Dhoni Lookalike Fan: ఇండియన్ క్రికెట్ లో మకుటం లేని మారాజుగా ఎంఎస్ ధోనిని అభివర్ణిస్తారు. దేశానికి రెండు వరల్డ్ కప్ లు అందించడంతో పాటు ఐపీఎల్ లో ఇప్పటికీ సీఎస్ కే ను నెంబర్ వన్ జట్టుగా ఉంచుతున్న ధోనికి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇండియన్ క్రికెట్ లో ధోని లేకపోవడం వెలితిగా ఉందని చాలా మంది పలు సందర్భాల్లో పేర్కొంటూ ఉంటారు. అయితే ఐపీఎల్ లో ఆయన ప్రదర్శన చూసి ఎంతో మురిసిపోతుంటారు. ఇటీవల ఐపీఎల్ నుంచి కూడా ధోని నిష్క్రమిస్తున్నట్లు తెగ వార్తలు వస్తున్నాయి. శరీరం సహకరించడంతో పాటు ఒత్తిళ్లు, ఇతర కారణాల వల్ల ధోని రిటైర్మెంట్ తీసుకుంటారని అంటున్నారు. ఈ తరుణంలో ధోనికి సంబందించిన ఆసక్తి విషయం ఒకటి సోషల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. అచ్చం ఆయనలా ఉన్న ఓ వ్యక్తి ప్రేక్షకుల మధ్యలో కనిపించి ఆకట్టుకున్నాడు.
ఐపీఎల్ జగజ్జేతగా కొనసాగుతున్న ధోని ఆల్ టైం రికార్డులు ఎన్నో సృష్టించాడు.. సృష్టిస్తూనే ఉన్నాడు. ఇప్పుడున్న జట్లలో జీయో సినిమా యాప్లో ఎక్కువ మంచి వీక్షించింది చెన్నై టీంనే అని వెల్లడైంది. అందుకు కారణం ధోనినే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో ధోని రిటైర్మెంట్ విషయంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇంకొన్నాళ్లపాటు ధోని ఐపీఎల్ లో కొనసాగాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ఈ వార్తలపై ధోని స్పందించాడు. తాను అప్పుడే రిటైర్మెంట్ ప్రకటన చేయనని చెప్పాడు.
ఇక లేటేస్టుగా ధోనికి సంబందించి ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల మధ్యలో ఉన్న ఓ వ్యక్తి సీఎస్ కే డ్రెస్ వేసుకున్నాడు. టోపీ కూడా ధరించాడు. తెల్లడి గడ్డం కొంచెం వచ్చి అచ్చం ధోనిలాగే కనిపించాడు. ఒక్కోసారి ఓ అమ్మాయి వెనకాల చాటుగా వెళ్తూ మళ్లీ బయటకు వస్తున్నాడు. అలా చాటుగా వెళ్లినప్పుడు ధోని అక్కడ కూర్చున్నాడేంటి? అన్న అనుమానం కలుగుతుంది. ఆయన గురించి తెలియగానే కెమెరా అటువైపు వెళ్లింది. ఆయనన చూసి అంతా ఆశ్చర్యపోయారు. అందరూ ధోని 2 అంటూ సందడి చేస్తున్నారు.
అత్యధిక స్ట్రైకింగ్ రేటు కలిగిన బ్యాట్స్ మెన్ జాబితాలలో ధోని చేరాడు. ఐపీఎల్ లో మొత్తం 10 మ్యాచ్ లు ఆడిన ధోని కేవలం 6 ఇన్నింగ్స్ లోనే బ్యాటింగ్ చేశాడు. ఇందులో ధోని 211.42 స్ట్రైక్ రేటుతో 74 పరుగులు చేశారు. ఇందులో 2 బౌండరీలు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఇక 2023 ఐపీఎల్ లో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే 200 స్ట్రైక్ రేట్ నుకలిగి ఉన్నారు. వారిలో మహేంద్ర సింగ్ ధోని ఒకరు. మరొకరు రాహుల్ తెవాటియా.