DC Vs CSK: ఐపీఎల్ లో భాగంగా శనివారం చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ (77) దూకుడు వల్ల నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. 184 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన చెన్నై జట్టు 25 పరుగుల దూరంలో ఓటమిపాలైంది. రచిన్ రవీంద్ర, డేవిడ్ కాన్వే, రవీంద్ర జడేజా, రుతు రాజ్ గైక్వాడ్ వంటి వారు విఫలమైన చోట.. విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీ వంటి వారు నిలబడ్డారు. విజయ్ శంకర్ హాఫ్ సెంచరీ చేశాడు. ధోని కూడా 30 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాటౌట్ గా నిలిచారు. ఒక కోణంలో ఇది బాగానే ఉంది. కాకపోతే ఇక్కడే ఢిల్లీ అక్షర్ పటేల్, కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ సరైన గేమ్ ప్లాన్ అమలు చేశారు. ఎదుటి ఆటగాడు అవుట్ కాకూడదు.. అలాగని మనం పరుగులు ఇవ్వకూడదు. బంతులు డాట్ అవ్వాలి. పరుగులు తీసే అవకాశం రాకూడదు. ఒకవేళ పరుగులు తీసినా అవి అంతంతమాత్రంగానే ఉండాలి. అంతిమంగా విజయం మనకు దక్కాలి.. ఇదే సూత్రాన్ని అక్షర్ పటేల్ అమల్లో పెట్టించాడు. బౌలర్లతో మార్చి మార్చి బౌలింగ్ వేయించాడు. కేఎల్ రాహుల్ బ్యాటర్ల మూమెంట్ ఆధారంగా బంతులు వేయాలని బౌలర్లకు సూచించాడు. ఫలితంగా విజయం చెన్నైకి దూరం జరగగా.. ఢిల్లీ జట్టు చెంతన చేరింది.
Also Read: విజయ్ శంకర్ తో మైండ్ గేమ్..అక్షర్ పటేల్ తెలివి మామూలుగా లేదు..
అదే అసలు కిక్కు
ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి విజయ్ శంకర్ గొప్ప అనుభూతిని పొందవచ్చు గాని.. అదేమీ చెన్నై జట్టుకు విజయాన్ని కలిగించలేదు. ఎందుకంటే 47 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం టి20 ఫార్మాట్ కు అసలు సెట్ అవ్వదు. ఎందుకంటే వేగానికి ప్రతిరూపంగా.. దూకుడుకు కొలమానంగా టి20 ఉంటుంది. ఎన్ని పరుగులు చేస్తే జట్టుకు అంత లాభం ఉంటుంది. ఇక చేజింగ్ లో అయితే మరింత వేగంగా ఆటగాళ్లు ఆడాల్సి ఉంటుంది. కానీ చెన్నై జట్టులో ధోని, విజయ్ శంకర్ ఆడిన తీరు గెలుపును అందించలేదు. వీరి స్థానంలో మరో ఆటగాళ్లు వస్తే అడ్డిమారి గుడ్డి దెబ్బ ఆట ఆడుతారు. ఆ సమయంలో ఢిల్లీ జట్టు గెలుపు అవకాశాలు గాలిలో దీపం లాగా మారుతాయి. పరిస్థితిని అంతటిదాకా తీసుకువచ్చే బదులు.. వీరితోనే ముగిస్తే బాగుంటుందని ఢిల్లీ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ భావించారు. ధోని ఇచ్చిన క్యాచ్ లను.. విజయ్ శంకర్ ఇచ్చిన క్యాచ్లను కావాలని మిస్ చేశారు. తద్వారా వారిద్దరూ అవుట్ అవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. కొత్త ఆటగాళ్లకు బ్యాటింగ్ చేసే అదృష్టం దక్కకుండా పోయింది. మొత్తంగా చూస్తే ఇన్నింగ్స్ ధోని, విజయ్ శంకర్ తోనే ముగిసింది. అంతిమంగా ఢిల్లీ జట్టుకు 25 పరుగుల తేడాతో విజయం లభించింది. అంతేకాదు ఈ విజయం ద్వారా ఢిల్లీ జట్టు టాప్ స్థానంలోకి వెళ్లిపోయింది. అందుకే అంటారు క్రికెట్లో దేహబలం కంటే.. బుద్ధి బలం ఎక్కువగా ఉండాలని.. దానిని వాస్తవంలో పెట్టారు కాబట్టే ఢిల్లీ జట్టు గెలిచింది. చెన్నై జట్టు హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది.
Thankyou MS Dhoni pic.twitter.com/URHeXJnAxT
— Dinda Academy (@academy_dinda) April 5, 2025