Homeక్రీడలుCSK Vs GT 2024: గిల్ పప్పులు ధోని ముందు ఉడకలేదు

CSK Vs GT 2024: గిల్ పప్పులు ధోని ముందు ఉడకలేదు

CSK Vs GT 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో డిపెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టిన చెన్నై జట్టు.. ఆ స్థాయికి తగ్గట్టుగానే ఆడుతోంది. గత సీజన్ లో ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ జట్టుపై విజయం సాధించిన చెన్నై.. మంగళవారం జరిగిన మ్యాచ్ లోనూ ఏకపక్ష గెలుపును దక్కించుకుంది. సమిష్టి కృషితో 63 పరుగుల తేడాతో అద్భుతమైన విక్టరీ అందుకుంది. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు జరిగిన మ్యాచ్ లలో చెన్నై సాధించిన గెలుపే భారీ విజయంగా నమోదయింది.

ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు అద్భుతమైన ఫీల్డింగ్ తో గుజరాత్ జట్టును ఇబ్బంది పెట్టింది. గుజరాత్ జట్టు మాత్రం పేలవమైన ఫీల్డింగ్ తో మ్యాచ్ దూరం చేసుకుంది.. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 206 పరుగులు చేసింది. చెన్నై జట్టులో శివమ్ దూబే(23 బంతుల్లో రెండు ఫోర్లు, 5 సిక్స్ లతో 51) విధ్వంసకరమైన బ్యాటింగ్ చేశాడు. రుతు రాజ్ గైక్వాడ్(46), రచిన్ రవీంద్ర (46) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో చెన్నై స్కోర్ పరుగులు పెట్టింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. సాయి కిషోర్, జాన్సన్, మోహిత్ శర్మ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు..

అనంతరం గుజరాత్ జట్టు చేజింగ్ కు దిగింది. 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడింది. 8 వికెట్లు నష్టపోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ జట్టులో సాయి సుదర్శన్ (37) మినహా మిగతావారు దారుణమైన ఆట తీరు ప్రదర్శించారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. మిచెల్, మతిషా పతీరణ చెరో వికెట్ పడగొట్టారు.

ఈ మ్యాచ్ ను చెన్నై ఆటగాడు అజింక్య రహానే మలుపు తిప్పాడు. భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో రంగంలోకి దిగిన గుజరాత్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించలేదు. ఓపెనర్లు గిల్(8), సాహా (21) త్వరగానే అవుట్ కావడంతో.. ఒక్కసారిగా ఆ జట్టు కుదుపునకు లోనయింది. దీంతో సాయి సుదర్శన్ జట్టు భారాన్ని తన భుజాల మీదకు ఎత్తుకున్నాడు. స్థిరంగా ఆడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అతడికి చెన్నై బౌలర్లో అవకాశం ఇవ్వలేదు. ఈలోగా ధోని పట్టిన అద్భుతమైన క్యాచ్ కు విజయ్ శంకర్ (12) వెనుతిరిగాడు. అతడు అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ తో కలిసి సాయి సుదర్శన్ జట్టను ఆదుకునే ప్రయత్నం చేశాడు.

ఈ దశలో అజింక్యా రహానే అదిరిపోయే క్యాచ్ పట్టాడు దీంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. రహనే సూపర్ మాన్ తరహాలో డైవింగ్ చేసి క్యాచ్ పట్టడంతో మిల్లర్ అవుట్ అయ్యాడు. దీంతో గుజరాత్ ఓటమి దాదాపు ఖాయమైంది. వేగంగా ఆడే క్రమంలో సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. ఓమర్జాయ్ (11), రాహుల్ (6), రషీద్ ఖాన్ (1) వెంట వెంటనే అవుట్ అయ్యారు. చివర్లో ఉమేష్ యాదవ్ (10), జాన్సన్ (5) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ గుజరాత్ కు భారీ ఓటమి తప్పలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

US Iran Conflict

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
Oktelugu Epaper