David Warner: ఆస్ట్రేలియన్ టీం లో ఓపెనర్ గా ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న వార్నర్ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని తన ఫ్యాన్స్ కి ఒక షాకింగ్ విషయాన్ని చెప్పాడు. అదేంటి అంటే తను టెస్ట్, వన్డే రెండు ఫార్మాట్లకు రిటర్మెంట్ ని ప్రకటిస్తున్నట్టుగా తెలియజేశాడు. నిజానికి తను చాలా మంచి ఓపెనర్ అలాగే ఆస్ట్రేలియా టీమ్ కి ఎన్నో మంచి విజయాలను కూడా అందించాడు.
ప్రస్తుతం ఆయన మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. అయినప్పటికీ ఇప్పుడు తను రిటర్మెంట్ ప్రకటించిన ఏంటి అంటూ ఆస్ట్రేలియన్ టీం అభిమానులు అందరూ కూడా వాళ్ల బాధని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి డేవిడ్ వార్నర్ లాంటి ఒక ప్లేయర్ టీం లో ఉంటే ప్రత్యర్థి టీం కి చాలా వరకు భయం ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి సిచువేషన్ లో అయిన తను భారీ ఇన్నింగ్స్ ఆడుతూ టీం కి మంచి విజయాన్ని అందించడంలో ఎప్పుడు ముందుంటాడు. అయితే 2023 లో ఆస్ట్రేలియన్ టీం వన్ వరల్డ్ కప్ ట్రోఫీ ని సాధించింది.ఇక దాంతో అరోవ సారి ఆస్ట్రేలియా టీం కి వరల్డ్ కప్ ని అందించారు. ఇక ఈ టీంలో డేవిడ్ వార్నర్ ప్లేయర్ గా ఉండటమే కాకుండా టీం కి వరల్డ్ కప్ అందించడంలో చాలా తీవ్రమైన కృషి చేశాడు. వరల్డ్ కప్ మొత్తం మ్యాచ్ ల్లో 510 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీ లు, రెండు సెంచరీ లు ఉండడం విశేషం… ఇక వరల్డ్ కప్ టోర్నీలో ఇప్పటివరకు 500 లకు పైన పరుగులు చేసిన పేయర్లలో తను మూడోవ ప్లేయర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు…
ఇక ఇప్పుడు పాకిస్తాన్ తో ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ డేవిడ్ వార్నర్ కు చివరి మ్యాచ్ కానుంది. సిడ్నీలో ఆడనున్న ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ చివరి మ్యాచ్ కాబట్టి భారీ ఎత్తున చెలరేగి ఆడి సెంచరీని సాధించి సెంచరీతో టెస్ట్ క్రికెట్ కి వీడ్కోలు పలకాలని చూస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ కూడా తన హోమ్ గ్రౌండ్ అయిన సిడ్నీలో ఆడుతుండడం కూడా అతనికి బాగా కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి… ఇక ఇప్పటివరకు 111 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన వార్నర్ 8695 పరుగులు చేశాడు.ఇందులో 26 సెంచరీ లు 36 హాఫ్ సెంచరీ లు ఉన్నాయి.ఇక 161 వన్డే మ్యాచ్ లు ఆడిన వార్నర్ 6932 పరుగులు చేశాడు.
ఇక ప్రస్తుతం రెండు ఫార్మాట్లకు గుడ్ బై చెబుతూ టి20 ఫార్మాట్లో మాత్రం తను కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశ్యం లో ఉన్నానని స్పష్టం చేశాడు. అయితే తమ బోర్డు తన అవసరం ఉంది అని అనుకున్నప్పుడు మాత్రం వన్డేలో తను ఎప్పుడు ఆడడానికి సిద్ధంగా ఉంటానని కూడా తెలియజేశాడు. తను ఇంత సడన్ గా రిటర్మెంట్ ప్రకటించడం పట్ల కూడా మాట్లాడుతూ తన ఫ్యామిలీకి తను చాలా రోజుల నుంచి దూరంగా ఉండటం వల్ల తన పిల్లలతో గాని తన వైఫ్ తో కానీ ఎక్కువగా గడపలేకపోతున్నాడని అందువల్లే వన్డే టెస్ట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పినట్టుగా తెలియజేశాడు…