Conjunctivitis: వాతావరణం మారింది. ఆకస్మాత్తుగా వర్షాలు, మాడు పగలగొట్టేలా ఎండలు, ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉక్కపోతల సర్వసాధారణమైపోయాయి. ఇలా వాతావరణం ఏర్పడిన మార్పులు మనుషుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అలాంటి వాటిల్లో కళ్ల కలక(పింక్ ఐ లేదా ఐ ప్లూ) ప్రస్తుతం నరకం చూపిస్తోంది. దేశ రాజధాని నుంచి తెలంగాణ రాజధాని వరకు ఈ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రజలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కళ్ల కలకలను వైద్య పరిభాషలో పింక్ ఐ అని పిలుస్తుంటారు. కళ్ల కలక ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంటుంది. రద్దీ అధికంగా ఉండే ప్రదేశాలతో పాట బస్సులు, మెట్రోల్లో ప్రయాణించే పింక్ ఐ సోకే ప్రమాదం ఉంటుంది. వాహనాల్లో ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కళ్ల కలక వల్ల కళ్ల నుంచి నిత్యం నీరు కారుతూనే ఉంటుందని కనుక వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెబుతున్నారు.
కళ్ల కలక బ్యాక్టీరియా ద్వారా సోకుతుంది. కళ్లు ఎర్రబారుతాయి. దురదగా ఉంటాయి. కళ్ల రెప్పల్లో వాపు ఉంటుంది. నిత్యం నీరు కారుతూనే ఉంటుంది. ఈ వ్యాధి సోకితే తగ్గేందుకు ఒకటి నుంచి వారం రోజులు దాకా పడుతుంది. ఒక్కోసారి రెండు వారాలు కూడా పట్టొచ్చు. వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి సోకుతుంది. ఇన్ ఫెక్షన్ సోకినప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఇన్ ఫెక్షన్ చిన్నపాటిదైనప్పటికీ.. అది రోజువారీ జీవితాన్ని, పనులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఏ చిన్న పని కూడా చేసుకోనివ్వకుండా చేస్తుంది. ఇది సాధారణంగా గాలి ద్వారా సోకుతుంది. వర్షాకాలంలో వాతావరణంలో మురికి, కాలుష్యం పెరగడం వల్ల కండ్ల కలక సోకుతుంది.
కళ్ల కలక సమస్య నివారణకు మందులు వాడాలి. సోకిన వ్యాధినిరోధక శక్తి ఆధారంగా వ్యాధి నిరవాణ ఆధారపడి ఉంటుంది. ప్రయాణ సమయంలో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సోకుతుంది కాబట్టి.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. మురికిగా ఉన్న ప్లేట్లను తాకకూడదు. మురికిగా ఉన్న చేతులతో కళ్లను తాకడం సరికాదు. ఇల చేయడం ద్వారా వైరస్ నేరుగా కళ్లకు వ్యాపిస్తుంది. రద్దీగా ఉన్న ప్రాంతంలో చేతులను తాకితే శాని టైజర్‌తో కడుక్కోవాలి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణించినప్పుడు సన్ గ్లాసెస్ లేదా సేఫ్టీ గ్లాసెస్ ధరించడం మంచిది. ఇవి దుమ్ముధూళి నుంచి కళ్లను కాపాడతాయి. కళ్ల కలకలు వచ్చిన వారు భౌతిక దూరం పాటించాలి. కళ్ల కలక సోకినప్పుడు దురదగా అనిపిస్తుంది. అప్పుడు కళ్లను అదే పనిగా రద్దు కూడదు. తరుచూ కళ్లను శుభ్రంగా కడగాలి. తుడుచుకోవడానికి శుభ్రమైన కాటన్ వస్త్రాన్ని వినియోగించాలి. లేదా టిష్యూ పేపర్‌ను ఉపయోగించాలి. కళ్ల కలక సోకిన వారి వ్యక్తిగత వస్తువులను ఇతరులకు ఇవ్వొద్దు.