Cricketer Siraj dating News: మనదేశంలో క్రికెటర్లు ఆట తీరుతో మాత్రమే కాకుండా, ఏదో ఒక వివాదం ద్వారా ఎప్పుడో ఒకప్పుడు మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు ఆ వంతు సిరాజ్ కు వచ్చింది. మహమ్మద్ సిరాజ్ ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్లో అదరగొట్టాడు. ముఖ్యంగా లండన్ ఓవల్ టెస్టులో టీమిండియా కు ఊహించని విజయాన్ని అందించాడు. తద్వారా తనకంటూ సరికొత్త చరిత్రను సృష్టించుకున్నాడు. దీంతో ఇంటర్నేషనల్ నుంచి మొదలు పెడితే లోకల్ మీడియా వరకు సిరాజ్ నామస్మరణ చేశాయి.
కొద్దిరోజులపాటు సిరాజ్ గురించి ప్రత్యేకమైన కథనాలను ప్రసారం చేశాయి. అయితే సిరాజ్ ఇప్పుడు మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఇప్పుడు టీమిండియా ఎటువంటి టోర్నీలు రావటం లేదు. ఆసియా కప్ వరకు టీమిండియా కు ఎటువంటి టోర్నీలు లేవు. ఇన్ని రోజులపాటు ఇంగ్లీష్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడిన భారత ప్లేయర్లు ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. 25 రోజులకు మించిన ఆ విశ్రాంతమైన క్రికెట్ ఆడిన నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు ప్రస్తుతం చిల్ అవుతున్నారు. ఇందులో సిరాజ్ కూడా ఉన్నాడు. ఇటీవల తనకిష్టమైన హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. ఇంగ్లాండ్ నుంచి హైదరాబాద్ గడ్డమీద అడుగు పెట్టిన తర్వాత సిరాజ్ కు అద్భుతమైన స్వాగతం లభించింది. అతడు ఇంటి వరకు అభిమానులు ర్యాలీ నిర్వహించారు..
ఇప్పుడు సిరాజ్ వార్తల్లో వ్యక్తిగా వినడానికి ప్రధాన కారణం ఆశాభోంస్లే మనవరాలు జనై భోంస్లే. ఎందుకంటే ఆమెతో గతంలో ముంబైలో ఒక పార్టీలో సిరాజ్ కనిపించాడు. వారిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అంతేకాదు వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని ప్రచారం మొదలైంది. దీంతో వారిద్దరు ఈ వ్యవహారంపై స్పందించారు. తమ మధ్య అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ గాసిప్ రాయుళ్లు ఊరుకోలేదు.. అడ్డగోలుగా ప్రచార మొదలుపెట్టారు. దీంతో సిరాజ్ మరో అడుగు ముందుకు వేసి.. రాఖీ పండుగ సందర్భంగా జనైతో రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తమ ఇద్దరి మధ్య అన్నా చెల్లెలి బంధం తప్ప మరొకటి లేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో సిరాజ్ – ఆశ మనవరాలి మధ్య ఏమీ లేదని స్పష్టమైంది.