Homeక్రీడలుక్రికెట్‌Tim David explosive innings: టిమ్ డేవిడ్.. బెంగళూరు కా సలార్.. చిన్నస్వామి స్టేడియాన్ని ఎరుపెక్కించాడు

Tim David explosive innings: టిమ్ డేవిడ్.. బెంగళూరు కా సలార్.. చిన్నస్వామి స్టేడియాన్ని ఎరుపెక్కించాడు

Tim David explosive innings: మామూలు విధ్వంసం కాదు అది.. ఊచకోతకు సరికొత్త పర్యాయపదం వెతుక్కోవాలి. బీభత్సం.. రౌద్రం.. ఎదురుదాడి.. ఈ పదాలు సరిపోవు. బౌలర్ ఎవరని చూడలేదు. బంతిని మాత్రమే చూశాడు. స్టాండ్స్ అవతలికి పంపించడమే లక్ష్యంగా కొట్టాడు. అతడు కొట్టిన కొట్టుడుకు బంతి స్టేడియం అవతల పడిందంటే బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

చెన్నై తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. 14.1 ఓవర్ల వరకు ఆ జట్టు స్కోరు మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు. ఆ తర్వాత డేవిడ్ రాకతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. విధ్వంసానికి పరాకాష్టగా అతడు చేసిన బ్యాటింగ్ తో చిన్న స్వామి స్టేడియం మొత్తం ఎరుపు రంగు పులుముకుంది. కేవలం 25 బంతుల్లోనే డేవిడ్ మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు. 70 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అతడు అలా బ్యాటింగ్ చేస్తుంటే చెన్నై బౌలర్లు ప్రేక్షకుల మాదిరిగా చూస్తూ ఉండిపోయారు.

ఈ మ్యాచ్లో సాల్ట్ 46, విరాట్ కోహ్లీ 28, దేవదత్ 50, పాటిదర్ 48* పరుగులు చేశారు.. చిన్నస్వామి స్టేడియం బౌండరీ మీటర్ చిన్నగా ఉంటుంది. పైగా ఈ మైదానం ప్లాట్ గా రూపొందించడంతో పరుగులు ప్రవాహ మాదిరిగా వచ్చేశాయి. పాటిదర్, డేవిడ్ నాలుగో వికెట్ కు అజేయంగా 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అది కూడా 35 బంతుల్లోనే సాధించడం విశేషం.

చివరి మూడు ఓవర్లలో బెంగళూరు జట్టు పరుగులు తీసింది. 18 ఓవర్ లో 17 కంటే ఎక్కువ పరుగులు, 19 ఓవర్లో 19 పరుగులు, 20 ఓవర్లో 20 కంటే ఎక్కువ పరుగులు సాధించింది బెంగళూరు.. ముఖ్యంగా 17వ ఓవర్ నూర్ అహ్మద్ వేశాడు. అతడు వేసిన నాలుగో బంతిని డేవిడ్ భారీ సిక్సర్ కొట్టాడు. ఆ బంతి కాస్త మైదానం అవతల పడిపోయింది. ఈ షాట్ కు ఏకంగా 82 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. డేవిడ్ బ్యాటింగ్ నేపథ్యంలో.. చిన్నస్వామి స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. అంతేకాదు అతడి దూకుడు నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహక కమిటీ మెన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version