Homeక్రీడలుక్రికెట్‌SRH Cummins impact: కమిన్స్ వచ్చినా ఏం ఉపయోగం? పాపం సన్ రైజర్స్!

SRH Cummins impact: కమిన్స్ వచ్చినా ఏం ఉపయోగం? పాపం సన్ రైజర్స్!

SRH Cummins impact: హైదరాబాద్ జట్టుకు గుడ్ న్యూస్ అని పొద్దుటినుంచి మీడియాలో.. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది.. హైదరాబాద్ జట్టులోకి కమిన్స్ వస్తున్నాడని.. ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్ అతనికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని.. హైదరాబాద్ జట్టుకు ఇక తిరుగు లేదని క్రికెట్ విశ్లేషకులు భవిష్య వాణి చెప్పేశారు . ఇంకేముంది హైదరాబాదు జట్టుకు తిరుగులేదు.. ఐపీఎల్ లో హైదరాబాద్ కు అడ్డులేదు అని అభిమానులు భావించారు…

కమిన్స్ వచ్చినప్పటికీ హైదరాబాద్ జుట్టుకు పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే హైదరాబాద్ జట్టులోకి అతడు వచ్చినప్పటికీ సారథ్యం వహించలేడు. ఎందుకంటే ఇప్పటికీ అతడు పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించలేదని వార్తలు వస్తున్నాయి. ఒక ఆటగాడు పూర్తిస్థాయిలో సామర్థ్యం సాధించకపోతే జట్టులోకి తీసుకోరు. ఐపీఎల్ లాంటి ఫార్మాట్లో అది అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే ఐపీఎల్లో ప్లాట్ మైదానాలు ఉంటాయి. వేగంగా పరుగులు చేయడానికి అవకాశం ఉంటుంది. బౌలర్లు బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టే విధంగా బంతులు వేయాల్సి ఉంటుంది. అయితే కమిన్స్ పూర్తిస్థాయిలో సామర్థ్యం సాధించకపోవడంతో అతడు జట్టులో ఆటగాడిగా కూడా అవకాశం చోటు సంపాదించలేడు.

ప్రస్తుతం హైదరాబాద్ జట్టుకు ఇషాన్ కిషన్ నాయకత్వం వహిస్తున్నాడు. అతడు తాత్కాలిక సారధి అని మేనేజ్మెంట్ చెబుతున్నప్పటికీ.. ఈ సీజన్ మొత్తం అతడే సారధిగా ఉంటాడని తెలుస్తోంది. అదే జరిగితే కమిన్స్ కు జట్టులో చోటు లభిస్తుందా? సాధారణ ఆటగాడిగానే అతడు ఉంటాడా? రిజర్వ్ బెంచ్ కే పరిమితమవుతాడా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.

ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ను ఎలాగైనా విజేతగా నిలపాలని కావ్య మారన్ దృఢ నిశ్చయంతో ఉంది. ఇటీవల సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో సన్ రైజర్స్ విజేతగా నిలిచింది. ఈ ప్రకారం ఐపీఎల్లో కూడా అదే జోరు కొన సాగించాలని హైదరాబాద్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అందువల్లే ఆటగాళ్ల కంటే.. జట్టు విజయాలకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో కమిన్స్ కు జట్టులో చోటు లభించే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అతడు రిజర్వ్ బెంచ్ కే కనుక పరిమితమైతే.. అప్పుడు హైదరాబాద్ బౌలింగ్ దళాన్ని ఎవరు ముందుండి నడిపిస్తారనేది చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper
Exit mobile version