Tv5 Murthy Vs KA Paul: ప్రజాశాంతి పార్టీని పెట్టకముందు.. కేఏ పాల్ క్రైస్తవ మత బోధకుడిగా కొనసాగే వారు. ప్రపంచ దేశాలలో ఆయన తన ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఒకసారిగా ఆయన తన ప్రాభవాన్ని కోల్పోవడం మొదలుపెట్టారు. ప్రపంచ వేదికల మీద ప్రసంగించిన అతను.. చివరికి మీడియాలో, సోషల్ మీడియాలో జోకర్ గా మారిపోయారు. ఇక అంతిమంగా ఆయన ప్రజాశాంతి పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. అటు తెలంగాణ రాష్ట్రంలో.. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయాలపై.. తనదైన శైలిలో మాట్లాడుతున్నారు.. కొన్ని విషయాలలో మాత్రం కేఏ పాల్ మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. కాకపోతే ఆయన అదే స్థాయిలో కొనసాగిస్తే బాగుండేది. ఆరంభ శూరత్వం లాగా చేసుకుంటూ పోవడం వల్లే ఆయన అభాసుపాలవుతున్నారు. ఇక తాజాగా పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంబంధించి కొన్ని న్యూస్ ఛానల్లో నిర్వహించిన డిబేట్ కార్యక్రమంలో కేఏ పాల్ పాల్గొన్నారు. అయితే ఆ సమయానికి కేఏ పాల్ వేరే ప్రాంతంలో ఉండడం వల్ల ఆ ఛానల్ లో ప్రైమ్ టైం డిబేట్ నిర్వహిస్తున్న మూర్తి అనే జర్నలిస్టుతో ఫోన్ లో మాట్లాడారు.
Also Read: పెద్ది’ ని ‘దసరా’ తో పోలుస్తున్న నెటిజెన్స్..రెండిటి మధ్య ఉన్న తేడాలు ఇవే!
పిచ్చోడి కింద జమ కట్టాడు
ప్రైమ్ టైం డిబేట్లో భాగంగా ఆ ఛానల్ ప్రజెంటర్ మూర్తి కేఏ పాల్ ను అనేక ప్రశ్నలు అడిగారు. వాటికి కేఏ పాల్ సమాధానం చెప్పలేకపోయారు. ఇక ఇదే సందర్భంలో ఐజి విడుదల చేసిన ఆధారాలను మూర్తి బయటపెట్టారు. దీంతో కేఏ పాల్ మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత మొదటి రోజు కేఏ పాల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. ప్రవీణ్ మృతికి సంబంధించి తనకు అనేక అనుమానాలు ఉన్నాయని.. ఆయనది సహజమరణం కాదని పాల్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక ఇదే సందర్భంలో తనను దాదాపు ఇంటరాగేట్ చేసినంత పని చేసిన మూర్తిపై కేఏ పాల్ విమర్శలు చేశారు.” నిన్న మొన్న ఒక పిచ్చోడు ఐజి వివరాలు ఇచ్చాడు అన్నాడు. ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలు తీసుకొచ్చి చూపించాడు. ఇటువంటి వ్యక్తులు నన్ను ఇంటరాగేట్ చేయడం ఏంటి.. డిబేట్లో మాట్లాడాలి అని చెప్పి ఇలా చేయడం ఏంటని..” పాల్ వ్యాఖ్యానించారు. ఇక ఈ వీడియోను వైసిపి నాయకులు తమ అనుకూల సోషల్ మీడియా గ్రూపులలో తెగ పోస్ట్ చేస్తున్నారు.. అంతేకాదు కేఏ పాల్ మూర్తికి ఇచ్చి పడేసాడని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.
KA paul tv5 murthy ni ragging mamuluga cheyaledhu #jaganannamedia pic.twitter.com/A9JLJokxbn
— JAGANANNAMEDIA (@JAGANANNAMEDIA) April 5, 2025