Chiranjeevi in Spirit Movie: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) నటిస్తున్న చిత్రాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘స్పిరిట్'(Spirit Movie) మూవీ షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. ముందుగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నాలుగు రోజుల క్రితం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా విచ్చేయడం విశేషం. ఇక ఆ మరుసటి రోజు నుండి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టారు. 27 వ తారీఖు నుండి ప్రభాస్ కూడా ఈ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆయన షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ కి తండ్రి క్యారక్టర్ లో కనిపించబోతున్నాడని చాలా కాలం నుండి ఒక టాక్ వినిపిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.
ఈ విషయం పై సందీప్ వంగ రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ, అందులో ఎలాంటి నిజం లేదు, నేను చిరంజీవి గారితో చేస్తే, ,లీడ్ రోల్ మూవీ నే చేస్తాను అని చెప్పుకొచ్చాడు. కానీ సందీప్ వంగ స్పిరిట్ చిత్రాన్ని ‘సందీప్ వంగ సినిమాటిక్ యూనివర్స్’ గా మార్చే పనిలో ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఖైదీ, విక్రమ్, లియో చిత్రాలు ఎలా అయితే వచ్చాయో, సందీప్ సినిమాటిక్ యూనివర్స్ లో కూడా స్పిరిట్, స్పిరిట్ 2 ఇలా వరుసగా సినిమాలు రాబోతున్నాయి అన్నమాట. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో మెగాస్టార్ చిరంజీవి తో ఒక ఫుల్ లెంగ్త్ సినిమా ఉండబోతుంది. అందులో భాగంగా ఆయన క్యారక్టర్ ని స్పిరిట్ చిత్రం లో పరిచయం చేస్తాడని, ఆ తర్వాత క్యారక్టర్ ని లీడ్ రోల్ గా పెట్టి ఒక సినిమా తీస్తాడని టాక్.
‘స్పిరిట్’ చిత్రం లో చిరంజీవి ప్రభాస్ కి తండ్రి క్యారక్టర్ లో కనిపిస్తాడో లేదో తెలియదు కానీ, ఒక పవర్ ఫుల్ క్యామియో రోల్ లో కనిపించాబోతున్నాడు. అందుకే ఆయన పూజ కార్యక్రమాలకు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. సందీప్ వంగ చిరంజీవి కి ఎలాంటి అభిమాని అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సందర్భాల్లో ఆయన చిరంజీవి మీద తనకు ఉన్న అభిమానాన్ని చెప్పుకున్నాడు. అందుకే స్పిరిట్ చిత్రం లో మెగాస్టార్ ని వేరే లెవెల్ లో చూపించబోతున్నాడని టాక్. సినిమా మొత్తం ప్రభాస్ ని ఏ రేంజ్ లో ఎలివేట్ చేసి చూపిస్తాడో, అంతకు రెండు రెట్లు ఎక్కువగా చిరంజీవి క్యారక్టర్ ని ఎలివేట్ చేసి చూపిస్తాడని టాక్. కనిపించేది కాసేపే అయినా, ఎక్కువ కాలం మాట్లాడుకునేలా ఆయన క్యారక్టర్ ఉంటుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన న్యూ ఇయర్ కానుకగా చేయబోతున్నారని తెలుస్తోంది.