Producer NagaVamsi: ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు అట్టహాసంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి అభిమానులు అసంఖ్యాకంగా హాజరయ్యారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్, హృతిక్ లతో పాటు నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భమగా నాగవంశీ(Nagavamsi) మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. చాలా ఆవేశంతో ఆయన మాట్లాడాడు.
ఆయన మాట్లాడుతూ అసలు ప్రపంచం లో ఏ ఇద్దరి ముందు అయితే నాకు నోటి నుండి మాట రాదో, వాళ్లిద్దరూ ఇప్పుడు క్రిందనే ఉన్నారు..మీరు అరిస్తే ఇప్పుడు నాకు నోటి నుండి మాట కూడా రాదు. కాస్త నాకు సహకరించండి. ఎలా ఉంది ఏర్పాట్లు మొత్తం.ఎన్టీఆర్ అన్న బాలీవుడ్ కి తీసుకొని వెళ్లినట్టు లేదు, హృతిక్ అన్నని టాలీవుడ్ కి తీసుకొచ్చినట్టు ఉంది కదా. రేపు సినిమా కూడా అలాగే ఉంటుంది. మన తెలుగు సినిమా లాగానే ఉంటుంది. ఎవరైనా హిందీ డబ్బింగ్ సినిమా అంటే ఊరుకోకండి. పొద్దునే ప్రోమో చూశారు కదా, లిప్ సింక్ తో సహా, ప్రతీ ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉంది. ఇది పర్ఫెక్ట్ తెలుగు సినిమా. థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు అయాన్ ముఖర్జీ గారు ఎన్టీఆర్ అన్నని తెలుగు డైరెక్టర్స్ చూపించిన దానికంటే అద్భుతంగా చూపించాడు అనే ఫీలింగ్ తో వస్తారు. ప్రతీ ఒక్కరు గర్వపడుతారు. మిగతా వాటి గురించి అసలు ఆలోచించకండి. మనం హృతిక్ గారిని తెలుగులోకి గ్రాండ్ గా ఆహ్వానిస్తున్నాము, అది ఎంత గ్రాండ్ గా వెల్కమ్ చూపిస్తారు అనేది మీరు ఆగష్టు 14 న నిరూపించాలి. గత ఏడాది దేవర కి ఎంత ప్రేమ చూపించారో, ఈ ఏడాది అంతకు మించి చూపించాలి. తారక్ అన్న స్టామినా ఏంటో దేశం మొత్తం చూడాలి. హిందీ లో నెట్ వసూళ్లు వస్తాయో, అంతకు మించి ఒక్క రూపాయి నెట్ వసూళ్లు మనం ఎక్కువ పెట్టాలి’ అంటూ ఆయన చాలా ఆవేశంతో మాట్లాడాడు.