DC vs KKR : ఇషాంత్ యార్కర్ కు బొక్క బోర్లా పడ్డ రస్సెల్.. ఏమా బాల్.. వైరల్ వీడియో

ఇషాంత్ వేసిన బంతి పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. " ఇషాంత్ వేసిన బంతిని రస్సెల్ సిక్స్ కొట్టాలి అనుకున్నాడు. కానీ ఆ బంతి వేగంగా దూసుకు వచ్చింది. దాని వేగాన్ని రస్సెల్ అంచనా వేయలేక పోయాడు. ఫలితంగా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పుడప్పుడు బౌలర్ల కు రస్సెల్ తల వంచుతాడు అనే దానికి ఇదే నిదర్శనమని" నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Written By: NARESH, Updated On : April 3, 2024 10:47 pm

DC vs KKR: Video of Andrew Russell falling to Ishant's yorker

Follow us on

DC vs KKR : తుఫాన్ అంటూ ఉంటాం కదా.. సుడిగాలి అని చెబుతుంటాం కదా.. నిప్పురవ్వ అని వర్ణిస్తుంటాం కదా.. పిడుగుపాటు అని భయపడుతుంటాం కదా.. ఇన్ని వర్ణనలు ఆ బంతికి ఆపాదించినా తక్కువే అవుతుంది. అలా వేశాడు మరి ఇషాంత్ శర్మ. కోల్ కతా భారీ స్కోర్ సాధించిందనో, మైదానం సహకరించడం లేదనే బాధో తెలియదు గాని..మొత్తానికి ఇషాంత్ శర్మ ఆ కోపాన్ని బంతి మీద చూపించాడు. ఫలితంగా ఆ బంతి రాకెట్ లాగా దూసుకెళ్లింది. కోల్ కతా బ్యాటర్ రస్సెల్ ను బొక్క బోర్లా పడేలా చేసింది. అంతే కాదు అతడి వికెట్ ను నేల కూల్చింది.

బుధవారం విశాఖపట్నంలోని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మైదానంలో కోల్ కతా, ఢిల్లీ జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కోల్ కతా ఆటగాడు సునీల్ నరైన్ 39 బంతుల్లో 85 రన్స్ చేశాడు. రఘు వంశీ 54, రస్సెల్ 41, రింకు సింగ్ 26 పరుగులు చేసి సత్తా చాటారు. అయితే ఈ మ్యాచ్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రస్సెల్ వికెట్ గురించి.. 19 ఓవర్ లో ఇషాంత్ శర్మ బౌలింగ్ కు దిగాడు. స్ట్రైకర్ గా రస్సెల్ ఉన్నాడు. అప్పటికి అతడి స్కోర్ 41. అతడి దూకుడు చూస్తుంటే హాఫ్ సెంచరీ సాధించేలా కనిపించాడు. ఐతే ఇషాంత్ యార్కర్ సంధించడంతో రస్సెల్ తడబడ్డాడు. బుల్లెట్ లాగా దూసుకు వచ్చిన ఆ బంతి రస్సెల్ ను క్లీన్ బౌల్డ్ చేసింది. అంతే కాదు ఆ బంతి వేగాన్ని అంచనా వేయకుండా రస్సెల్ కింద పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇషాంత్ వేసిన బంతి పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ” ఇషాంత్ వేసిన బంతిని రస్సెల్ సిక్స్ కొట్టాలి అనుకున్నాడు. కానీ ఆ బంతి వేగంగా దూసుకు వచ్చింది. దాని వేగాన్ని రస్సెల్ అంచనా వేయలేక పోయాడు. ఫలితంగా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పుడప్పుడు బౌలర్ల కు రస్సెల్ తల వంచుతాడు అనే దానికి ఇదే నిదర్శనమని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.