Virat Kohli swag: తనకు నచ్చని వాళ్ళ పట్ల.. తనను ఇబ్బంది పెట్టే వాళ్ళ పట్ల విరాట్ కోహ్లీ అత్యంత రాక్షసంగా ఉంటాడు. చివరికి సొంత జట్టు క్రీడాకారులపై కూడా విరాట్ కోహ్లీ ఏమాత్రం కనికరం చూపించడు. తన ఈగోను ఇబ్బంది పెడితే ఏమాత్రం ఊరుకోడు విరాట్ కోహ్లీ.
ఇటీవల ఐపీఎల్ జరిగినప్పుడు బెంగళూరు మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. బెంగళూరు విధించిన లక్ష్యాన్ని ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ వీరోచిత పోరాటంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చేదించింది. దీంతో కేఎల్ రాహుల్ బ్యాట్ తో మైదానంలో గిరి గీశాడు. ఇది తన సొంత ప్రాంతమని గట్టిగా నినదించాడు. దానిని మనసులో పెట్టుకున్న విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టుతో జరిగిన తదుపరి మ్యాచ్లో వీర విహారం చేశాడు. కేఎల్ రాహుల్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. అంతేకాదు కేఎల్ రాహుల్ ను ఉద్దేశించి నేరుగా విమర్శలు చేశాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ తన తప్పు తెలుసుకుని కోహ్లీ వద్దకు రావడంతో.. మన్నించాడు. ఈ ఉదాహరణ చాలు విరాట్ కోహ్లీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పడానికి..
సొంత జట్టు ఆటగాడి మీదనే విరాట్ కోహ్లీ ఆలా ప్రవర్తిస్తే.. తనకు పంటికింది రాయిలాగా.. చెప్పులో ముల్లులాగా మారిపోయిన గౌతమ్ గంభీర్ పై ఇంకా ఎలా ప్రవర్తిస్తాడు.. సమయం కోసం ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ రివెంజ్ తీర్చుకున్నాడు. ఆదివారం రాంచి మైదానంలో సూపర్ సెంచరీ చేసిన తర్వాత .. టీమ్ ఇండియా గెలిచిన తర్వాత.. విరాట్ కోహ్లీ టీమిండియా జెర్సీతో తన మానాన తాను వెళ్లిపోయాడు. ఎదురుగా గౌతమ్ గంభీర్ కనిపించినప్పటికీ.. జస్ట్ చూసుకుంటూ వెళ్లిపోయాడు. కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. తన ఫోన్ చూసుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు.
విరాట్ కోహ్లీ అలా వెళ్ళిపోవడం అభిమానులకు తెగ నచ్చింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ డై హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చింది. విరాట్ కోహ్లీ చూసిన అభిమానులు.. గౌతమ్ గంభీర్ కు ఇలానే జరగాలంటూ కామెంట్లు చేస్తున్నారు. విరాట్ కోహ్లీ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో గౌతమ్ గంభీర్ కు ఇప్పటికైనా అర్థమై ఉండాలని వ్యాఖ్యానిస్తున్నారు.
Kohli completely ignored gambhir after win pic.twitter.com/XNBwPZPN0q
— ADITYA (@Wxtreme10) December 1, 2025