Cristiano Ronaldo: రోనాల్డో.. వరల్డ్ కప్ లలో ఆడడు.. బయట ఇలా దంచికొడుతాడు

ఫుట్బాల్ హిస్టరీ లోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ప్లేయర్గా రికార్డు సాధించాడు క్రిస్టియనో రోనాల్డో. మంగళవారం రియాద్‌లోని కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన అరబ్ క్లబ్ ఛాంపియన్స్ క్లబ్ మ్యాచ్‌లో రోనాల్డో సంచలనాత్మకమైన హెడెడ్ గోల్ చేదించడమే కాకుండా ఫుట్బాల్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

Written By: Vadde, Updated On : August 1, 2023 8:58 pm

Cristiano Ronaldo

Follow us on

Cristiano Ronaldo: తన ఆటతో ఆల్ టైం రికార్డ్ ను స్థాపించడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన గోల్‌స్కోరర్ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రొనాల్డో. క్రిస్టియానో రోనాల్డో క్రేజ్ ఏ రేంజ్ లో ఉంది అంటే ఫుట్బాల్ పై ఎక్కువ ఆసక్తి చూపని వ్యక్తులకు కూడా ఫుట్బాల్ ప్లేయర్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రోనాల్డో. ఇక రోనాల్డో మ్యాచ్ ఆడుతున్నాడు అంటే కచ్చితంగా స్టేడియం లో ఉన్న అందరి కళ్ళు అతనిపైనే ఉంటాయి. బాల్ రోనాల్డో దగ్గరకు వెళ్లాక అది గోల్డ్ వరకు ఎలా వెళ్తుంది అనేది ప్రేక్షకులకు ఒక పెద్ద థ్రిల్లర్ సినిమా ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది.

ఫుట్బాల్ హిస్టరీ లోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ప్లేయర్గా రికార్డు సాధించాడు క్రిస్టియనో రోనాల్డో. మంగళవారం రియాద్‌లోని కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన అరబ్ క్లబ్ ఛాంపియన్స్ క్లబ్ మ్యాచ్‌లో రోనాల్డో సంచలనాత్మకమైన హెడెడ్ గోల్ చేదించడమే కాకుండా ఫుట్బాల్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఎవరు ఊహించని విధంగా రోనాల్డో చేసిన రెండో గోల్ కారణంగా యుఎస్ మొనాస్టిర్ టీం పై అల్ నాసర్ 4-1 స్కోర్ తో సంచలన విజయాన్ని సాధించింది. రోనాల్డో సాధించిన ఈ విజయం పై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది.

క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్ నాజర్ జట్టు యూరోపియన్ క్లబ్‌లైన బెనిఫీసియా, సెల్టా విగోలోతో ఓటమి తర్వాత ఈ సీజన్లో అందుకున్న మొదటి విజయం ఈ మ్యాచ్ లోది. ఎంతో ఉత్కంఠంగా సాగుతున్న ఈ మ్యాచ్లో సరిగా 42వ నిమిషానికి జట్టు తరఫున తాలిస్కా మొదటి గోల్ చేయడం జరిగింది. ఆ తరువాత ఆల్ నాజర్ టీం యొక్క డిఫెండర్ చేసిన చిన్న మిస్టేక్ కారణంగా ప్రత్యర్థికి ఒక గోల్ పాయింట్ సమర్పించుకున్నారు. ఇక మ్యాచ్ చేయి దాటిపోతుంది అనుకున్న సమయంలో దూకుడుగా ఆడిన రోనాల్డో 74 నిమిషంలో అద్భుతమైన హెడర్ తో గోల్ సాధించాడు.

ఇక ఈ ఆటలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రోనాల్డో చేసిన గోల్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఎందుకంటే గత కొన్ని మ్యాచ్లలో రోనాల్డో నుంచి ఒక్క గోల్ కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అద్భుతమైన హెడర్ ద్వారా గోల్ సాధించి జర్మన్ లెజెండ్ అయిన గెర్డ్ ముల్లర్ 144 హెడర్ గోల్స్‌ రికార్డును రోనాల్డో అధిగమించాడు. రోనాల్డో మెరుపు వేగంగా రాణించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తుంటే వరల్డ్ కప్ లో ఆడకుండా ఇలా బయట దంచి కొట్టే పర్ఫామెన్స్ కనబరచడం వల్ల ఒరిగింది ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అవసరమైనప్పుడు దూకుడు ప్రదర్శన కనబరచకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టినంత మాత్రాన లాభం ఏమిటి అనేది కొందరి వాదన.