమైన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ముంబై, చెన్నై ఇలా బలమైన జట్లను పడుకోబెట్టింది. సింపుల్ గా చెప్పాలంటే తీసి అవతల పడేసింది. మొత్తంగా ఈసారి ఓడిపోవడానికి కాదు.. గెలవడానికి వచ్చినట్టు.. ఐపీఎల్ లో జెండా పాతడానికే తాము ఎదురుచూస్తున్నట్టు సంకేతాలు ఇచ్చింది. బ్యాటింగ్లో తిరుగులేని బీభత్సం.. బౌలింగ్లో ఎనలేని నైపుణ్యం.. ఫీల్డింగ్లో అత్యంత చాకచక్యం.. ఇలా మూడు విభాగాలలో బెంగళూరు జట్టు ఈసారి అత్యంత బలంగా కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థి జట్ల ముందు తలవంచినప్పటికీ.. ఆ తర్వాత రివెంజ్ కూడా అదే స్థాయిలో తీర్చుకుంటున్నది. ఇటీవల పంజాబ్ జట్టుతో ఓడిన బెంగళూరు.. మళ్లీ అదే స్థాయిలో ఆ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇక ఢిల్లీకి కూడా అదే స్థాయిలో రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీ జట్టుకు వారి సొంతమైదానంలోనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పడేసింది.. బెంగళూరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన జాబితాలో గుజరాత్ టైటాన్స్ ఉంది.. కాకపోతే లీగ్ దశలో ఆ జట్టుతో ఒకే ఒక మ్యాచ్ ఆడే అవకాశం బెంగళూరుకు ఉంది. ఇప్పటికే ఆ మ్యాచ్ ఆడేసింది. ఆ మ్యాచ్లో బెంగళూరు ఓటమిపాలైంది. ఇక తాజా ఐపీఎల్ లో బెంగళూరు అసలైన రికార్డు సిసలైన విధంగా సృష్టించింది.
RCB – Table Toppers. 1️⃣
Kohli – Orange Cap holder.
Hazlewood – Purple Cap holder.DOMINANCE OF RCB IN IPL 2025. pic.twitter.com/tnhLNVQimU
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 27, 2025
Also Read: ఢిల్లీని పక్కనపెట్టిన ముంబై.. ఆ ఒక్క అడుగు వేస్తే పాయింట్ల పట్టికలో..
మూడు విభాగాలలో..
మూడు విభాగాలలో బెంగళూరు జట్టు అదరగొడుతోంది. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 443 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ విభాగంలో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదే బెంగళూరు జట్టు కీలకమైన బౌలర్ హాజిల్ వుడ్ 18 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ విభాగంలో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక జట్టు విభాగంలో బెంగళూరు అగ్రస్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు జట్టు 14 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. మొత్తంగా జట్టు విభాగంలో ఫస్ట్ ప్లేస్, బ్యాటింగ్ విభాగంలో ఫస్ట్ ప్లేస్, బౌలింగ్ భాగంలో ఫస్ట్ ప్లేస్.. అదేదో ప్రైవేట్ యాడ్ లాగా ర్యాంకులన్నీ మాకే అన్నట్టుగా.. ఇప్పటి ఐపీఎల్ లో మొదటి స్థానాలు మొత్తం తనకే అన్నట్టుగా బెంగళూరు ఆడుతున్నది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శిస్తోంది. ప్రత్యర్థులకు నిజంగానే మైదానంలో 70mm సినిమా చూపిస్తోంది. మరి ఈ విజయాలను బెంగళూరు చివరి వరకు కొనసాగిస్తుందా.. ప్లే ఆఫ్, ఫైనల్ లో ఇదే జోరు చూపించి తొలిసారి విజేతగా నిలుస్తుందా.. అంటే ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం చెబుతున్నారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు.
Also Read: హిట్ 3 కోసం రాజమౌళి మూవీని తాకట్టు పెట్టిన నాని… మహేష్ బాబు కోపానికి వస్తున్నాడా.?